twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ట్రైలర్ బావుంది: ఈ సారి హిట్టుకొడతాడేమో? (వీడియో)

    By Bojja Kumar
    |

    సాయి రామ్ శంకర్, నికేష పటేల్ జంటగా వాసుదేవ్ దర్శకత్వంలో మేకా బాలసుబ్రమణ్యం, సురేష్ వర్మ ఇందుకూరి, నక్కా రామేశ్వరి సంయుక్తంగా నిర్మిస్తోన్న చిత్రం 'అరకు రోడ్ లో'. రాహుల్ రాజ్, వాసుదేవ్ సంగీతం అందించిన ఈ సినిమాలోని పాటలను సోమవారం హైదరాబాద్లోని జె.ఆర్.సి. కన్వెన్షన్లో విడుదల చేశారు.

    థియేట్రికల్ ట్రైలర్ను హీరో కళ్యాణ్ రామ్ విడుదల చేశారు. బిగ్ సీడీని పూరి జగన్నాథ్, కళ్యాణ్ రామ్ విడుదల చేశారు. ఆడియో సీడీలను పూరి జగన్నాథ్ విడుదల చేసి తొలి సీడీని కళ్యాణ్ రామ్ కు అందించారు. పూరి సంగీత్ ద్వారా మార్కెట్లోకి పాటలు విడుదలయ్యాయి.

    సరైన హిట్టులేక సాయిరాం శంకర్ చాలా కాలంగా కెరీర్ పరంగా స్ట్రగుల్ అవుతున్నాడు. అయితే ఈ సారి అరకు రోడ్ లో సినిమాతో ఈ హీరో హిట్టుకొట్టేలా ఉన్నాడని అంటున్నారంతా. అందుకు కారణం ఈ చిత్రం ట్రైలర్ ఆకట్టుకునే విధంగా ఉండటమే. ట్రైలర్ చూస్తుంటే సినిమాలో మంచి కంటెంట్ ఉందని స్పష్టమవుతోంది. ట్రైలర్ పై మీరూ ఓ లుక్కేయండి మరి....

    టీం ప‌డ్డ క‌ష్ట‌మంతా తెలుస్తుంది

    టీం ప‌డ్డ క‌ష్ట‌మంతా తెలుస్తుంది

    పూరి జ‌గ‌న్నాథ్ మాట్లాడుతూ...అర‌కురోడ్‌లో థియేట్రిక‌ల్ ట్రైల‌ర్ చూస్తుంటే సినిమా కోసం టీం ప‌డ్డ క‌ష్ట‌మంతా తెలుస్తుంది. చాలా బావుంది. గడ్డం సాంగ్ బావుంది. అన్నీ సాంగ్స్‌లో ఈ సాంగ్ పెద్ద హిట్ అవుతుందని అనుకుంటున్నాను. డైరెక్ట‌ర్ వాసుదేవ్‌, నిర్మాత‌లు స‌హా ఎంటైర్ టీంకు ఆల్ ది బెస్ట్‌`` అన్నారు.

    సాయిరాంకు మంచి బ్రేక్ తెస్తుంద‌ంటూ

    సాయిరాంకు మంచి బ్రేక్ తెస్తుంద‌ంటూ

    హీరో క‌ల్యాణ్ రామ్ మాట్లాడుతూ .....``సాయిరాం శంక‌ర్ గ‌త ప‌దేళ్లుగా తెలుసు. చాలా మంచి వ్య‌క్తి. హిట్ కోసం ట్రై చేస్తూ ముందడుగు వేయాలని సాయిరాం శంక‌ర్‌కు ఈ సందర్భంగా తెలియ‌జేస్తున్నాను. గ‌డ్డం తెల్ల‌బ‌డిపోతుంద‌నే సాంగ్‌ను సాయిరాం ఎప్పుడో చూపించాడు. చూడ‌గానే న‌చ్చేసింది. థియేట్రిక‌ల్ ట్రైల‌ర్ కూడా బావుంది. ఈ అర‌కు రోడ్‌లో సినిమా సాయిరాంకు మంచి బ్రేక్ తెస్తుంద‌ని భావిస్తున్నాను. ద‌ర్శ‌కుడు వాసుదేవ్ చాలా టాలెంటెడ్ అని తెలుస్తుంది. నిర్మాత‌లు స‌హా న‌టీనటులు, టెక్నిషియ‌న్స్ అంద‌రికీ థాంక్స్‌`` అన్నారు.

    హీరో భ‌య‌స్తుడు. అమ్మాయిల‌ను చూస్తే న‌త్తి వ‌చ్చేస్తుంది

    హీరో భ‌య‌స్తుడు. అమ్మాయిల‌ను చూస్తే న‌త్తి వ‌చ్చేస్తుంది

    సాయిరాం శంక‌ర్ మాట్లాడుతూ ....``ఈ చిత్రంలో హీరో భ‌య‌స్తుడు. అమ్మాయిల‌ను చూస్తే న‌త్తి వ‌చ్చేస్తుంది. అలాంటి హీరో జీవితంలో జ‌రిగే ఘ‌ట‌న‌తో జీవితం ట‌ర్న్ తీసుకుంటుంది. అదేంట‌నేది సినిమాలో చూడాల్సిందే. నా క్యారెక్ట‌ర్‌ను డైరెక్ట‌ర్ గారు చాలా బాగా డిజైన్ చేశారు. మంచి స‌క్సెస్‌ను తెచ్చి పెట్టే సినిమా అవుతుంద‌ని భావిస్తున్నాను అన్నారు.

    స‌క్సెస్ గురించి దండ‌యాత్ర చేస్తున్నాన‌ని ఎవ‌రో రాశారు

    స‌క్సెస్ గురించి దండ‌యాత్ర చేస్తున్నాన‌ని ఎవ‌రో రాశారు

    స‌క్సెస్ గురించి దండ‌యాత్ర చేస్తున్నాన‌ని ఎవ‌రో రాశారు. ఆ వార్త బాగా న‌చ్చింది. ఎందుకంటే దండ‌యాత్ర చేయ‌కుంటే త‌ప్పు అవుతుంది. ఈ అర‌కురోడ్‌లో చిత్రంతో మ‌రోసారి దండ‌యాత్ర చేయ‌బోతున్నాను. ఈ దండ‌యాత్ర స‌క్సెస్ అవుతుంద‌ని భావిస్తున్నాను అని సాయిరాం శంకర్ తెలిపారు.

    పని రాక్ష‌సుడు

    పని రాక్ష‌సుడు

    వాసుదేవ్‌ మ‌ల్టీ టాలెంటెడ్‌. పని రాక్ష‌సుడు. చాలా బాగా క‌ష్ట‌ప‌డ్డాడు. ఆ క‌ష్టంతో మా అంద‌రికీ స‌క్సెస్ వ‌స్తుంద‌ని అనుకుంటున్నాను. ఓ మంచి డైరెక్ట‌ర్‌తో ప‌నిచేసే అవ‌కాశం క‌లిగింది. మంచి నిర్మాత‌లు. జ‌గ‌దీష్ చీక‌టి మంచి సినిమాటోగ్రాప‌ర్‌గా పేరు తెచ్చుకుంటాడు. మంచి టీంతో ప‌నిచేశాం. ఆద‌రిస్తారని భావిస్తున్నామని సాయిరాం శంకర్ తెలిపారు.

    నా హృద‌యానికి ద‌గ్గ‌రైన చిత్రం

    నా హృద‌యానికి ద‌గ్గ‌రైన చిత్రం

    నికిషా ప‌టేల్ మాట్లాడుతూ ``అర‌కులోడ్‌లో నా హృద‌యానికి ద‌గ్గ‌రైన చిత్రం. వాసుదేవ్‌గారు ఎంతో హార్డ్‌వ‌ర్క్ తో ఈ సినిమా చేశారు. సాయిరాంశంక‌ర్ చాలా టాలెంటెడ్ న‌టుడు. జ‌గ‌దీష్ చీక‌టిగారు ప్ర‌తి సీన్‌ను ఎంతో అందంగా చూపించారు. సినిమా బాగా వ‌చ్చింది. ఎంటైర్ టీంకు ఆల్ ది బెస్ట్‌`` అన్నారు.

    ఈ సినిమా చాలా రిచ్ గా ఉంది

    ఈ సినిమా చాలా రిచ్ గా ఉంది

    ఆకాష్ పూరి మాట్లాడుతూ - ``మా బాబాయ్ నటించిన సినిమాల్లో ఈ సినిమా చాలా రిచ్ గా ఉంది. సినిమా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను`` అన్నారు. చిత్ర ద‌ర్శ‌కుడు వాసుదేవ్ మాట్లాడుతూ - ``ద‌ర్శ‌కుడిగా నాకు అవ‌కాశం ఇచ్చిన నిర్మాత‌లకు థాంక్స్‌. సినిమా బాగా న‌చ్చుతుంద‌ని భావిస్తున్నాను. స‌హ‌కారం అందించిన అంద‌రికీ ఆల్ ది బెస్ట్`` అన్నారు.

    సాయిరాం శంక‌ర్‌ కుమార్తె ఈ చిత్రంలో న‌టిస్తుంది

    సాయిరాం శంక‌ర్‌ కుమార్తె ఈ చిత్రంలో న‌టిస్తుంది

    నిర్మాత మేకా బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం మాట్లాడుతూ - ``సాయిరాంగారు, నికిషా ప‌టేల్ స‌హా అంద‌రూ బాగా స‌పోర్ట్ చేశారు. సాయిరాంశంక‌ర్‌గారి కుమార్తె ఈ చిత్రంలో న‌టిస్తుంది. స‌పోర్ట్ చేసిన అంద‌రికీ థాంక్స్‌`` అన్నారు. కమల్ కామరాజు, అభిమన్యు సింగ్, కోవై సరళ, థర్టీ ఇయర్స్ పృథ్వి, కృష్ణ భగవాన్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఎడిటర్ : మార్తాండ్ కె. వెంకటేష్, సంగీతం : రాహుల్ రాజ్, వాసుదేవ్, డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ : జగదీశ్ చీకటి, నిర్మాతలు : మేకా బాలసుబ్రహ్మణ్యం, బి.భాస్కర్, వేగిరాజు ప్రసాద రాజు, రామేశ్వరి నక్కా, రచన, దర్శకత్వం : వాసుదేవ్.

    English summary
    Watch Araku Road Lo Movie Theatrical Trailer staring Raam Shankar, Nikesha Patel.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X