twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    త్వరలో చిత్రాంగద... పిల్లజమీందార్ దర్శకుడి తో హర్రర్ ని మించిన ఆసక్తి

    |

    'గీతాంజలి' వంటి లేడీ ఓరియెంటెడ్‌ చిత్రం తర్వాత కథానాయిక అంజలి టైటిల్‌ పాత్రలో నటిస్తున్న మరో లేడీ ఓరియెంటెడ్‌ చిత్రం 'చిత్రాంగద'. శ్రీ విఘ్నేష్‌ కార్తీక్‌ సినిమా పతాకంపై పిల్ల జమీందార్‌ చిత్రంతో విమర్శకుల ప్రశంసలు పొందిన ప్రముఖ దర్శకుడు అశోక్‌.జి దర్శకత్వంలో గంగపట్నం శ్రీధర్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అంజలి టైటిల్ పాత్రలో తెలుగు, తమిళ భాషల్లో రూపొందిన ఈ చిత్రం విడుదలకు సిద్దంగా ఉంది.

    తెలుగులో 'చిత్రాంగద' పేరుతో.. తమిళంలో 'యార్నీ' పేరుతో. ఏక కాలంలో తెరకెక్కుతోన్న థ్రిల్లర్ కామెడీ చిత్రానికి 'పిల్ల జమీందార్' ఫేం అశోక్ దర్శకుడు. శ్రీ విఘ్నేష్ కార్తీక్ సినిమా అండ్ క్రియేటివ్ డ్రావిడన్స్ పతాకంపై గంగపట్నం శ్రీధర్, రెహమాన్‌లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం నిర్మాణానంతర పనులు జరుగుతున్నాయి. కాగా ఈ చిత్రంలో కథానాయిక అంజలి ఓ పాట పాడటం విశేషం. పిల్ల జమీందార్ చిన్న సినిమాగావచ్చి ఎంత హిట్ గా నిలిచిందో మనకి తెలుసు... ఇక ఈ సినిమాని కూడా చిన్న సినిమా అనుకున్నా దర్సకుడి ప్రతిభ మీద ఉన్న నమ్మకం పెద్ద రేంజ్ లీ స్పందననే తీసుకు రావచ్చు..

    Anjali’s ‘Chitrangada’ is ready to release

    'డ...డ..డాంగ్...డాంగ్.. డంగ్ చుక్.. డంగ్ చుక్... యాపిల్ సెల్‌ఫోన్.. యాపిల్ రేటుకు వస్తే.. ఆషాఢం సేల్‌లో ఆడీ కారు గిఫ్ట్‌గా వస్తే' అంటూ అంజలి ఆలపించిన పాటను సెల్వ గణేషన్, స్వామినాథన్ సంగీత దర్శకత్వంలో ఇటీవల రికార్డ్ చేశారు.కొన్ని అదృశ్య శక్తుల కారణంగా ఆమె జీవితం ఏ విధంగా చిక్కుల్లో పడింది? తనకు ఎదురైన సవాళ్లను అధిగమించే క్రమంలో చిత్రాంగదకు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? అన్నదే చిత్రాంగద చిత్ర ఇతివృత్తం. కథానుగుణంగా గ్రాఫిక్స్‌కి అత్యంత ప్రాధాన్యత కలిగిన చిత్రం కావడంతో ప్రతిదీ జాగ్రత్తగా రావాలని పలు జాగ్రత్తలు తీసుకుంటు కాస్త ఆలస్యంగా అయినా మొత్తానికి తెరమీదికి తెచ్చేస్తున్నారు.

    Anjali’s ‘Chitrangada’ is ready to release

    'గీతాంజలి' తర్వాత అంజలి నటిస్తున్న నాయికా ప్రాధాన్యమున్న చిత్రమిది. ఈ సినిమా కోసం ఆమె ఎంతగానో కష్టపడింది. మైనస్ 4 డిగ్రీల చలి వాతావరణంలో నలభై రోజుల పాటు షూటింగ్ చేసింది. తన పాత్రకనుగుణంగా 1కిలోల బరువు తగ్గింది. అంజలిని సరికొత్త కోణంలో ఆవిష్కరించే చిత్రమిది. అత్యున్నత సాంకేతిక విలువలతో తెరకెక్కించిన ఈ చిత్రం తెలుగుప్రేక్షకులకు సరికొత్త అనుభూతినిస్తుంది" అని చెప్పిన దర్శకుడి మాటలతో మరీ అంతగా కాకపోయినా ఒక రకమైన ఆసక్తి మాత్రం ఈ సినిమ పైఉంది. గతంలో ఈ జోనర్ లో అంజలి చేసిన 'గీతాంజలి' సినిమా ఘనవిజయాన్ని సాధించింది. దాంతో ఈ సినిమాపై అందరిలోను ఆసక్తి వుంది. ఈ సినిమాలో నాజూకుగా కొత్తలుక్ తో అంజలి కనిపించనుంది. అందుకోసం ఆమె 15 కేజీలకి పైగా బరువు తగ్గడం విశేషం. ఈ సినిమాతో అంజలి కెరియర్ మళ్లీ ఊపందుకుంటుందేమో చూడాలి.

    English summary
    Anjali’s Chitrangada, which was supposed to be released last year but was postponed due to technical problems, is finally complete.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X