» 

సెప్టెంబర్ 20న ‘వీరప్పన్’ చిత్రం

Give your rating:

యాక్షన్ కింగ్ అర్జున్, లక్ష్మీరాయ్, కిశోర్, రవికాలె ప్రధాన పాత్రధారులుగా ఎ.ఎమ్.ఆర్ రమేష్ స్వీయ దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'వీరప్పన్'. గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ జీవిత కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రం తమిళ, కన్నడ, మళయాళ భాషల్లో విడుదలై సెన్సెషనల్ హిట్ గా నిలిచింది. శ్రీ జె.వి. ప్రొడక్షన్స్ పతాకంపై అక్షయ క్రియేషన్స్ సమర్పణలో యమ్. వెంకట్రావ్, ఎ.ఎం.ఆర్. రమేష్, కె. రామకృష్ణ సంయుక్తంగా అందిస్తున్న 'వీరప్పన్' చిత్రాన్ని ఎంతోమంది నిర్మాతలు పోటీ పడినా భారీ ఆఫర్ వెచ్చించి తెలుగు అనువాద హక్కులను సంపాదించుకున్నారు శ్రీ జె.వి. ప్రొడక్షన్స్ అధినేత యమ్. వెంకట్రావ్. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకొని సెప్టెంబర్ 20న విడుదలకు సన్నద్ధమవుతున్న ఈ చిత్ర విశేషాలను నిర్మాతల్లో ఒకరైన యమ్. వెంకట్రావ్ తెలియజేశారు.

యమ్. వెంకట్రావ్ మాట్లాడుతూ..తమిళ, కన్నడ, మళయాల భాషల్లో రిలీజై సెన్సెషనల్ హిట్ అయిన 'వీరప్పన్' చిత్రాన్ని మా సంస్థ ద్వారా తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నందుకు ఎంతో గర్వంగా ఉందన్నారు. మొన్న 'దండుపాళ్యం', నిన్న '26/11' వంటి రియలిస్టిక్ కథాంశంతో రూపొందిన చిత్రాలు ఘన విజయం సాధించిన విషయం తెలిసిందెనని అన్నారు. నేడు 'వీరప్పన్' చిత్రం మరో సంచలనం సృష్టిస్తుందని నమ్మకం ఉందని చెప్పారు. ఈ ప్రపంచంలో వీరప్పన్ పేరు తెలియని వారెవ్వరూ ఉండరని, అలాంటి వీరప్పన్ కథాంశాన్ని ఎంచుకొని రియలిస్టిక్ అప్రోచ్ తో తమ దర్శకుడు తెరకెక్కించారని తెలిపారు.

నిజ జీవితంలో వీరప్పన్ ఎక్కడ నివసించాడు? అతను ఏ ఏ ప్రాంతాల్లో తిరిగాడు? అతని జీవన శైలి ఏ విధంగా సాగింది? అనేది ఈ చిత్రంలో క్లియర్ గా చూపించడం జరిగిందని తెలిపారు. అతను తిరిగిన ప్రదేశాల్లోనే ఈ చిత్రం షూటింగ్ ని జరపడం విశేషమని చెప్పారు. ప్రముఖ నటుడు కిశోర్.. వీరప్పన్ క్యారెక్టర్ లో లీనమై అత్యద్భుతంగా నటించారని తెలిపారు. మళ్లీ వీరప్పన్ తిరిగి వచ్చాడా..అనేతంగా ఆ క్యారెక్టర్ కి జీవం పోశాడన్నారు. యాక్షన్ కింగ్ అర్జున్ విజయ్ కుమార్ ఐ.పి.ఎస్ క్యారెక్టర్ ని ఎక్స్ ట్రార్డినరీగా చేశారన్నారు. అలాగే జర్నలిస్టు పాత్రలో లక్ష్మీరాయ్, ఇతర ముఖ్య పాత్రల్లో రవికాలె, సురేష్ ఓబరాయ్, తదితరులు తమ పాత్రలకు న్యాయం చేశారన్నారు.

ఈ చిత్రానికి విజయ్ మిల్టన్ అందించిన ఫొటోగ్రఫీ ఒన్ ఆఫ్ ది ఎస్సెట్ గా నిలుస్తుందన్నారు. ప్రతి ఫ్రేమ్ ని అంత అద్భుతంగా చిత్రీకరించారన్నారు. సందీప్ చౌతా మ్యూజిక్ ఎక్స్ ట్రార్డినరీగా ఉందన్నారు. ముఖ్యంగా రీ-రికార్డింగ్ ని అద్భుతంగా చేశారన్నారు. రవివర్మ, కె.వి. వెంకటేష్, దిలీప్ సుబ్బరాయన్ లు యాక్షన్ సీన్స్ ని ఎక్స్‌లెంట్‌గా కంపోజ్ చేశారన్నారు. క్లైమాక్స్ ఇంతవరకూ చూడని విధంగా ఉంటుందన్నారు. కథ ఆద్యంతం ఆసక్తికరంగా టెంపోతో సాగుతుందన్నారు. సినిమా స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఇంట్రెస్టింగ్ గా క్యూరియాసిటీతో రన్ అవుతుందని తెలిపారు. ఈ సినిమాని హిందీలో కూడా రీమేక్ చేస్తున్నట్లు తెలిపారు. డెఫినెట్ గా ఈ చిత్రం తెలుగులో సంచలన విజయం సాధిస్తుందన్నారు.

యాక్షన్ కింగ్ అర్జున్, లక్ష్మీరాయ్, కిశోర్, రవికాలె, సురేష్ ఓబెరాయ్, సుచేంద్రప్రసాద్, సంపత్ రామ్, జయబాలన్, ఎ.యం.ఆర్. రమేష్, సులక్షణ, విజయలక్ష్మీ, భావనారావ్, తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: సందీప్ చౌత, కెమెరా: విజయ్ మిల్టన్, ఎడిటింగ్: అంథోని, ఫైట్స్: రవివర్మ, కె.డి. వెంకటేష్, దిలీప్ సుబ్బరాయన్, అసోసియేట్ డైరెక్టర్: బి.యమ్.పి. అన్నయ్య, కథ, స్ర్ర్కీన్ ప్లే, మాటలు, దర్శకత్వం: ఎ.ఎమ్.ఆర్. రమేష్, నిర్మాతలు: యమ్. వెంకట్రావ్, ఎ.ఎమ్.ఆర్. రమేష్, కె. రామకృష్ణ.

Read more about: veerappan, arjun, laxmi rai, వీరప్పన్, అర్జున్, లక్ష్మిరాయ్
English summary
Action king Arjun is being done in the role of a police officer Vijayakumar who nabbed the forest brigand Veerappan. This is directed by AMR Ramesh and M. Venkatrav produced this movie telugu version.
Please Wait while comments are loading...
 
X

X
Skip Ad
Please wait for seconds

Bringing you the best live coverage @ Auto Expo 2016! Click here to get the latest updates from the show floor. And Don't forget to Bookmark the page — #2016AutoExpoLive