twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హైదరాబాద్ రోడ్లపై అనుష్క సైక్లింగ్... ఎవరూ గుర్తుపట్టకుండా మాస్క్ వేసుకుంటుందట

    |

    అనుష్క ఇఫ్పుడు హైదరాబాద్ లో మాస్క్ వేసుకుని మరీ సైకిల్ తొక్కుతోందట. ఎందుకు ఈ తిప్పలు అంటారా?. నిజంగా అనుష్కకు ఇప్పుడు పెద్ద తిప్పలే వచ్చిపడ్డాయి. పెరగటం అయితే ఈజీగా పెరగొచ్చు కానీ..తగ్గటమే కదా చాలా కష్టం. ఇప్పుడు అనుష్క ఇదే ఇబ్బందిని ఎదుర్కోంటోంది. సైజ్ జీరో కోసం చాలా సులభంగా లావు అయితే అయ్యింది. కానీ ఇప్పుడు తగ్గటమే చుక్కలు చూపిస్తోంది.

    సైజ్ జీఓ సినిమాలో క్యారెక్టర్ డిమాండ్ చేయడంతో విపరీతంగా కాలరీ ఫుడ్ తిని ఇరవై కేజీల బరువు పెరిగిన అనుష్క ని ఇప్పుడు మిగతా సినిమాల్లో క్యారెక్టర్లు వెయిట్ తగ్గమని డిమాండ్ చేస్తున్నాయి. దాంతో స్వీటీ హైదరాబాద్ రోడ్ల మీద సైకిల్‌తో చక్కర్లు కొడుతోంది.యోగా సుందరి అయిన ఈ బ్యూటీనే తగ్గటానికి ఇంత కష్టపడుతుంది అంటే...అబ్బో మామూలు వాళ్లు అయితే వదిలేసి కూర్చుంటారేమో. వెయిట్ తగ్గడం కోసం ఇన్నాళ్లు చేసిన యోగా, జిమ్‌లో ఇతర వ్యాయామాలు ఏవీ అనుష్కకు వర్కవుట్ కాలేదు..

    Anushka shetty

    మొన్నామధ్య బాహుబలి-2 కోసం దర్శకుడు రాజమౌళి అనుష్కను సన్నబడాల్సిందిగా సున్నితంగా చెప్పాడట. దీంతో కాస్త అలిగిన అరుంధతి వెయిట్ తగ్గడం కోసం యోగా, జిమ్‌లో గంటల తరబడి ఇతర వ్యాయామాలు చేసింది. అయితే ఇవేవి అనుష్క వెయిట్‌ను దించలేకపోయాయి. చివరకు , హైదరాబాద్ రోడ్ల మీద సైక్లింగ్ చేస్తుందట స్వీటీ..జిమ్ అంటే నాలుగు గోడల మధ్యన చేసుకోవచ్చు. కానీ అనుష్క లాంటి సెలబ్రిటీ రోడ్ల మీద సైకిల్ తొక్కితే ఇంకేమైనా ఉందా...? అందుకే ఉదయాన్ని ముఖానికి మాస్క్ వేసుకుని 20 కిలోమీటర్లు సైకిల్ తొక్కుతుందట.

    వెయిట్ తగ్గడం కోసం ఇన్నాళ్లు చేసిన యోగా, జిమ్‌లో ఇతర వ్యాయామాలు ఏవీ అనుష్కకు అక్కరకు రాలేదట. చివరకు, ముఖానికి మాస్క్ వేసుకుని ప్రతి రోజూ ఉదయం హైదరాబాద్ రోడ్ల మీద 20 కిలోమీటర్లు సైక్లింగ్ చేస్తూ అనవసర బరువుని తగ్గించుకోవటానికి నానా తంటాలూ పడుతోంది. . కాస్త సులభంగానే వెయిట్ పెరిగిన అనుష్క, తగ్గడానికి మాత్రం చాలా కష్టపడుతోంది. ప్రస్తుతం 'బాహుబలి 2', 'భాగమతి', 'సింగం 3' 'ఓం నమో వెంకటేశాయ' చిత్రాల్లోనటిస్తోంది.

    English summary
    The talk of the town is that the actress who’s in Hyderabad is wearing a face mask and cycling for about 20 km every day
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X