» 

నేను బ్రతికున్నందుకే ఇలా...(అక్కినేని ఇంటర్వ్యూ)

Posted by:
 

హైదరాబాద్: టాలీవుడ్ లెజెండ్ అక్కినేని నాగేశ్వరరావు ఈ నెల 20వ తేదీతో 90వ వసంతంలోకి అడుగు పెడుతున్న సంగతి తెలిసిందే. ఆయన 90వ బర్త్‌డే వేడుకను గ్రాండ్‌గా జరిపేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అక్కినేని బర్త్ వేడుకలను ఘనంగా నిర్వహించాలని టి.సుబ్బరామిరెడ్డి లలితకళా పరిషత్తు నిర్ణయించింది. రాజ్యసభ సభ్యుడు టి.సుబ్బరామిరెడ్డి అధ్యక్షతన జరిగే ఈ కార్యక్రమానికి హైదరాబాదులోని రవీంద్రభారతి వేదిక కానుంది.

ఈ వేడుకలకు ముఖ్యఅతిథిగా రాష్ట్ర గవర్నర్ నరసింహన్ హాజరవుతారు. ఇంకా ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి చిరంజీవి, 'లోకాయుక్త' జస్టిస్ బి.సుభాషణ్ రెడ్డి, సినారె, రామానాయుడు,ప్రముఖ నటీమణి వైజంతీమాల తదితరులు పాల్గొననున్నారు. అక్కినేని కుటుంబ సభ్యులు కూడా ఈ వేడుకలకు హాజరవుతారు. చిరంజీవి ఈ సందర్భంగా అక్కినేనికి 90 వసంతాల గుర్తుగా వెండి జ్ఞాపికను బహూకరిస్తారు. చెన్నైలో జరిగే వందేళ్ల సినిమా పండగలో కూడా అక్కినేని 90వ జన్మదిన వేడుక జరుపనున్నారు.

మరో వైపు నాగార్జున బర్త్ డే గిఫ్టుగా అక్కినేనికి బెంజ్ కారు కొనిచ్చారనే ప్రచారం కూడా మీడియాలో సాగుతోంది. ఈ విషయాలపై గురువారం ఓ టీవీ ఛానల్‌తో మాట్లాడుతూ పలు విషయాలపై చమత్కారంగా స్పందించారు అక్కినేని. ఆ ఇంటర్య్వూకు సంబంధించిన వివరాలు స్లైడ్ షో...

మీ 90వ పుట్టిన రోజు వేడుకపై మీ స్పందన?

అక్కినేని : బ్రతికున్నాను కాబట్టి చేస్తున్నారు. సినిమా రంగంలో నాకంటే ముందు వచ్చిన వాళ్లు...నాకంటే వెనక వచ్చిన వళ్లలో చాలా మంది పోయారు. 90 సంవత్సరాలు జీవించడం, ఇప్పటికీ నటిస్తుండటం వల్ల నా పుట్టినరోజు వేడుక చేస్తున్నారు అంతే. ఇందులో వింతేమీ లేదు.

బెంజ్ కారు గిఫ్టుగా ఇచ్చారా?

అక్కినేని: అలాంటిదేమీ లేదు. నేనే ఒక గిఫ్టు. గిఫ్టులకు విలువల లేదు. ఎంత ప్రేమగా ఇచ్చారనేదే ముఖ్యం. బెంజికారు కొని నెలరోజులైంది. రేపు ఇస్తే దాన్నిబర్త్ డే కానుక అంటారు.

‘మనం' సినిమా గురించి?

అక్కినేని : మూడు తరాలు బత్రికి ఉండి, డిమాండులో ఉండటం కష్టం...మా విషయంలో అది కుదిరింది కాబట్టే సినిమా చేస్తున్నాం. సినిమాలో పోటాపోటీ నట ఏమీ ఉండదు. ఎవరి స్థాయి వారిది?

‘మనం' పారితోషికమే బెంజికారా?


అక్కినేని: పారితోషికం వేరు...ప్రజంటేషన్ వేరు. ఇలా రెండింటికి ముడి పెట్టి చూడొద్దు. అయినా ప్రజంటేషన్ ఇచ్చి పారితోషికం ఇవ్వకుంటే ఊరుకుంటానా..(నవ్వుతూ)

Read more about: nagarjuna, akkineni nageswara rao, naga chaitanya, manam, t subbarami reddy, నాగార్జున, అక్కినేని నాగేశ్వరరావు, నాగచైతన్య, మనం, టి సుబ్బిరామిరెడ్డి
English summary
T Subbarami Reddy Lalitha Kala Parishad is organizing the 90th Birthday of Akkineni Nageswara Rao on 20th September at Ravindra Bharati.
Please Wait while comments are loading...

Telugu Photos

Go to : More Photos