twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హింసించారు...బాహుబలి-2 దర్శక నిర్మాతలను అరెస్టు చేయండి!

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: బాహుబలి-2 షూటింగ్ లో ఏనుగులను హింసించారని, వాటిని ఇబ్బంది పెట్టారని....ఈ పరిణామాలకు కారణమైన బాహుబలి చిత్ర దర్శక నిర్మాతల్ని అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ జంతు హక్కుల పరిరక్షణ కార్యకర్తల నుండి డిమాండ్లు మొదలయ్యాయి.

    రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘బాహుబలి-2' షూటింగ్ ఇటీవల కేరళలోని త్రిసూరులో జరిగింది. ఈ సినిమాలో షూటింగులో ఎలాంటి ముందస్తు అనుమతులు లేకుండా ఏనుగులను షూటింగు కోసం వినియోగించారని, వన్యమృగాల చట్టం-2001లోని నిబంధనలను యదేశ్చగా ఉల్లంగించారని, వెంటనే వారిపై చర్యలు తీసుకోవాలని యానిమల్ టాస్క్ ఫోర్స్ బృందం డిమాండ్ చేసింది. ఈ మేరకు పోలీసులకు ఆదేశాలు జారీ చేయాలని ప్రధానికి కార్యాలయానికి లేఖ రాసారు.

    Animal rights campaigner seeks action against Baahubali team

    ఏనుగులను కేవలం గ్రాఫిక్స్ చేసి సినిమాలో చూపించేందుకే వాడామని చిత్ర బృందం చెబుతున్నప్పటికీ షూటింగ్.... షూటింగ్ జరుగుతున్నంత సేపు అక్కడి పరిస్థితులు, షూటింగులోని ఉన్న జనం అరుపుల కారణం ఏనుగు ఇబ్బంది పడిందని యానిమల్ టాస్క్ ఫోర్స్ సెక్రటరీ వీకె వెంకటాచలం ఆరోపించారు.

    ఇక ఈ చిత్రం ఎలా ఉండబోతోంది అనేది ఇప్పుడు అందరిలో ఆసక్తికరమైన అంశం. రెండో భాగానికి ''బాహుబలి - ది కంక్లూజన్‌' అనే టైటిల్ పెట్టారు. ఈ చిత్రంలో మొదటి భాగంలో ఉన్న సందేహాలు అన్నీ కంక్లూజన్ దొరుకుతుందనే ఈ టైటిల్ పెట్టనున్నట్లు తెలుస్తోంది.

    English summary
    Animal rights campaigner, Heritage Animal Task Force, has demanded action against producer and director of the multilingual movie "Baahubali 2" for allegedly illegally using an elephant for shooting in the state without taking prior permission from the Animal Welfare Board of India.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X