twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అద్గదీ సంగతి: అందుకే చిరు 150వ సినిమా జాప్యం!

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: అప్పుడెప్పుడో చిరంజీవి పుట్టినరోజు నాడే ఆయన 150వ సినిమా వివరాలు చెబుతామన్నారు. కానీ వాయిదా వేసారు. మరింత జాప్యం చేస్తూ వస్తున్నారు. ఈ జాప్యానికి కారణమేంటో తెలిసి పోయింది. ఆ మధ్య చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా నేపాల్ లోని పుశుపతినాథ్ ఆలయాన్ని సందర్శించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా అక్కడి ఆలయ పండితులు ఓ విషయం సూచించారట. ఏ కొత్త ప్రాజెక్టు అయినా కార్తీక మాసం తర్వాత అంటే నవంబర్ తర్వాతే మొదలు పెట్టాలని సూచించారట. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కూడా రామ్ చరణ్ ఈ సినిమాపై స్పందిస్తూ.....ఏ విషయమైనా నవంబర్ తర్వాత వెల్లడిస్తామన్నారు. అన్నదమాట సంగతి

    మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా గురించి గత సంవత్సరకాలంగా హాట్ టాపిక్ నడుస్తున్న సంగతి తెలిసిందే. అదిగో ఇదిగో అంటూ అభిమానులను ఊరిస్తూనే ఉన్నారు. ఇప్పటి వరకు ఈ సినిమాకు దర్శకడు ఎవరనే విషయం ఖరారు కాలేదు. కథ కూడా ఏదనేది ఇంకా ఫైనల్ కాలేదు.

    Astrology Stopped Chiranjeevi’s 150th film?

    చిరంజీవి సినిమా గురించి ఇప్పటి వరకు వివిధ రకాల వార్తలు వినీ వినీ అభిమానులు విసిగిపోయారు. తాజాగా మరో వార్త ప్రచారంలోకి వచ్చింది. తన 150వ సినిమాకు ఆయనే దర్శకత్వం వహించబోతున్నారంటూ వార్తలు వెలువడ్డాయి. ఈ చిత్రంతో ఆయన దర్శకుడిగా మారబోతున్నాడట.

    వినడానికి ఈ వార్త అసలు నమ్మబుద్ది కావడం లేదు. అసలు దర్శకత్వంలో అనుభవం లేని చిరంజీవి తను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న 150వ సినిమా విషయంలో ప్రయోగాలు చేస్తారని ఊహించడం లేదని అభిమానులు అంటున్నారు. మరి చిరంజీవి దర్శకత్వం వహిస్తారనే వార్తల్లో నిజానిజాలపై రామ్ చరణ్ గానీ, చిరంజీవి గానీ స్పందించాల్సి ఉంది.

    English summary
    Megastar visited the holy shrine of Pasupathinath in Nepal. If we have to believe sources, vedic astrologers at the temple asked Chiru to start any new project whether it is a cinema or any business only after November, post the end of Kartheeka Maasam.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X