twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ప్రధాని మోదీని.. క్షమాపణ చెప్పమంటున్న దర్శకుడు

    By Srikanya
    |

    ముంబై: జమ్ము కశ్మీర్ లో ఉడీ సైనిక శిబిరంపై ఉగ్రవాదదాడి, పాక్ ఆక్రమిత కశ్మీర్ లో భారత సైన్యం సర్జికల్ దాడులు తర్వాత పాక్ నటీనటులపై భారతీయ నిర్మాతల మండలి నిషేధం విధించిన సంగతి తెలిసిందే.

    అంతేగాక పాక్ నటులకు అవకాశం ఇవ్వరాదని, ఇస్తే తీవ్ర పరిణామాలు తప్పవంటూ ఎంఎన్ఎస్ హెచ్చరించింది. తాజాగా పాక్ నటుల సినిమాలను ప్రదర్శించబోమని థియేటర్ యజమానులు నిర్ణయించడంతో కరణ్‌ జోహార్ సహా బాలీవుడ్ నిర్మాతలు కొందరు ఇరకాటంలో పడ్డారు.

    ఈ నేపధ్యంలో సినిమాలకీ, రాజకీయాలకు సంభంధం లేదంటూ చాలా మంది గళం విప్పుతున్నారు. పాక్ నటుడు నటించిన ఏ దిల్ హై ముష్కిల్ సినిమాకు కష్టాలు ఎదురయ్యాయి. కరణ్ జోహార్ కు మద్దతుగా కశ్యప్ ట్వీట్ చేశాడు.

    'నరేంద్ర మోదీ సార్, మీరు పాకిస్థాన్ కు వెళ్లి ఆ దేశ ప్రధానిని కలిసినందుకు ఇప్పటి వరకు క్షమాపణలు చెప్పలేదు. మీరు గతేడాది డిసెంబర్ లో పాక్ కు వెళ్లారు. అదే సమయంలో కరణ్ జోహార్ ఏ దిల్ హై ముష్కిల్ సినిమా షూటింగ్ తీశారు' అని కశ్యప్ ట్వీట్ చేశాడు.

    Anurag Kashyap wants Narendra Modi to apologise for this

    గతేడాది డిసెంబర్ లో పాకిస్థాన్ పర్యటనకు వెళ్లినందుకు ప్రధాని నరేంద్ర మోదీ క్షమాపణలు చెప్పాలని బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ డిమాండ్ చేశాడు. పాకిస్థాన్ నటులు నటించిన సినిమాల ప్రదర్శనపై థియేటర్ల యజమానులు నిషేధం విధించడాన్ని ఆయన తప్పుపట్టాడు.

    ముఖ్యంగా బాలీవుడ్ దర్శకుడు కరణ్ జోహార్, సహా కొందరు నిర్మాతల కు థియేటర్ యజమానులు షాకిచ్చారు. పాకిస్థాన్ నటీనటులు నటించిన సినిమాలను థియేటర్లలో ప్రదర్శించరాదని యజమానులు నిర్ణయించారు. విడుదలకు సిద్ధమైన కరణ్‌ జోహార్ తాజా చిత్రం ఏ దిల్ హై ముష్కిల్ లో రణవీర్ కపూర్, ఐశ్వర్యా రాయ్, అనుష్క శర్మ, పాక్ నటుడు ఫవాద్ ఖాన్ నటించారు.

    ఈ సినిమాలో ఫవాద్ ఖాన్ కీలక పాత్రలో నటించాడు. పాక్ నటుల సినిమాలను ప్రదర్శించబోమని థియేటర్ల యజమానులు నిర్ణయించడంతో ఏ దిల్ హై ముష్కిల్ సినిమా కష్టాల్లో పడింది. గుజరాత్, గోవా, కర్ణాటక, మహారాష్ట్రలో ఈ సినిమాపై నిషేధం విధించారు.

    English summary
    Anurag Kashyap tweeted that Prime Minister Narendra Modi hasn’t apologised for his meeting with Pakistan’s Prime Minister Nawaz Sharif in 2015 when Johar was shooting for his film Ae Dil Hai Mushkil. “narendramodi Sir you haven’t yet said sorry for your trip to meet the Pakistani PM.. It was dec 25th. Same time KJo was shooting ADHM? Why?” he tweeted.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X