twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సినీ హీరోలు పురుగులు, పట్టించుకోవద్దు... అసలైన హీరోలు వాళ్లే!

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: బాలీవుడ్ ప్రముఖ నటుడు నానా పాటేకర్ సినీ హీరోలపై సంచలన కామెంట్స్ చేసారు. వారు చెదపురుగుల లాంటి వారని, వారివ్యాఖ్యలు పట్టించుకోవద్దని... అసలైన హీరోలు దేశ రక్షణ కోసం పోరాడే సైనికులే అని ఆయన ఇటీవల ఓ ఆంగ్లప్రతికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.

    భారత్-పాక్ సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో కొన్ని రాజకీయ పార్టీలు పాకిస్థాన్ నటులు దేశం విడిచి వెళ్లి పోవాలని వార్నింగ్ ఇవ్వడం.... పాకిస్థాన్ నటులకు మద్దతు ఇస్తూ సల్మాన్ ఖాన్, సైఫ్ అలీ ఖాన్ లాంటి వాళ్లు కామెంట్స్ ఇచ్చిన నేపథ్యంలో నానా పాటేకర్ ఇలాంటి కామెంట్స్ చేయడం విశేష.

    వారికి అర్హత లేదు

    వారికి అర్హత లేదు

    ‘సినిమా వాళ్లంతా నకిలీ సరుకులు. వారికి జాతిని ఉద్దేశించి ప్రసంగించేంత అర్హత లేదు. దేశ సైనికులతో పోలుచ్చుకుంటే వారు పురుగులతో సమానం. వారి మాటలను ప్రజలు కానీ, మీడియా కాని పట్టించుకోనవసరం లేదని నానా పాటేకర్ అన్నారు.

    అసలైన హీరోలు

    అసలైన హీరోలు

    అసలైన హీరోలు సరిహద్దుల్లో మన కోసం పోరాడే సైనికులు మాత్రమే, వారిని మాత్రమే నిజమైన హీరోలుగా ఊహించుకోండి, సినిమా వారిని హీరోలుగా ఊహిచుకోవద్దు, వారిని అసలు పట్టించుకోవద్దు, పురుగుల్లాంటి వారని అన్నారు.

    సైన్యంలో పని చేసినా నానా పాటేకర్

    సైన్యంలో పని చేసినా నానా పాటేకర్

    సినిమాల్లోకి రాకముందు నానా పాటేకర్‌ సైన్యంలో పనిచేశాడు. సినిమాల్లోకి వచ్చిన తర్వాత ఆయన కొన్ని పరిస్థితులను చూసి సహించలేక గతంలోనూ ప్రముఖులపై ఇలాంటి ఘాటైన కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే.

    మద్దతు ఇచ్చిన సల్మాన్

    మద్దతు ఇచ్చిన సల్మాన్

    యూరీ ఉగ్రదాడి నేపథ్యంలో బాలీవుడ్ లోని పాకిస్థాన్ నటులు 48 గంటల్లోగా దేశం విడిచి వెళ్లిపోవాలంటూ కొన్నిరోజుల క్రితం మహారాష్ట్ర నవనిర్మాణ సేన హెచ్చరించిన సంగతి తెలిసిందే. దీనిపై స‌ల్మాన్ ఖాన్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశాడు. పాకిస్థాన్ సినీ న‌టులు భార‌త్‌కు రావాల‌ని పిలుపునిచ్చాడు.

    వారు ఉగ్రవాదులు కాదన్న సల్మాన్

    వారు ఉగ్రవాదులు కాదన్న సల్మాన్

    యూరీ ఘ‌ట‌న‌కు పాల్ప‌డింది ఉగ్ర‌వాదులే.. కానీ న‌టీన‌టులు కాదన్నారు. పాక్ ఆర్టిస్టులు ఉగ్ర‌వాదులు కాదన్నారు. న‌టీన‌టులు, ఉగ్రవాదులు వేర్వేరు అని ఆయ‌న చెప్పుకొచ్చారు. స‌రైన వీసా వ‌ర్క్ ప‌ర్మిట్‌తో భార‌త్‌కు రావాల‌ని పిలుపునిచ్చాడు. ఎంతో మంది పాక్ క‌ళాకారుల‌కు ఇక్క‌డ నివ‌సించ‌డానికి వాలిడ్ వీసా ఉంద‌ని గుర్తుచేశారు. అదేసమయంలో భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య శాంతి వాతావరణం నెలకొనాలన్నారు సల్మాన్.

    మన పోసానికి కూడా కాలింది

    మన పోసానికి కూడా కాలింది

    పాకిస్థాన్ నటులకు మద్దతుగా నిలిచిన సల్మాన్ పై తెలుగు నటుడు పోసాని కృష్ణ మురళి కూడా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ దేశంలో సల్మాన్ ఖాన్ కంటే పెద్ద తీవ్రవాది మరెవరూ లేరని పోసాని ఘాటుగా వ్యాఖ్యానించారు.

    ఉత్తముడేం కాదు

    ఉత్తముడేం కాదు

    సల్మాన్ ఖాన్ అంత ఉత్తముడేం కాదని, అతడు ఉత్తముడైతే, ఆరోజు తన కారు యాక్సిడెంట్ జరిగిన రోజున అక్కడే ఉండకుండా ఎందుకు పారిపోయాడని ప్రశ్నించారు పోసాని.

    English summary
    In his statement given to Times Now, Nana Patekar said, "Pakistani artists are secondary. What comes first for me is my nation. I neither know nor would I want to know anyone else other than my nation. We artistes are like mere termites when compared to our nation as a whole. We are least important people.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X