»   »  ముందు భయ పడ్డా... ఒప్పుకోవడానికి కారణం అదే: అనసూయ

ముందు భయ పడ్డా... ఒప్పుకోవడానికి కారణం అదే: అనసూయ

సినిమా ప్రమోషన్లో భాగంగా యాంకర్ అనసూయ, సుమ కనకాల కలిసి మీడియా సమావేంలో పాల్గొని విన్నర్ సినిమా గురించి ముచ్చటించారు.

Posted by:
Subscribe to Filmibeat Telugu
హైదరాబాద్: సాయిధ‌ర‌మ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న విన్న‌ర్‌' చిత్రంలో యాంకర్ అనసూయ స్పెషల్ సాంగ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ పాటను మరో యాంకర్ సుమ పాడించారు సంగీత దర్శకుడు తమన్.

గోపీచంద్ మ‌లినేని ద‌ర్శ‌కత్వంలో ల‌క్ష్మీ న‌ర‌సింహ ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపై బేబి భ‌వ్య స‌మ‌ర్ప‌ణ‌లో న‌ల్ల‌మ‌లుపు శ్రీనివాస్ (బుజ్జి), ఠాగూర్ మ‌ధు నిర్మించిన ఈ చిత్రం ఫిబ్ర‌వ‌రి 24న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

సినిమా ప్రమోషన్లో భాగంగా యాంకర్ అనసూయ, సుమ కనకాల కలిసి మీడియా సమావేంలో పాల్గొని విన్నర్ సినిమా గురించి ముచ్చటించారు.

సుమ మాట్లాడుతూ

``విన్న‌ర్ సినిమా కోసం ముందు పాట పాడాల‌ని మ్యూజిక్ డైరెక్ట‌ర్ థ‌మ‌న్ అడిగిప్పుడు త‌ను ఏదో త‌మాషా చేస్తున్నాడ‌ని అనుకున్నాను. అయితే త‌ను మాత్రం సీరియ‌స్‌గానే నేను పాట పాడాల‌ని అన‌డ‌మే కాదు..చెన్నై ర‌మ్మ‌ని పిలిపించి పాట పాడించారని సుమ తెలిపారు.

 

అనసూయ అని తెలియదు

 

నేను పాట పాడ‌టానికి రికార్డింగ్ స్టూడియో చేరుకునే వరకు నేను పాడ‌బోయే పాట అన‌సూయ డ్యాన్స్ నెంబ‌ర్ సాంగ్ అని నాకు కూడా తెలియ‌దు. థ‌మ‌న్ ఇచ్చిన లిరిక్స్‌లో సూయ సూయ అనే పాట ప‌ల్ల‌వి చ‌ద‌వ‌గానే ఇది అన‌సూయ కోసం రాసిన పాట క‌దా..అని అడ‌గ‌డంతో థ‌మ‌న్.. నిజమే అన్నారు అని సుమ తెలిపారు.

 

ఫోన్ చేయగానే థ్రిల్ అయింది

 

పాట పాడటం పూర్తయి స్టూడియో బ‌య‌ట‌కు రాగానే అన‌సూయ‌కు ఫోన్ చేసి నేను పాట పాడాన‌ని, నువ్వు డాన్స్ చేయబోయే సాంగుకే నేను పాడాన‌ని చెప్ప‌గానే అనసూయ థ్రిల్ అయ్యింది అని సుమ తెలిపారు.

 

బాలుగారు అలా అనడం మరిచిపోలేను

 

నేను పాడిన పాటను ఎస్‌.పి.బాల‌సుబ్ర‌మ‌ణ్యంగారు విని బాగా పాడాన‌ని అప్రిసియేట్ చేయ‌డం మ‌ర‌చిపోలేను. అలాగే ఇప్పుడు సంగీతం నేర్చుకుంటున్న మా అమ్మాయి నా పాట విని ఎమంటుందోన‌ని అనుకున్నాను. అయితే త‌ను సాంగ్ విని బాగానే పాడావ‌ని అన‌డంతో హ్యాపీగా అనిపించిందన్నారు.

 

యాంకరింగే చేస్తా

 

థ‌మ‌న్ కోరిక మీద పాట పాడేశాను కానీ నా ప్రొఫెష‌న్ మాత్రం యాంక‌రింగే, సింగర్ గా కంటిన్యూ అవుతానని అనుకోవద్దు. థమన్, డైరెక్టర్ గోపీచంద్ ఒక నిర్ణయానికి వచ్చి కావాలనే నాతో పాడించారని సుమ తెలిపారు.

 

థమన్ కూడా నాకు చెప్పలేదు

 

అన‌సూయ మాట్లాడుతూ - ``సుమ అక్క ఈ పాట పాడుతున్నార‌ని నాకు ముందు తెలియ‌దు. థ‌మ‌న్ కూడా నాకు ఏమీ చెప్ప‌లేదు. సుమ నాకు విషయం చెప్పగానే థ్రిల్ అయ్యాను అని అనసూయ తెలిపారు.

 

క్షణం తర్వాత ఏ సినిమా చేయలేదు

 

నేను క్ష‌ణం మూవీ త‌ర్వాత మ‌రో సినిమాలో న‌టించ‌లేదు. ప్రేక్ష‌కులు క్ష‌ణం అన‌సూయ‌గానే గుర్తు పెట్టుకోవాల‌నుకున్నాను... అందుకే కొన్ని అవకాశాలు వచ్చినా ఏ సినిమాకు ఒప్పుకోలేదని అనసూయ తెలిపారు.

 

భయపడి వద్దన్నా, ఒప్పుకోవడానికి కారణం అదే

 

విన్న‌ర్‌లో సాంగ్ చేయాల‌న‌గానే ముందు భ‌య‌ప‌డి వ‌ద్దన్నా. సూయ సూయ అనే లిరిక్స్ నచ్చడం వల్లే ఒప్పుకున్నా. నా కోసమే స్పెషల్ గా సాంగ్ రాసినట్లు ఉండటం వల్లే చేసాను అని అనసూయ తెలిపారు.

 

 

English summary
Actress Anasuya Bharadwaj & Anchor Suma Interview about Winner Movie. Anchor Anasuya Bharadwaj dances for Suyaa Suyaa song sung by Telugu top anchor Suma Kanakala for Sai Dharam Tej upcoming movie ‘Winner’.
Please Wait while comments are loading...