twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘అన్నా హజారే’ మూవీ వచ్చేస్తోంది, టీజర్ అదిరింది (వీడియో)

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: అన్నా హజారే గురించి భారతీయులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదనుకుంటా. ఇపుడు ఆయన జీవితం సినిమాగా రాబోతోంది. అన్నా హజారే గురించి సాధారణ ప్రజలకు తెలియని విషయాలెన్నో ఈ సినిమాలో చూపించబోతున్నారు.

    శశాంక ఉదాపుర్కర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో తానిషా ముఖర్జీ జర్నలిస్టులో పాత్రలో నిస్తున్నారు. ఇంకా ఇందులో రజిత్ కపూర్, శరత్ సక్సేనా, గోవింద నమడియో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. రైస్ పిక్చర్స్ ప్రై.లి వారు నిర్మిస్తున్న ఈ చిత్రం హిందీతో పాటు ఇంగ్లీష్, ఇతర భారతీయ భాషల్లో అక్టోబర్ 14న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. తాజాగా టీజర్ విడుదలైంది. మీరూ ఓ లుక్కేయండి.

    ఒక నిరుపేద కుటుంబంలో

    ఒక నిరుపేద కుటుంబంలో

    అన్నా హజారే ఒక నిరుపేద కుటుంబంలో జన్మించాడు. ఆయన తండ్రి బాబూరావ్ హజారే ఒక సాధారణ కార్మికుడు, ఆయన తాత సైన్యంలో పనిచేశాడు. ఇతడి తాత ఉద్యోగ రీత్యా భింగర్ ప్రాంతానికి మార్చబడ్డాడు. దీనితో బాబూరావు, కుటుంబం భింగర్‌కు వెళ్లిపోయింది, ఇక్కడే అన్నా పుట్టాడు. అన్నా తాత 1945 లో చనిపోయాడు కాని కుటుంబం మాత్రం భింగర్‌లోనే 1952వరకు ఉండిపోయింది. తర్వాత అన్నా తండ్రి తన ఉద్యోగానికి రాజీనామా చేసి రాలేగావ్ సిద్ధికి వెళ్లిపోయాడు. అన్నా నాలుగో తరగతి వరకు చదువు పూర్తి చేశాడు. ఆయనకు ఆరుగురు సోదరులు ఉండేవారు. కుటుంబం ఆర్థిక పరిస్థితి ఘోరంగా ఉండేది. బాబూరావ్ చెల్లెలికి పిల్లలు లేరు, ఈమె అన్నా సంరక్షణ బాధ్యత చేపట్టి ఆయనను ముంబై తీసుకుపోయింది.

    పూల వ్యాపారం

    పూల వ్యాపారం

    అన్నా తండ్రి సమస్యలు పెరిగిపోవడంతో తన వ్యవసాయ భూమిని విక్రయించాడు. దీంతో కుటుంబ పరిస్థితి మరింత దిగజారింది. దీంతో ముంబైలో ఉంటూ 7వ తరగతి పూర్తి చేసిన అన్నా ఏదో ఒక ఉద్యోగం చేయవలసి వచ్చింది. అన్నా ముంబై లోని దాదర్‌లో ఒక పూల వ్యాపారి వద్ద పనిచేస్తూ నెలకు నలభై రూపాయలు సంపాదించేవాడు. ఇతడు క్రమంగా తన స్వంత పూల దుకాణాన్ని ప్రారంభించాడు. ఇతడి సోదరులలో ఇద్దరు ఆయన వ్యాపారంలో పాలు పంచుకోవడానికి ముంబై వచ్చారు. దీంతో కుటుంబ ఆదాయం నెలకు 700-800 రూపాయల వరకు పెరిగింది.

    చెడు సావాసాలు వదిలి సైన్యంలోకి

    చెడు సావాసాలు వదిలి సైన్యంలోకి

    కొద్ది సంవత్సరాలలో అన్నా చెడు సహవాసాలలో కూరుకుపోయి తన సమయాన్ని, డబ్బును మానసిక బలహీనతలపై వృధా చేయడం ప్రారంభించాడు. చివరకు అతడు వీధిపోరాటాలు, కుమ్ములాటలలో కూడా పాలు పంచుకోసాగాడు, ప్రత్యేకించి గూండాలు మామూలు వ్యక్తిని వేధించడం చూస్తే చాలు, అన్నా వారితో పోరుకు సిద్ధమయ్యేవాడు. తన కుటుంబానికి క్రమంగా డబ్బు పంపించడం కూడా తగ్గిపోయింది. తన వ్యక్తిత్వాన్ని తనకు తానుగా పాడు చేసుకుంటున్నాడని రాలెగావ్ లో వార్తలు వ్యాపించాయి. అలాంటి ఒక పోరులో అన్నా ఒక వ్యక్తిని ఘోరంగా బాదేశాడు. తనను అరెస్టు చేస్తారనే భయంతో, అతడు రోజువారీ పనిలోకి సక్రమంగా రావడం, ఇంటికి రావడం కూడా మానేశాడు. ఈ కాలంలోనే (ఏప్రిల్ 1960) అతడు సైనిక రిక్రూట్‌మెంట్ ఇంటర్వ్యూలకు హాజరయ్యేవాడు చివరకు భారతీయ సైన్యంలో చేరడానికి ఎంపికయ్యాడు.

    తిరిగి గ్రామానికి

    తిరిగి గ్రామానికి

    1975లో, అతడు సైన్యంలో పదిహేను సంవత్సరాల సేవను పూర్తి చేశాడు ఫించన్ రావాలంటే ప్రతి సైనికుడూ 15 ఏళ్ల సర్వీసును పూర్తి చేసి ఉండాలి. అతడు పదవీ విరమణ కోరుకున్నాడు. చివరికి 1975 ఆగస్టు నెలలో అతడు సైన్యం నుంచి బయటపడ్డాడు, మంచి పనులకోసం అతడు తిరిగి రాలెగావ్ సిద్ధికి తిరిగి వచ్చేశాడు.

    హజారే రాక ముందు ఆ గ్రామం

    హజారే రాక ముందు ఆ గ్రామం

    1975 కి ముందు రాలేగావ్ సిద్ధి అత్యంత ఘోరమైన గ్రామంగా ఉంటూ, నిస్సహాయ సామాజిక, ఆర్థిక పరిస్థితిని, బాధ్యతా రహిత గ్రామీణ నాయకత్వాన్ని కలిగి ఉండేది. భారతీయ సైన్యంలో సేవచేస్తూ అన్నా హజారే అని అభిమానంగా పిలుచుకున్న కిసాన్ బాబూరావ్ హజారే 1975లో స్వచ్ఛంద విరమణ చేసినంతవరకు ఇది కొనసాగింది. 1965 యుద్ధంలో చావుతో అతడు చేసిన సావాసం అతడి జీవిత గమ్యాన్నే మార్చివేసింది. ఇతరుల శ్రేయస్సుకోసం తనను తాను అంకితం చేసుకోవాలని అతడు నిర్ణయించుకుని, తన స్వంత గ్రామం ఉన్నతి కోసం అతడు తిరిగి వచ్చాడు,

     గ్రామ అభివృద్ధికి చేసిన తోడ్పాటుకు ఈయన ప్రత్యేక గుర్తింపు

    గ్రామ అభివృద్ధికి చేసిన తోడ్పాటుకు ఈయన ప్రత్యేక గుర్తింపు

    రాలెగావ్ సిద్ధి గ్రామ అభివృద్ధికి చేసిన తోడ్పాటుకు ఈయన ప్రత్యేక గుర్తింపు పొందాడు. దీనిని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దటానికి తను చేసిన ప్రయత్నాలకు గుర్తుగా 1990 లో పద్మశ్రీ అవార్డు తోనూ, 1992 లో పద్మ భూషణ్ అవార్డుతోను భారత ప్రభుత్వం ఆయనను సత్కరించింది.

    ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతిపై

    ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతిపై

    ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతిపై పోరాడేందుకోసం తను చేపట్టిన కృషిలో భాగంగా అన్నా, భారత్‌లో సమాచార హక్కు లక్ష్యం కోసం పాటుపడిన ప్రముఖ వ్యక్తులలో ఒకడిగా నిలిచాడు. 5 ఏప్రిల్ 2011 న జనలోక్ పాల్ చట్టం ను పోలినట్లు లోక్ పాల్ అవినీతి నిరోధక చట్టం ను తేవాలని ప్రభుత్వాన్ని కోరుతూ నిరవధిక నిరాహరదీక్ష చేపట్టాడు. దేశమంతా దీనికి మద్దతు లభించింది. 9 ఏప్రిల్ 2011 న ప్రభుత్వము అంగీకరించిన తరువాత నిరాహారదీక్ష విరమించాడు.

    English summary
    'Anna Hazare: Kisan Baburao Hazare,' the biopic on the man who galvanised an entire nation into proactivity, is here and it's as inspiring as the man himself. Helmed by Shashank Udapurkar, the film has the director portraying the eponymous leader.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X