twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అనుష్క కూడా ఎడిక్ట్ ?...మోజు ఎక్కడికి దారి తీస్తుందో,నిర్మాతల భయం(వీడియోలు)

    By Srikanya
    |

    ముంబై: ప్రపంచవ్యాప్తంగా జీపీఎస్ బేస్డ్ పోకిమాన్ గో గేమ్ సృష్టిస్తున్న అలజడి అంతా ఇంతా కాదు. కాల్పనిక ప్రపంచానికి రియల్ వరల్డ్ కు ముడిపెడుతూ రూపొందిన క్రేజీ గేమ్ పై ప్రపంచమంతా ఆసక్తి అలుముకుంటున్న సంగతి తెలిసిందే. అయితే పోకిమాన్ గో ఎంత క్రేజీ గేమో అంతే ప్రమాదం కూడా అని నిపుణుల హెచ్చరికలు చేస్తున్నాయి. అయితే దీనికి ఎడిక్ట్ అయినవారు మానలేకపోతున్నారు. మన టాలీవుడ్ లో ఇంకా ప్రవేశించలేదు కానీ బాలీవుడ్ మాత్రం ఈ గేమ్ పిచ్చిలో విలవిల్లాడుతోంది.

    నిముషాలను రూపాయల్లో లెక్కేసే బాలీవుడ్‌ తారల్ని సైతం ఈ గేమ్‌ మాయ చేస్తూ గంటలు గంటలు ఆడించటం భయపెడుతోంది. నేను ఈ గేమ్‌ మోజులో పడిపోయా అని కింగ్‌ఖాన్‌ షారుఖ్‌ ట్విట్టర్‌లో ట్వీటి మూడ్రోజులైనా గడవకముందే, నేనూ పడిపోయా అంటూ ముందుకు వచ్చింది అందాల అమ్మడు అనుష్క శర్మ.

    #PokemonGo

    A video posted by AnushkaSharma1588 (@anushkasharma) on

    అనడమే కాదు... ఈ గేమ్‌ ఆడుతూ ఎక్కడికెక్కడికో వెళ్లిపోతూ తీసిన వీడియోని తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో పెట్టేసింది. అదిప్పుడు వైరల్‌. అనుష్క శర్మ దారిలో మరెంతమంది హీరోయిన్స్ ముందుకు వెళ్తారో..ఈ వీడియోలు చూసి ఆమె అబిమానులు ఎంత మంది ప్రేరణ పొందుతారో చూడాలి

    Hooked But guys PLEASE be careful while playing !! #PokemonGo

    A video posted by AnushkaSharma1588 (@anushkasharma) on

    అనుష్క శర్మ వంటి టాప్ స్టార్స్ షూటింగ్ లలో ఈ గేమ్ ఆడుతూ కూర్చుంటే మా పరిస్దితి ఏమౌతుంది అనే ఆలోచనలో పడుతున్నారు నిర్మాతలు. ఎందుకంటే స్టార్ హీరోయిన్స్ ని ఎవరూ మందలించలేరు కదా.

    ప్రపంచాన్ని పిచ్కెక్కిస్తున్న మొబైల్ గేమ్ మొబైల్‌ని చూస్తూ తిరగాల్సి రావటంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. తొలిసారి వర్చువల్ రియాలిటీతో అనుసంధానం చేసిన ఈ గేమ్ అంటే ఓ సారి ఆడినవాళ్లు మళ్లీ ఆడకుండా ఉండలేకపోతున్నారు.

    పోకెమాన్ గోపై భిన్న స్పందనలున్నాయి. ఈ గేమ్‌ను నడుస్తూ, పరుగెడుతూ ఆడతారు కనక.. మానసికంగా, శారీరకంగా ఆరోగ్యకరమైనదేనని కొందరు చెబుతున్నారు. అయితే రోడ్లు మీద వెళుతూ ఆడాల్సిన గేమ్ కావటంతో ప్రమాదకరమని మరికొందరు చెబుతున్నారు.

    నిజానికి ఇప్పటికే పోకెమాన్ గేమ్ వల్ల చాలా ప్రమాదాలు జరిగాయి. న్యూజెర్సీకి చెందిన ఓ మహిళ పోకెమాన్లను వెతుకుతూ... ఏకంగా దగ్గర్లోని స్మశానంలోకి వెళ్లిపోయింది. పోకెమాన్లను పట్టుకునే క్రమంలో అక్కడ చెట్ల మధ్య ఇరుక్కుపోయింది. చివరకు పోలీసులొచ్చి ఆమెను రక్షించాల్సి వచ్చింది.

    అనుష్క శర్మ లేటెస్ట్ ఫొటోలతో ఈ గేమ్ గురించి మరిన్ని ఆసక్తికరమైన విశేషాలు..

    పోకేమాన్ అంటే..

    పోకేమాన్ అంటే..


    మొబైల్ గేమ్స్ ప్రియులను అమితంగా ఆకట్టుకుంటున్న సరికొత్త ఆట పాకెట్ మాన్ స్టర్ కు కుదించిన రూపమే ఈ పొకేమాన్.

    గేమ్ ధీమ్

    గేమ్ ధీమ్


    వర్చువల్ పొకేమాన్ లను వెతుకుతూ ఈ పొకేబాల్ తో కొట్టి వాటిని సొంతం చేసుకోవడమే ఈ గేమ్ థీమ్.

    అయితే చాలు

    అయితే చాలు


    ఫోన్ లో ఈ గేమ్ ఆన్ చేసి ఇంటర్నెట్ కు కనెక్ట్ అయితే చాలు. ఫోన్ లో ఉండే జీపీఎస్ వ్యవస్థ మన లొకేషన్ను గుర్తిస్తుంది.

    నోటిఫికేషన్స్

    నోటిఫికేషన్స్


    అలాగే మన ఫోన్ లో ఉన్న కెమెరా గేమ్ కు కనెక్ట్ అవుతుంది. తర్వాత చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కడెక్కడ పోకెమాన్ లు ఉన్నాయో నోటిఫికేషన్లు వస్తుంటాయి. అవి ఎక్కడైనా ఉండొచ్చు.

    పసిగట్టాలి

    పసిగట్టాలి


    బాత్ రూమ్, బెడ్ రూమ్, అపార్ట్ మెంట్ కారిడార్, రోడ్డు పక్క, ఆఫీస్ లో, టూరిస్ట్ ప్లేస్ లో ఇలా ఎక్కడైనా ఈ వర్చువల్ జీవులను పసిగట్టొచ్చు.

    సొంతం చేసుకుని..

    సొంతం చేసుకుని..

    అవి కనింపించిన వెంటనే పొకెబాల్ తో కొట్టి సొంతం చేసుకుంటూ ముందుకు సాగాలి. అపుడుమాత్రమే నెక్స్ట్ లెవల్ కి ప్రమోషన్ ఉంటుంది.

    అధికారికంగా

    అధికారికంగా

    ఈ గేమ్ ను రూపొందించిన నింటెండో సంస్థ అమెరికా, బ్రిటన్, న్యూజిలాండ్ లో అధికారికంగా పొకేమాన్ గేమ్ ను విడుదల చేసింది.

    మేనియా

    మేనియా


    అధికారికంగా విడుదల కాకపోయినా భారత్ సహా పలు దేశాల యువతలో పొకేమాన్ మేనియా విపరీతంగా ఉంది.

    ముంచెత్తుతోంది

    ముంచెత్తుతోంది

    రెండు వారాల క్రితమే లాంచ్ చేసిన పోకెమాన్ గో యూజర్లను ఆకట్టుకుంటూ మార్కెట్ వర్గాలను ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది.

    నెంబర్ వన్..

    నెంబర్ వన్..

    దీంతో జపాన్ లోని ఉత్తమ ప్రసిద్ధ కంపెనీల జాబితాలో ఒకటిగా నింటెండో చేరిపోయింది.ఈ క్రేజ్ కేవలం నింటెండో కంపెనీకి మాత్రమే పరిమితం కాలేదు. మొబైల్ గాడ్జెట్స్ లో, స్మార్ట్ ఫోన్లలో దీనికి ఫుల్ క్రేజ్ పెరిగిపోతోంది.

    గేమ్స్, టీవి షోలు

    గేమ్స్, టీవి షోలు


    పోకెమాన్ అంటే జపనీస్‌లో 'పాకెట్ మాన్‌స్టర్'కు సంక్షిప్త రూపం. ఇదో టీవీ షో. సినిమాలూ వచ్చాయి. గేమ్స్ కూడా ఉన్నాయి.

    ఇదే కథ

    ఇదే కథ

    పోకెమాన్ ట్రయినర్ యాష్... తన స్నేహితులు మిస్టీ, బ్రోక్‌తో కలిసి పోకెమన్ భాగస్వాముల్ని తీసుకుని కల్పిత ప్రపంచంలో తిరగటమే ఈ షో కథ.

    మాస్టర్ కావటమే..

    మాస్టర్ కావటమే..

    మరి యాష్ లక్ష్యమేంటి? పోకెమాన్ మాస్టర్ కావాలి. ఈ గేమ్ ఆడే పిల్లల లక్ష్యం కూడా అదే. సాధ్యమైనన్ని పోకెమాన్లను సంపాదించి, వాటిని ట్రెయిన్ చేసి మాస్టర్ కావటమే.

    అందుకే పిచ్చి

    అందుకే పిచ్చి


    జంతువులు, మాయలు, అద్భుతాలు... ఇలా కావాల్సిన మసాలాలన్నీ ఉండటంతో పోకెమాన్ అంటే పిల్లలకు, యువతకు పిచ్చి.

    ఇదే తొలి

    ఇదే తొలి

    నిజం చెప్పాలంటే... అగ్‌మెంటెడ్ రియాలిటీ ఆధారంగా రూపొందిన తొలి పాపులర్ గేమ్ ఇదే.

    క్షణాల్లోనే క్రేజ్ పీక్స్ కు

    క్షణాల్లోనే క్రేజ్ పీక్స్ కు

    ఇది విడుదలైన క్షణంలోనే... మొబైల్ గేమ్స్ అభిమానుల క్రేజ్ తారస్థాయికి వెళ్లిపోయింది.

    కోట్లు దాటాయి

    కోట్లు దాటాయి


    క్షణాల్లోనే వేల డౌన్‌లోడ్లు. రోజులు తిరక్కుండానే అవి లక్షలుగా మారిపోయాయి. వారం తిరక్కుండా కోట్లు దాటిపోయాయి.

    రికార్డ్ లు బ్రద్దలు

    రికార్డ్ లు బ్రద్దలు

    ఇండియా సహా పలు దేశాల్లో ఇది ఇంకా విడుదల కాకపోయినా... ఇప్పటికే గూగుల్ ప్లేస్టోర్, యాపిల్ ప్లేస్టోర్లలో అత్యధిక డౌన్‌లోడ్లు చేసుకున్న గేమ్‌గా రికార్డులు బద్దలుగొట్టేసింది.

    వివాదాలు..

    వివాదాలు..

    అంతేకాదు!! పలు దేశాల్లో వివాదాలకూ కారణమవుతోంది. కొన్ని దేశాలైతే నిషేధించాయి కూడా!!

    ఎక్కడెక్కడికో..

    ఎక్కడెక్కడికో..

    సాధారణంగా ఏ మొబైల్ గేమైనా స్థిరంగా ఒకచోట కూర్చుని ఆడేదే. కానీ 'పోకెమాన్ గో' అలా కాదు. నడుస్తూ... వాహనాలపై ఎక్కడెక్కడికో వెళుతూ... మొత్తంగా కదులుతూ ఆడే గేమ్. ఈ గేమ్ ఆడాలంటే మొదట గూగుల్ లేదా యాపిల్ ప్లేస్టోర్ల నుంచి 'పోకెమాన్ గో' ఫ్రీ గేమ్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి.

    కాకపోతే...

    కాకపోతే...

    ఇండియాలో ఇంకా ఇది విడుదల కాలేదు కనక... 'మీ దేశంలో ఇది లభ్యం కావటం లేదు' అనే సందేశం మాత్రం వస్తుంది.

    డౌన్ లోడ్ చేసేయచ్చు

    డౌన్ లోడ్ చేసేయచ్చు

    కాస్త టెక్నాలజీ పరంగా అడ్వాన్స్‌డ్‌గా ఉన్నవారైతే... ఏ వర్చువల్ ప్రైవేట్ నెట్‌వర్క్‌కో అనుసంధానమై దీన్ని డౌన్‌లోడ్ చేసేయొచ్చు.

    అప్పుడు మాత్రమే...

    అప్పుడు మాత్రమే...

    కాకపోతే అధికారికంగా విడుదలయ్యాకే దీన్లోని ఫీచర్లన్నీ లభిస్తాయని కంపెనీ చెబుతోంది.

    వచ్చే వారమే..

    వచ్చే వారమే..


    ఇండియాలో వచ్చేవారంలోనే విడుదల చేస్తామని కూడా వెల్లడించింది.

    మరి దీన్నెలా ఆడాలి..?

    మరి దీన్నెలా ఆడాలి..?

    డౌన్‌లోడ్ చేసి లాగిన్ అయ్యాక... మీరు పోకెమాన్ ట్రెయినర్‌గా మారాలి. హెయిర్ నుంచి స్కిన్, కళ్లు, దుస్తులు, స్టయిల్స్‌తో సహా ఒక అవతార్‌ను ఎంచుకోవాలి.

    మ్యాప్స్ ద్వారా

    మ్యాప్స్ ద్వారా


    లొకేషన్‌ను ఆన్ చేస్తే... ఆ వెంటనే మీరున్న చోటు ఫోన్లో మ్యాప్స్ ద్వారా కనిపిస్తుంటుంది. అదే మ్యాప్‌లో పోకెమాన్లు కూడా కొన్ని ప్రాంతాల్లో ఉంటాయి.

    ప్రాంతానికి వెళ్లాలి

    ప్రాంతానికి వెళ్లాలి


    ఎక్కడ ఉన్నాయనేది కరెక్ట్‌గా తెలియకపోయినా... ఎంత దూరంలో ఉన్నాయనేది తెలుస్తూ ఉంటుంది. సదరు ప్రాంతానికి నిజంగా వెళితేనే కనిపిస్తాయవి. దీంతో... మనం ఫోన్ పట్టుకుని, కెమెరాలోంచి చూస్తూ ముందుకు వెళ్లాలన్న మాట.

    ఈ ఆట ముగిసేదెక్కడ?

    ఈ ఆట ముగిసేదెక్కడ?


    ఈ గేమ్ అంతిమ విజయం ఏంటంటే.. పొకెడెక్స్‌లో బందీలుగా ఉన్న పోకెమాన్‌లను విడిపించడమే.

    మన దేశంలో ఆడగలమా?

    మన దేశంలో ఆడగలమా?

    ఇండియాలో ఈ గేమ్ విడుదలైనా సరే... ఆడటంలో చాలా ఇబ్బందులుండవచ్చనేది నిపుణుల మాట. ఎందుకంటే ఈ గేమ్‌కోసం వీధుల్లో తిరగాల్సి ఉంటుంది. మనుషులు మామూలుగా నడవటానికే వీలుకాని మన రోడ్లపై... ఫోన్‌వైపు చూస్తూ నడిస్తే ఇంకేమైనా ఉందా? విదేశాల్లో కన్నా ఎక్కువ ప్రమాదాలు ఇక్కడే జరిగే అవకాశం ఉంటుందన్నది వారి భావన.

    వైఫేతో కష్టం..

    వైఫేతో కష్టం..

    ఈ గేమ్‌ను వీధుల్లో తిరుగుతూ ఆడాలి కనక వైఫైతో సాధ్యం కాదు. 2జీతో ఆడలేం. 3జీ లేదా 4జీ డేటాను వాడాల్సి ఉంటుంది. మన దేశంలో 3జీ సిగ్నల్స్ చాలా చోట్ల పనిచేయవు. అందుకని ఎక్కడ పడితే అక్కడ ఆగిపోవాల్సి ఉంటుంది.

    కష్టం

    కష్టం


    వీక్ సిగ్నల్ కారణంగా చాలా ప్రాంతాల్లో ఆడే అవకాశం ఉండదు. సిగ్నల్ బలంగా ఉన్నచోట ఆడదామనుకుంటే అక్కడ పోకెమాన్లు, పోకె జిమ్‌లు ఉండక పోవచ్చు.

    బ్యాటరీ ప్లాబ్లం...

    బ్యాటరీ ప్లాబ్లం...


    మనదేశమే కాదు. ఎక్కడైనా బ్యాటరీ సమస్యే. ఎందుకంటే కెమెరా, జీపీఎస్ ఒకేసారి వినియోగిస్తూ ఈ గేమ్ ఆడాలి. దీంతో బ్యాటరీ ఎక్కువ ఖర్చవుతుంది.

    ఇంకో బ్యాటరీ

    ఇంకో బ్యాటరీ


    గంట సేపు ఆడితే బ్యాటరీ మొత్తం ఖాళీ అయిపోయే ప్రమాదముంది. అందుకని వేరే బ్యాటరీని వెంట తీసుకెళ్ళాలనేది గేమర్ల సూచన.

     అమ్మేస్తున్నారు

    అమ్మేస్తున్నారు

    కొన్ని లెవెల్స్ చేరుకున్న వారు తమ ఖాతాల్ని కూడా ఆన్‌లైన్లో విక్రయిస్తున్నారు. వాటిని కొంటే... నిజంగా పోకెమాన్లను పట్టుకోకపోయినా మన ఖాతాలోకి వచ్చేస్తాయన్న మాట.

    యాక్ససరీలు

    యాక్ససరీలు

    పోకెమాన్ పేరిట ఇప్పటికే దుస్తులతో పాటు క్యాప్‌లు, కార్డ్‌లు, స్కూల్ బ్యాగ్‌ల వంటి రకరకాల యాక్సెసరీలు మార్కెట్లో ఉన్నాయి. తాజా గేమ్‌తో వాటి గిరాకీ అమాంతం పెరిగినట్లు లెక్కలు చెబుతున్నాయి

    రెట్టింపు

    రెట్టింపు

    పోకెమాన్ వస్తువులమ్మే ప్రతి వ్యాపారానికీ గి రాకీ పెరిగింది. పోకెమాన్ బొమ్మలతో కేకు లు తయారు చేస్తున్న ఓ బేకరీ షేరు జపాన్‌లో 10 రోజుల్లోనే 50% పెరిగింది.

    యాక్సిడెంట్స్

    యాక్సిడెంట్స్

    స్టోర్‌బ్రిడ్జ్‌లో ఓ వ్యక్తి పోకెమాన్ గో ఆడుతూ... రోడ్డుపైకి చూడటానికి బదులు మొబైల్‌వైపు చూస్తూ డ్రైవింగ్ చేస్తుండగా ప్రమాదం జరిగింది. వెంటనే పోలీసులు కూడా పట్టుకున్నారు.

    పోలీస్ హెచ్చరికలు

    పోలీస్ హెచ్చరికలు

    చివరకు పోకెమాన్ గో ఆడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలంటూ... కొన్ని జాగ్రత్తలు చెబుతూ క్లీవ్‌లాండ్ పోలీసులు హెచ్చరికలు కూడా జారీ చేశారు.

    మరో ప్రమాదం

    మరో ప్రమాదం

    నార్త్ టెక్సాస్‌లో పోకెమాన్ ఆడుకుంటూ నిర్జీవ ప్రదేశానికి వెళ్లిన వ్యక్తిని పాము కాటేసింది. ఇదే ప్రాంతంలో మరొక వ్యక్తి అగ్ని ప్రమాదానికి గురయ్యాడు. మరొక వ్యక్తి పోలీస్ వాహనానికి ఢీకొన్నాడు.

    English summary
    Anushka Sharma also seems to be on board with the hype as she has installed Pokémon GO in her phone and looks all set to catch ’em all!
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X