Don't Miss!
- News వర్షాలపై ఏపీకి వాతావరణశాఖ తీవ్ర హెచ్చరిక
- Technology మే 7 న Apple 'Let Loose' ఈవెంట్! ఏ యే గాడ్జెట్లు లాంచ్ కాబోతున్నాయి? వివరాలు
- Finance IT News: రిక్రూట్మెంట్ రూటు మార్చిన ఇన్ఫోసిస్.. టాటా Elxsi న్యూ హైరింగ్..
- Lifestyle May Day 2024 Wishes : శ్రామికులు లేనిదే అభివృద్ధి లేదు.. శ్రామికుల దినోత్సవ శుభాకాంక్షలు
- Sports ధోనీకి కోపం వచ్చింది.. భయపడిన కెమెరామెన్ Video
- Automobiles 'కావ్య మారన్' ఖరీదైన కార్లు ఇవే! ఇక్కడ చూడండి
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
బిగ్ బాస్ హౌస్‌లో సల్మాన్ ఖాన్...చెల్లి-బావ (ఫోటో)
ముంబై: బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ ముద్దుల చెల్లెలు అర్పిత ఖాన్ వివాహం ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన సంగతి తెలిసిందే. అనంతరం ముంబైలో గ్రాండ్‌గా వెడ్డింగ్ రిసెప్షన్ నిర్వహించారు. ఢిల్లీకి చెందిన ఆయుష్ శర్మతో అర్పిత ఖాన్ వివాహం జరిగింది. గత కొంత కాలంగా అర్పిత, ఆయుష్ ప్రేమించుకుంటున్నారు. పెద్దల అంగీకారంతో వివాహం జరిగింది.
కాగా....ప్రస్తుతం జరుగుతున్న బిగ్ బాస్ రియాల్టీ షోకు హోస్ట్‌గా వ్యవహరిస్తున్న సల్మాన్ ఖాన్...నూతన దంపతులను బిగ్ బాస్ హౌస్‌కు తీసుకెళ్లారు. కంటెస్టెంట్స్‌కు వారిని పరిచయం చేసారు. సల్మాన్ ఖాన్‌తో పాటు, అర్పిత, ఆయుష్ కూడా రావడంతో బిగ్ బాస్ కంటెస్టెంట్స్ సంతోషం వ్యక్తం చేసారు. వారికి విషెస్ తెలిపారు.
హైదరాబాద్ తాజ్ ఫలక్‌నుమా ప్యాలెస్‌లో ఆయుష్ శర్మతో అంగరంగ వైభవంగా అర్పిత వివాహం జరిగింది. హిందూ సాంప్రదాయం ప్రకారం వివాహ వేడుక నిర్వహించారు. ఈ వివాహ వేడుకకు కొద్ది మంది ఎంపిక చేసిన అతిథులు మాత్రమే హాజరయ్యారు. అనంతరం ముంబైలో అర్పితా ఖాన్ వెడ్డింగ్ రిసెప్షన్ గ్రాండ్‌గా జరిగింది. ఈ వేడుకలో బాలీవుడ్ స్టార్స్ అంతా పాల్గొన్నారు. దిలీప్ కుమార్, సైరా భాను, ఆశా పారఖ్, అజయ్ దేవగన్, హృతిక్ రోషన్, రితేష్ దేశ్ ముఖ్, జెనీలియా డిసౌజా, గోవిందా, ఫర్హాన్ అక్తర్, వినోద్ ఖన్నా, శ్రద్ధా కపూర్, బాబీ డియోల్, లారాదత్తా, జాక్వెలిన్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్ ఇద్దరూ కలిసి పలు బాలీవుడ్ సాంగుకుల డాన్స్ చేసారు. ఈ సంవత్సరం బాలీవుడ్లో జరిగిన బిగ్గెస్ట్ వెడ్డింగ్ పార్టీ ఇదే అనే విధంగా ఈ వేడుక సాగింది.