twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'మా' ఎన్నిక : పెద్దలు చిచ్చుపెట్టారంటూ రోజా

    By Srikanya
    |

    హైదరాబాద్: గతంలో కన్నా ప్రస్తుతం జరుగుతున్న మూవీ ఆర్ట్స్ అసోసియేషన్ ఎన్నికల తీరు కాస్తంత బాధను కలిగించిందని వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, నటి రోజా అన్నారు. ఆదివారం జరుగుతున్న మా ఎన్నికల్లో ఓటేసేందుకు వచ్చిన ఆమె మీడియాతో మాట్లాడుతూ రెండేళ్లకోసారి కావడంవల్ల పెద్దలంతా ఓసారి ఓచోట కూర్చుని ఎవరికో ఒకరిని 'మా' అధ్యక్షుడిని ఎన్నుకుంటే బావుండేదని అన్నారు.

    ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

    ఎవరి లాభాలను ఇందులో చూపించకుండా ఉండాల్సిందని, ఎవరో పెద్దలు తమ స్వార్థంతో దీనివెనుకాల ఉండి చిచ్చు పెట్టారని అన్నారు. అయితే, కాంపిటేషన్ ఉండటం ప్రస్తుతం మంచిదని, అలా ఉన్నప్పుడే ఎవరు ఏం చేస్తారో ముందే చెప్తారని అన్నారు. గతంలో ఎన్నడూ లేనిది ఈసారి మ్యానిఫెస్టో వచ్చిందని చెప్పారు.

    ఇప్పటివరకు చిన్నచిన్న నటులకు మా వల్ల పెద్ద సాయం జరగలేదని, వృద్ధ కళాకారులను ఇకముందైనా ఆదుకుంటుందని భావిస్తున్నామని చెప్పారు. మాను సొంత ఇంటిలా చిన్న కళాకారులు ఫీలవలేకపోయారని ఆ లోటు లేకుండా చూడాలని చెప్పారు. భవిష్యత్ మంచిగా, హెల్దీగా ఉండేలా మా పరిస్థితి ఉండాలని ఆశించారు.

    Artist Roja on Maa Elections

    మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ అధ్యక్ష ఎన్నికల పోలింగ్‌ హైదరాబాద్‌ ఫిలిం ఛాంబర్‌లో కొనసాగుతోంది. ఉదయం 8గంటలకు ప్రారంభమైన పోలింగ్‌ మధ్యాహ్నం 2గంటల వరకు జరగనుంది. ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ మెషీన్‌(ఈవీఎం)ల ద్వారా పోలింగ్‌ నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం సుమారు 150 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. అగ్ర హీరోలు ఎవ్వరూ ఇప్పటివరకూ ఓటు వేయలేదని సమాచారం. 350 లోపే ఓట్లు పోలయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

    ఇప్పటికే జయసుధ,రాజేంద్రప్రసాద్, మురళిమోహన్ తమ ఓటు హక్కుని వినియోగించుకున్నారు. అలాగే సుమన్ సైతం ఓటు హక్కుని వినియోగించుకున్నారు. బయిటకు వచ్చాక...తనకు నమ్మకమున్న వ్యక్తికి ఓటు వేశానని ప్రముఖ సినీ నటుడు సుమన్ అన్నారు. ఆదివారం జరుగుతున్న మూవీ ఆర్ట్స్ అసోసియేషన్ ఎన్నికల్లో ఓటేసేందుకు వచ్చిన ఆయనను మీడియా పలకరించింది.

    ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన మనసుకు నచ్చిన, నమ్మకమున్న వ్యక్తికి తన ఓటు ఉపయోగించానని చెప్పారు. మా పనితీరు గతంలో బాగుందా ఇప్పుడు బాగుందా.. మున్ముందు బాగుందా అనే విషయం తాను ఇప్పుడే చెప్పలేనని అన్నారు. ఇప్పుడు కొత్తగా ఎన్నికయ్యే ప్యానెల్ పనితీరు అనంతరం ఏ విషయమైన చెప్పగలమని అన్నారు. అలాగని, గతంలో పనిచేసిన ప్యానెల్ సరిగా పనిచేయలేదని చెప్పబోనని, వారు మంచే చేశారని, వచ్చే కొత్త ప్యానెల్ మరింత బెటర్ గా పనిచేస్తుందని తాను భావిస్తున్నానని అన్నారు.

    తెలుగు మూవీ ఆర్టిస్టుల సంఘంలోని 702 మంది సభ్యులు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. 'మా' అధ్యక్ష పదవి ఎన్నికపై సినీ పరిశ్రమతో పాటు తెలుగు ప్రజల ఆసక్తి నెలకొంది. అధ్యక్ష పదవి రేసులో నటుడు రాజేంద్రప్రసాద్‌, నటి జయసుధతో పాటు బొమ్మరిల్లు ధూళిపాళ్ల అనే మరో నటుడు ఉన్నారు. మా ఎన్నికల నిర్వహణ న్యాయస్థానం పరిధిలోకి చేరినందువల్ల ఇవాళ పోలింగ్‌ మాత్రమే జరుగుతుంది. ఫలితాలు కోర్టు తుది తీర్పు తర్వాత వెల్లడయ్యే అవకాశముంది.

    జయసుధ, రాజేంద్రప్రసాద్‌ ప్యానెళ్ల మధ్య హోరీహోరీగా జరుగుతున్న ఈ ఎన్నికల్లో మధ్యాహ్నం రెండు గంటల వరకు పోలింగ్‌ జరగనుందన్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పటివరకూ ఉన్న కోర్టు ఆదేశాల మేరకు నేడు కౌంటింగ్‌ ఉండదు. ఆరోపణలు, ప్రత్యారోపణలతో సార్వత్రిక ఎన్నికలను తలపించిన ఈ ఎన్నికలపై సినీ జనాలతోపాటు సామాన్యులు కూడా ఆసక్తి పెంచుకున్నారు.

    English summary
    Artist Roja said ..she is not happy with Maa elections.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X