twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆస్కార్ రేసు నుండి ఏఆర్ రెహమాన్ ఔట్

    By Bojja Kumar
    |

    ముంబై: తొలి ఆస్కార్ అవార్డ్ గెలుచుకున్న భారతీయ మ్యూజిక్ డైరెక్టరుగా చరిత్ర సృష్టించిన ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ 87వ ఆస్కార్ అవార్డుల్లో మరోసారి సత్తా చాటాలని ప్రయత్నించాడు. 2014లో ఆయన సంగీత సారథ్యం వహించిన మిలియన్ డాలర్ ఆర్మ్, హండ్రడ్ ఫుట్ జర్నీ, కొచ్చాడియాన్ సినిమాలు బెస్ట్ ఓరిజినల్ స్కోర్ విభాగంలో ఆస్కార్ బరిలో పోటీ పడ్డాయి. అయితే ఫైనల్ నామినేషన్స్‌లో ఈ చిత్రాలకు చోటు దక్కలేదు. దీంతో ఈ సారి ఆయనకు అవార్డు దక్కే అవకాశం లేనట్టే అని స్పష్టం అవుతోంది. ఫిబ్రవిర 22న ఈ అవార్డుల ప్రధానోత్సవం జరుగనుంది. గతంలో ‘స్లమ్ డాగ్ మిలియనీర్' చిత్రానికి రెహమాన్ ఆస్కార్ అవార్డు అందుకున్స సంగతి తెలిసిందే.

     AR Rahman out of Oscar race

    ఈ అవార్డుల సంగతి పక్కన పెడితే త్వరలో రెహమాన్ సరికొత్త అవతారం ఎత్తబోతున్నారు. స్క్రిప్టు రైటర్‌గా తన టాలెంట్ ప్రదర్శించబోతున్నారు. ఈ విషయం స్వయంగా ఏఆర్ రెహమాన్ వెల్లడించడం గమనార్హం. ముంబైలో జరిగిన హిందీ వెర్షన్ ‘ఐ' ఆడియో వేడుకలో రెహమాన్ ఈ విషయం వెల్లడించారు.

    తన రాసిన స్క్రిప్టు అందించిన సినిమాలో ఆయన నిర్మాతగా నటించబోతున్నారు కూడా. త్వరలోనే ఆ చిత్రానికి సంబంధించిన వివరాలు వెల్లడి కానున్నాయి. 2014 సంవత్సరం తనకు ఎంతో ప్రత్యేకమైన సంవత్సరమని, ఈ సంవత్సరం మొత్తం 14 చిత్రాలకు సంగీతం అందించాను. అందులో మూడు హాలీవుడ్ ప్రాజెక్టులు కూడా ఉన్నాయని తెలిపారు.

    English summary
    AR Rahman is out of the race for the 87th Oscar Awards. He was in contention for the Oscar nomination in the Best Original Score category with three films ‘Million Dollar Arm’, ‘Hundred Foot Journey’ and Rajinikanth’s ‘Kochadaiiyan’.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X