» 

పవర్‌స్టార్‌ కు జంటగా అంజలి...ఫుల్ హ్యాపీ

Posted by:

బెంగళూరు: ఎట్టకేలకు పవర్‌స్టార్‌ పునీత్‌ రాజ్‌కుమార్‌ రణ విక్రమ సినిమాకు హీరోయిన్ గా అంజలి ఎంపికైంది. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు. ఇప్పటికే రచితారాంను ఎంపిక చేశారు. రెండో హీరోయిన్‌ ఎవరన్నది ఇప్పటి వరకు సస్పెన్స్‌ కొనసాగింది. చివరకు అంజలి పేరును ఖరారు చేశారు. గతంలో హొంగనసు సినిమా ద్వారా అంజలి చందనసీమకు పరిచయం అయింది. అనంతరం తమిళం, తెలుగు పరిశ్రమలో బిజీ కావడంతో బెంగళూరుకు దూరమైంది.

ఈ చిత్రంలో రెండో హీరోయిన్‌ కోసం పలువురి పేర్లను పరిశీలించినా చివరకు అంజలినే అదృష్టం వరించింది. ఈ సినిమాలో పునీత్‌రాజ్‌కుమార్‌ పోలీసు అధికారి పాత్రను పోషిస్తున్నాడు. బాలీవుడ్‌ నటుడు విక్రమ్‌సింగ్‌ ప్రతినాయకుడు. ఇప్పటికే ముహూర్తం సన్నివేశం చిత్రీకరణను పూర్తి చేశారు. జూన్‌లో రెగ్యులర్‌ షూటింగ్‌ ఉంటుంది. గిరీష్‌కర్నాడ్‌, చరణ్‌రాజ్‌, రంగాయణ రఘు ప్రధాన తారాగణం.

ఇక జర్నీతో అందరి దృష్టిలో పడ్డ అంజలి ఆ తర్వాత సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రం చేసి ఒక్కసారిగా స్టార్ హీరోయిన్ హోదా సంపాదించింది. అయితే ఆ తర్వాత ఆమె కెరీర్ అనుకున్నంత వేగంగా ముందుకు వెళ్లలేదు. అనంతరం ఆమె నటించిన బలుపు హిట్టైనా ఆఫర్స్ వరస కట్టలేదు. మసాలా సినిమా ఆమెకు మరింత వెనక్కి లాక్కుని వెళ్లింది. ప్రస్తుతం ఆమె కోన వెంకట్ సమర్పిస్తున్న గీతాంజలి అనే చిత్రం ఒకటే తెలుగులో చేస్తోంది.

ఇండస్ట్రీలో బాగా పలుకుబడి ఉన్న ఆ తెలుగు పెద్ద నిర్మాత ఆమె డేట్స్ చూస్తూండటమే ఆమె కెరీర్ ముందుకు వెళ్లకపోవటానికి కారణం అంటున్నారు. ఆమె డేట్స్ కోసం సంప్రదిస్తే ఆ నిర్మాతను అడగమంటోందని, దాంతో చాలా మంది నిర్మాతలు...వేరే నిర్మాతను డేట్స్ కోసం అడగటమేంటని, అడిగినా రెమ్యునేషన్ బేరం అడగలేమని వెనక్కి తగ్గారు. రీసెంట్ గా మంచి విజయం సాధించిన చిత్రంలో ఓ పెద్ద చిత్రంలో సైతం ఆమెను అడిగారు. అయితే అప్పుడూ ఇదే సమస్య ఎదురై ఆమె ఆఫర్ వేరే ముంబై హీరోయిన్ కి వెళ్లిపోయింది. తెలుగు హీరోయిన్ కదా అని నిర్మాతలు, దర్శకులు ఆసక్తి చూపించినా ఆ నిర్మాత వలన ఆమె డేట్స్ కు ఎవరూ వెళ్లటం లేదని ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది.

ఇక తమిళంలోనూ ఆమె పరిస్ధితి అంతంత మాత్రంగానే ఉంది. ఆ మధ్యన మురుగదాస్‌ నిర్మాతగా మారి నిర్మించిన 'వట్టికుచ్చి' లో అంజలి నటించింది. మురుగదాస్‌ శిష్యుడు పి.కిన్‌స్లివ్‌ దర్శకత్వం వహించారు. మురుగదాస్‌ సోదరుడు దిలీపస్‌ హీరోగా నటించారు. ఈ చిత్రాన్ని తెలుగులో సైతం 'ప్రాణం కోసం' అనే పేరుతో అనువదించారు. అయితే ఆ సినిమా ఇక్కడ వర్కవుట్ కాలేదు. మంచి ఫామ్ లో ఉన్నప్పుడు అంజలి ఇలా కెరీర్ ని పాడుచేసుకుంటోందంటున్నారు.

Read more about: anjali, masala, venkatesh, అంజలి, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, మసాలా
English summary
Actress Anjali has been roped in as the female lead opposite Puneeth Rajkumar in the upcoming film Dheera Rana Vikrama directed by Pavan Wadeyar. Puneeth will have two heroines in the film and Rachita Ram has already been selected for the other role. The makers who were looking to cast the perfect fit for the role finally zeroed in on Anjali.
Please Wait while comments are loading...