twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అల్లు అర్జున్ పర్శనల్ టాక్: పవన్ , త్రివిక్రమ్...ఇంకా పలు విషయాలపై

    By Srikanya
    |

    హైదరాబాద్ : 'ఖుషి' తరవాత నేను వపన్‌గారిని కలుసుకొన్నా. 'ఇన్ని విజయాలు ఎలా హ్యాండిల్‌ చేయగలుగుతున్నారు? కథల్ని ఎలా ఎంచుకొంటారు'అనడిగా. 'నువ్వేంటో అదే నీ సినిమా.. నీ వ్యక్తిత్వం నీ సినిమాలో కనిపిస్తుంది' అని చెప్పారు. ఆ మాట ఆయన ఎందుకన్నారో అప్పుడు నాకు అర్థం కాలేదు అంటూ అల్లు అర్జున్ చెప్పుకొచ్చారు. ఆయన తాజా చిత్రం సన్నాఫ్ సత్యమూర్తి విడుదల సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఇలా స్పందించారు.

    ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

    అప్పటికి నేను 'ఆర్య' చేశా. ఆర్యలోని పాత్ర, నేనూ ఒకటి కాదు. కానీ బాగా ఆలోచిస్తే కొన్ని విషయాలు తెలిశాయి. మన అభిరుచికి, వ్యక్తిత్వానికి తగిన కథల్ని మనం ఎంచుకొంటాం. వాటివైపు ఆకర్షణకు లోనవుతాం. 'ఆర్య' అనేది ఓ కుర్రాడి కథ. వాడి జోరు.. ఆ వయసు నన్ను ఆకర్షించింది.

    సన్నాఫ్‌ సత్యమూర్తి కూడా అంతే. తండ్రీకొడుకుల అనుబంధం, కుటుంబ సభ్యుల అనురాగాల కథ ఇది. అవంటే నాకిష్టం.. అందుకే వెంటనే పాత్రలో లీనమైపోయా. ఈ పాత్రకు అంత త్వరగా కనెక్ట్‌ అయ్యా. సన్నాఫ్ సత్యమూర్తి విడుదల అవుతున్న ఈ సందర్భంలో నాకు పవన్‌ కల్యాణ్‌గారు చెప్పిన మాటలు గుర్తొస్తున్నాయి అంటూ చెప్పుకొచ్చారు అల్లు అర్జున్.

    ఇంకా అల్లు అర్జున్ ఏమన్నారు...స్లైడ్ షోలో చదవండి...

    'బాహుబలి' ఆడాలి

    'బాహుబలి' ఆడాలి

    ''తెలుగు సినిమా స్థాయి పెరిగితే అందరికంటే నేను ఎక్కువగా ఆనందిస్తా. ఆ సినిమా నాదా, కాదా? అనేది వేరే విషయం. ఇప్పుడు 'బాహుబలి' వస్తోంది. ఆ సినిమా కచ్చితంగా ఆడాలి. ఎందుకంటే ఆ సినిమా ఆడితే.. తెలుగు సినిమా మార్కెట్‌ పెరుగుతుంది.

    అప్పుడే పెరుగుతుంది

    అప్పుడే పెరుగుతుంది

    శంకర్‌ సినిమాలకు అంత క్రేజ్‌ ఎందుకొచ్చింది? తమిళనాడులో మాత్రమే చూస్తే అన్ని వసూళ్లు రావు. తెలుగు రాష్ట్రాల్లో ఆ సినిమా చూస్తారు. విదేశాల్లోనూ చూస్తారు.. ఈ మార్కెట్‌ శంకర్‌ సినిమాలకు అదనపు బలమైంది. మన సినిమాలూ అలా పక్క రాష్ట్రాల్లోకి వెళ్లాలి.

    నాకంటూ మార్కెట్..అందుకే గర్వంగా

    నాకంటూ మార్కెట్..అందుకే గర్వంగా

    నావంతుగా నేను మలయాళంలో నాకంటూ ఓ మార్కెట్‌ సృష్టించుకొన్నా. అందుకు గర్వంగా అనిపిస్తోంది'' అని అల్లు అర్జున్ చెప్పుకొచ్చారు.

    త్రివిక్రమ్‌తో పనితీరు

    త్రివిక్రమ్‌తో పనితీరు

    దర్శకులు రెండు రకాలు. మన నుంచి తీసుకొనేవారు.మనకు ఇచ్చేవారు. త్రివిక్రమ్‌ రెండో రకం. ఇలా చేయ్‌.. అలా చేయ్‌ అంటూ సెట్లో ఏం చెప్పరు. సెట్‌కి రాక మునుపే మేం ఈ సినిమా గురించి ఆరు నెలలు మాట్లాడుకొన్నాం. ఆ మాటల్లో విరాజ్‌ ఆనంద్‌ పాత్రని నాలో ఎక్కించేశారు.

    అన్నీ మాట్లాడుకున్నాం

    అన్నీ మాట్లాడుకున్నాం

    ఇక మేం సెట్లో సినిమాల గురించి తప్ప అన్నీ మాట్లాడుకొంటాం. కొంతమంది పాజిటివ్‌ విషయాల కంటే నెగిటివ్‌ విషయాలే ఎక్కువ మాట్లాడుకొంటారు. 'ఆ సినిమా అందుకు ఆడిందట.. ఈ సినిమా ఇందుకు ఆడిందట..' అంటుంటారు. కానీ ఏ సినిమా ఆడినా, ఎవరు విజయం సాధించినా.. అది కేవలం వాళ్ల ప్రతిభ మాత్రమే.

    అందరివీ ఆడాలి

    అందరివీ ఆడాలి

    విజయాలు ఎవ్వరికి వూరకే రావు. వాళ్లు అర్హులు. ఒకరి విజయాన్ని చూసి నేనెప్పుడూ ఏడవను. పరిశ్రమబాగుండాలంటే.. అందరిసినిమాలూ ఆడాలి.

    త్రివిక్రమ్‌ శైలి మారింది

    త్రివిక్రమ్‌ శైలి మారింది

    ఆయన ఎప్పుడూ రాసే శైలి 'జులాయి'లో మారింది. ఈ సినిమాలో మరిన్ని మార్పులు చూస్తారు.

    ఫ్యామిలీలను దూరం చేసుకోకూడదనే..

    ఫ్యామిలీలను దూరం చేసుకోకూడదనే..

    ఈ సినిమాలో లిప్‌లాక్‌ ఉందని చెప్పుకొంటున్నారు.. అదేం లేదండీ. కుటుంబ కథా చిత్రం కదా.. అందుకే అలాంటి విషయాలను దూరం పెట్టాం. లిప్‌లాక్‌ వల్ల యువతరాన్ని త్వరగా ఆకట్టుకొంటామేమో..? అదే సమయంలో కుటుంబ ప్రేక్షకుల్ని దూరం చేసుకొంటాం.

    నేను వ్యతిరేకం కాదు

    నేను వ్యతిరేకం కాదు

    మా సినిమాని చిన్నది చేసుకోవడం మాకు ఇష్టం లేదు. ముద్దు సన్నివేశాలకు నేను వ్యతిరేకం కాదు. ఇప్పటికి మూడుసార్లు అలాంటి సన్నివేశాల్లో నటించా. కానీ కథకు అవసరం లేనివి చూపించి ప్రేక్షకుల్నిఇబ్బంది పెట్టకూడదు.

    హీరోయిన్స్ నుంచి నేర్చుకున్నా

    హీరోయిన్స్ నుంచి నేర్చుకున్నా

    సాధారణంగా అమ్మాయిలంతా ఒకేలా కనిపిస్తారు గానీ జాగ్రత్తగా గమనిస్తే తమకు మాత్రమే సొంతమైన ప్రతిభ ఉంటుంది. నేను ఎవరితో పనిచేసినా వాళ్ల నుంచి ఎంతో కొంత నేర్చుకొంటా. ఈ ముగ్గురి నుంచీ చాలా విషయాలు నేర్చుకొన్నా.

    సమంత గురించి...

    సమంత గురించి...

    సమంత ఓ కమర్షియల్‌ హీరోయిన్. అందులోనూ మంచి నటి. ఈ రెండు లక్షణాలూ ఒకే హీరోయిన్ లో చూడడం చాలా కష్టం.

    నిత్యామీనన్ గురించి...

    నిత్యామీనన్ గురించి...

    నటీనటులెవరైనా ఈ సినిమా మొత్తం నేనే ముందుండి నడిపించాలి అనుకొంటారు. కానీ నిత్య మేనన్‌ అలా కాదు. తనకు నచ్చితే చిన్న పాత్ర అయినా చేస్తుంది. నేనే హీరోయిన్‌గా ఉండాలి అనుకోదు.

    ఆదా శర్మ గురించి...

    ఆదా శర్మ గురించి...

    ఇక ఆదా.. చాలా ప్రతిభావంతురాలు. తను మిమిక్రీ చేయగలదు. అమ్మాయిల్లో ఈ కళని నేనెప్పుడూ చూడలేదు. ఎంత క్లిష్టమైన సమస్య అయినా అందులోంచి చిటికెలో బయటకు వచ్చేస్తుంది.

    అది అదృష్టమే

    అది అదృష్టమే

    సినిమాలో ముగ్గురు అమ్మాయిలూ ఓకే సీన్‌లో కనిపించరు. అదీ అదృష్టమే. ఎందుకంటే ఒక ఫ్రేమ్‌లో ముగ్గురు అమ్మాయిలు వచ్చారంటే ఆ షాట్‌ ఎప్పటికీ తెమలదు. ఇదివరకటి రోజుల్లో హీరోయిన్స్ మధ్య ఇగో సమస్యలుండేవేమో? ఇప్పుడు అలా కాదు. అందరూ స్నేహితుల్లానే ఉంటున్నారు.

    ఇంకాస్త స్త్టెలిష్‌గా మారా

    ఇంకాస్త స్త్టెలిష్‌గా మారా

    బాగా డబ్బున్న సత్యమూర్తిగారి అబ్బాయిని కదా? ఆ మాత్రం స్త్టెల్‌ చూపించాలి. 'ఇద్దరమ్మాయిలతో'లో కొంచెం ఫంకీ స్త్టెల్‌తో కనిపించా. 'రేసుగుర్రం'లో అల్లరి అబ్బాయిని. వాటికంటే భిన్నంగా కనిపించేసరికి స్త్టెల్‌ పెరిగింది అనుకొంటున్నారంతే.

    'రుద్రమదేవి'లో చిన్న పాత్రే అయినా

    'రుద్రమదేవి'లో చిన్న పాత్రే అయినా

    'రుద్రమదేవి' చరిత్రకు సంబంధించిన కథ. మనకున్న చరిత్ర, సంస్కృతి తెరపై తీసుకురావాలి, ప్రేక్షకులకు చూపించాలన్న ప్రయత్నం నాకు నచ్చింది.

    నేనే చేస్తానని అడిగాను

    నేనే చేస్తానని అడిగాను

    గోనగన్నారెడ్డి పాత్రని ఓ పేరున్న హీరోతో చేయించాలని గుణశేఖర్‌ గారు ప్రయత్నిస్తున్నారు. కానీ ఎవ్వరూ ముందుకు రాలేదు. ఆ సమయంలో నేనే వెళ్లి 'మీకు అభ్యంతరం లేకపోతే. నేను చేస్తా' అని అడిగా. నేను అడిగానని ఆయన ఒప్పుకోలేదు.

    సినిమా అంతా కనిపిస్తా

    సినిమా అంతా కనిపిస్తా

    ఓ ఇరవై రోజులు ఆలోచించుకొని, ఆ పాత్రని నాకు తగ్గట్టు ఎలా మార్చుకోవాలో మార్చి... తీసుకొచ్చారు. నిజంగా చాలా శక్తిమంతమైన పాత్ర. ఏదో ఒకట్రెండు సన్నివేశాలకే పరిమితం అవ్వలేదు. సినిమా అంతా కనిపిస్తా.

    డైలాగు వెనుక..

    డైలాగు వెనుక..

    నేను తెలుగు భాష లెక్క.. ఆడా ఉంటా.. ఈడా ఉంటా అనేది మాత్రం పక్కా కమర్షియల్‌ డైలాగే. కోటలోనూ ఉంటా.. అడవిలోనూ ఉంటా అనే సందర్భంలో వాడిందంతే.

    త్రివిక్రమ్ కే ఓటేస్తా...

    త్రివిక్రమ్ కే ఓటేస్తా...

    నా వరకు స్ర్కిప్ట్‌ ముందా? త్రివిక్రమ్‌ ముందా? అని ఎవరైనా అడిగితే నేను త్రివిక్రమ్‌కే ఓటేస్తాను. ఎందుకంటే డైరక్టర్‌ మైండ్‌ సెట్‌ ముఖ్యం. డైరక్టర్‌ సినిమాపై శ్రద్ధతో చేస్తున్నాడా? డబ్బు కోసం చేస్తున్నాడా? పేరు కోసం చేస్తున్నాడా? అనేదాన్ని బట్టి సినిమా ఆధారపడుతుందన్న విషయాన్ని నేను బాగా నమ్ముతా.''

    అభ్యంతరం ఏముంది

    అభ్యంతరం ఏముంది

    సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలో రిచ్‌ హౌస్‌ కావాలని మా ఇంట్లో రెండు రోజులు షూటింగ్‌ చేశారు. ‘సినిమాల్లో సంపాదించి కట్టిన ఇల్లు, సినిమా షూటింగ్‌కు ఇవ్వడానికి అభ్యంతరం ఏముంది?' అని మా నాన్నగారు కూడా త్రివిక్రమ్‌గారు అడగ్గానే ఇచ్చారు.

    ఆయన స్టైల్ కొత్తగా ఉంటుంది

    ఆయన స్టైల్ కొత్తగా ఉంటుంది

    ‘‘త్రివిక్రమ్‌గారితో ఇంతకుముందు ‘జులాయి' చేశాను. ఆ సినిమాకీ, ఇప్పటికీ ఇద్దరిలోనూ చాలా మార్పు వచ్చింది. మెచ్యూరిటీ వచ్చింది. ఆయన స్టేట్‌ ఆఫ్‌ మైండ్‌ నాకు చాలా ఇష్టం. ఎప్పుడూ పాజిటివ్‌ విషయాలు మాట్లాడతారు. ఆయనకు ప్రపంచ సినిమాపై అవగాహన ఎక్కువ. ఆయన డైరక్షన్‌ స్టైల్‌ కూడా కొత్తగా ఉంటుంది.

    నేను సిద్ధమే

    నేను సిద్ధమే

    మలయాళంలోనూ, హిందీలోనూ మంచి కథలు వస్తే అక్కడ స్ట్రైయిట్‌ సినిమాలు వస్తే చేయడానికి సిద్ధమే.

    ఇంకా ఫైనల్ కాలేదు

    ఇంకా ఫైనల్ కాలేదు

    బోయపాటి సినిమా ఇంకా ఫైనల్‌ కాలేదు. ‘సన్నాఫ్‌ సత్యమూర్తి' రెండు వారాల గ్యాప్‌లో కేరళలో విడుదలవుతుంది.

    ఇప్పటికి కుదిరింది

    ఇప్పటికి కుదిరింది

    ట్విట్టర్‌లో అకౌంట్‌ ఓపెన్‌ చేయమని చాన్నాళ్లుగా మా తమ్ముడు చెబుతూనే ఉన్నాడు. ఇప్పటికి కుదిరింది. నా పేరు మీద ఉన్న అకౌం ట్‌ను తప్పకుండా నేనే మెయింటైన్‌ చేయాలనుకుంటున్నా.

    English summary
    Allu Arjun personal talk about pawan Kalyan and Trivikram and many other things.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X