twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'మ్యాగీ' వివాదం‌: సంభందం లేదంటూ అమితాబ్‌ వివరణ

    By Srikanya
    |

    ముంబై‌: మ్యాగీ నూడిల్స్‌కి ప్రచారకర్తగా వ్యవహరించినందుకు బాలీవుడ్‌ బిగ్‌ బి అమితాబ్‌బచ్చన్‌ పై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాల్సిందిగా బిహార్‌ కోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అమితాబ్‌ మాట్లాడుతూ ఇప్పటి వరకు తనకు ఎలాంటి నోటీసులు అందలేదని, న్యాయ విచారణకు తాను పూర్తిగా సహకరిస్తానని స్పష్టం చేశారు. అంతేకాకుండా తాను మ్యాగీ యాడ్‌లో నటించి రెండు సంవత్సరాలు అవుతోందని తెలిపారు. ప్రస్తుతం తనకు ఆ ఉత్పత్తితో సంబంధం లేదని ఆయన పేర్కొన్నారు.

    నెస్లే కంపెనీకి చెందిన మ్యాగీ నూడిల్స్‌లో ఎంఎస్‌జీ మోతాదు ఎక్కువగా ఉండటంతో వాటిపై నిషేధం విధించాలని వివాదం తలెత్తిన సంగతి తెలిసిందే. ప్రచారకర్తలుగా వ్యవహరించినందుకు అమితాబ్‌తోపాటు మాధురిదీక్షిత్‌, ప్రీతిజింటాలపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని కోర్టు ఆదేశించింది.

    ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

    Amitabh Bachchan clarifies that he had stopped endorsing Maggi two years ago

    మరో ప్రక్క నెస్లే కంపెనీకి చెందిన మ్యాగీ నూడిల్స్‌ నాణ్యతపై దేశవ్యాప్తంగా పరీక్షలు కొనసాగుతున్నాయి. ఉత్తర ప్రదేశ్‌ ఆహర భద్రత విభాగం మ్యాగీపై నిషేధం విధించిన నేపథ్యంలో దిల్లీ ప్రభుత్వం కూడా మ్యాగీ శాంపిళ్లను పరిశీలించి వాటిని ఆహారంగా తీసుకోవడం హానికరమని, వాటిలో సీసం శాతం ఎక్కువగా ఉందని పేర్కొంది.

    డిల్లీ ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు లేబరేటరీలో మ్యాగీ శాంపిళ్లను పరిశీలించారు. ప్రాథమిక నివేదిక ప్రకారం అవి హానికరమని చెప్పారు. పూర్తి నివేదిక ఆధారంగా తదుపరి చర్య తీసుకుంటామని అధికారులు పేర్కొన్నారు.

    మ్యాగీ ప్రచార కర్తలుగా వ్యవహరించిన బాలీవుడ్‌ నటులు మాధురీదీక్షిత్‌, అమితాబ్‌బచ్చన్‌, ప్రీతిజింతాలపై కూడా కేసులు నమోదు చేసింది. యూపీతో పాటు బిహార్‌లోని ఓ కోర్టు కూడా ఈ ముగ్గురు నటులపై కేసు నమోదు చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. అదేవిధంగా... ఉత్తరప్రదేశ్‌ ఆహార భద్రత విభాగం ఇప్పటికే మ్యాగీ కంపెనీ నెస్లేపై కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే.

    అంతేకాకుండా... ఫుడ్‌ సెక్యురిటీ అండ్‌ స్టాండర్డ్స్‌ అథారిటీ అన్ని రాష్ట్రాల నుంచి మ్యాగీ నూడిల్స్‌ శాంపిళ్లను సేకరించి నాణ్యత పరీక్షలు చేస్తుందని కేంద్రం వెల్లడించిన సంగతి తెలిసిందే. కేరళ ప్రభుత్వం ఇప్పటికే మ్యాగీ నూడిల్స్‌పై నిషేధం విధించింది. రిటైల్‌ దుకాణాలకు మ్యాగీ ప్యాకెట్లను సరఫరా చేయడం తాత్కాలికంగా నిలిపివేయాలని కేరళ ప్రభుత్వం ఆదేశించింది.

    పశ్చిమ బంగ్లాదేశ్ ప్రభుత్వం మ్యాగీ వివాదంపై బుధవారం నిర్ణయం తీసుకోనున్నట్లు ప్రకటించింది. హర్యానా, కర్ణాటక, తమిళనాడు, పంజాబ్‌, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ ప్రభుత్వాలు కూడా నూడిల్స్‌ శాంపిళ్లను పరీక్షలకు పంపుతున్నట్లు తెలిపాయి.

    English summary
    Amitabh Bachchan has been quoted in a report as saying that he has not received any notice from the government over endorsing Maggi noodles. He says that he will fully cooperate with the law and adds that he had stopped endorsing the instant noodles' brand two years ago.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X