twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కన్నీళ్ళు పెట్టించేలా: వినోద్ ఖన్నా కోసం అమితాబ్ లేఖ

    అమితాబ్ తన భాదని దాచుకోలేదు మితృ ని మరణం తో వచ్చిన భాద లోలోపల దాచుకుని కుమిలి పోయేంత చిన్నదేం కాదు.

    |

    అమితాబ్ బచ్చన్ వినోద్ ఖన్నా బాలీవుడ్ లో తేరమీద హిట్ మిత్ర ద్వయం, తెర బయట అంతకన్నా క్లోజ్ ఫ్రెండ్స్ 'హేరా ఫెరి' 'పర్వరిష్' 'అమర్ అక్బర్ ఆంటోని' 'మూకద్దర్ కా సికందర్' లాంటి ఆల్టైం హిట్స్ లో ఈ ఇద్దరూ కలిసి నటించారు. బాలీవుడ్ లో వినోద్ ఖన్నా ఒక ముద్ర..నటన అంటే ఇతనిలా ఉండాలి అని చెప్పే పత్రం పై ఎప్పటికీ చెరిగి పోని మొదటి సంతకం....

    వినోద్ ఖన్నా కోసం అమితాబ్ లేఖ

    వినోద్ ఖన్నా కోసం అమితాబ్ లేఖ

    కేవలం తెరమీదనుంచే ఇంతగా అభిమానించే జనం వినోద్ ఖన్నా మరణవార్త విని భాదపడ్డారు. మరి ఆయన చిరకాల మితృడు అమితాబ్ ఎమనుకుని ఉంటాడు? ఎంతలా కుమిలి పోయి ఉంటాడు??? నిజమే అమితాబ్ తన భాదని దాచుకోలేదు మితృ ని మరణం తో వచ్చిన భాద లోలోపల దాచుకుని కుమిలి పోయేంత చిన్నదేం కాదు. అందుకేనేమో అమితాబ్ తన బాధనంతా ఉత్తరం తో పంచుకున్నాడు.... వినోద్ ఖన్నా కోసం అమితాబ్ రాసిన ఈ లేఖ ఇప్పుడు నెట్ లో గిరికీలు కొడుతోంది....

    నిన్ను మర్చిపోలేను మిత్రమా...!

    నిన్ను మర్చిపోలేను మిత్రమా...!

    "నేను వినోద్ ఖన్నాను మొదటిసారి సునిల్ దత్ సాబ్ ఆఫీసు లో కలిసాను. ‘రేష్మా ఔర్ షెరా' అనే సినిమాలో మేమిద్దం మొదట కలసి నటించాం. గర్వంగా నడిచే నడక మంచిని కోరే చిరునవ్వు నిత్య ఆశ జీవి చెదరని ధైర్యం నీకే చెల్లింది మిత్రమా.. నీతో మేకప్ రూమ్ లో గడిపిన క్షణాలు.. కలిసి భోజనం చేసిన రోజులు.. పంచుకున్న భావాలు.. అర్ధం లేని మాటలు.. నిన్ను మర్చిపోలేను మిత్రమా...! నువ్వు నా మదిలో ఎప్పటికీ పదిలంగా ఉంటావు" అని గుర్తుచేసుకొన్నారు బిగ్ బి.

    అమితాబ్ ఆందోళన ఇప్పటిది కాదు

    అమితాబ్ ఆందోళన ఇప్పటిది కాదు

    నిజానికి వినోద్ ఖన్నా విషయమై అమితాబ్ ఆందోళన ఇప్పటిది కాదు ఆయన అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరినప్పటి నుండీ ఖన్నా గురించి ఆలోచిస్తూనే ఉన్నాడు అమితాబ్, అప్పట్లో వినోద్ ఖన్నా ఫొటో ఒకటి బయటకు వచ్చింది. గుర్తుపట్టలేనంతగా బలహీనపడిన ఆయన ఫొటోను చూసి అభిమానులు సైతం షాకయ్యారు.

    ట్వీట్ చేస్తూ

    ట్వీట్ చేస్తూ

    ఈ నేపథ్యంలో అమితాబ్ బచ్చన్ ఓ ట్వీట్ చేస్తూ.. మన కుటుంబ సభ్యులు, స్నేహితులు మృతి చెందినప్పుడు మనమెంత కాలం జీవిస్తామో అని ఆలోచిస్తామని పేర్కొన్న అమితాబ్ ఈ విషయం ఎంతో విచిత్రంగా ఉంది కదా! అంటూ ట్వీట్‌లో పేర్కొన్నారు. ట్వీట్‌తోపాటు దిగులుగా ఉన్న ఫొటోను కూడా పోస్ట్ చేశారు.

    English summary
    Amitab took to his blog to write an emotional message for the departed soul. He reminisces his first meet with the handsome star and what followed later. This heartfelt tribute will make you cry, we’re sure
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X