»   » దర్శకుడిని పెళ్లాడిన అశ్వినీదత్ కుమార్తె: సినీ స్టార్ల సందడి (ఫోటోస్)

దర్శకుడిని పెళ్లాడిన అశ్వినీదత్ కుమార్తె: సినీ స్టార్ల సందడి (ఫోటోస్)

Posted by:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ప్రముఖ తెలుగు నిర్మాత అశ్వినీదత్ కుమార్తె ప్రియాంక దత్ వివాహం గ్రాండ్ గా జరిగింది. హైదరాబాద్ లో జరిగిన వెడ్డింగ్ రిసెప్షన్ కు పలువురు సినీ స్టార్లు హాజరై సందడి చేసారు. దాసరి నారాయణ రావు, మహేష్ బాబు, నమ్రత, అల్లు అర్జున్, స్నేహా రెడ్డి, పూరి జగన్నాథ్ భార్య, కూతురు, హీరో వెంకటేష్, ఎన్టీఆర్ భార్య లక్ష్మి ప్రణతి, అల్లు అరవింద్, ఎస్వీ కృష్ణారెడ్డి, మణిశర్మ, మోహర్ రమేస్, ఎల్ బి శ్రీరామ్ తదితరులు హాజరయ్యారు.

‘ఎవడే సుబ్రహ్మణ్యం' దర్శకుడు నాగ్ అశ్విన్ తో అశ్వినీదత్ కుమార్తె వివాహం జరిగింది. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ‘యాదోంకి భారత్' అనే షార్ట్ ఫిల్మ్‌ని ప్రియాంక దత్ నిర్మించారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. ఆతర్వాత నాగ్ అశ్విన్ ను దర్శకుడిగా పరిచయం చేస్తూ ‘ఎవడే సుబ్రహ్మణ్యం' చిత్రాన్ని నిర్మించింది ప్రియాంక.

‘ఎవడే సుబ్రహ్మణ్యం' సినిమా సమయంలో నాగ్ అశ్విన్-ప్రియాంక దత్ మధ్య బంధం మరింత బలపడింది. పెద్దల అంగీకారంతో ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇటీవల హైదరాబాద్ లో వీరి వివాహం జరిగింది. సినీ ప్రముఖుల సమక్షంలో సోమవారం వెడ్డింగ్ రిసెప్షన్ గ్రాండ్ గా జరిగింది.

మహేష్ బాబు, నమ్రత


ప్రియాంక దత్- నాగ్ అశ్విన్ దంపతులను ఆశీర్వదిస్తున్న మహేష్ బాబు, నమ్రత

అల్లు అర్జున్-స్నేహ


అల్లు అర్జున్ తన భార్య స్నేహా రెడ్డితో కలిసి ప్రియాంక దత్- నాగ్ అశ్విన్ వెడ్డింగ్ రిసెప్షన్ కు హాజరయ్యారు.

ఎన్టీఆర్ మదర్, భార్య..


ప్రియాంక దత్- నాగ్ అశ్విన్ వెడ్డింగ్ రిసెప్షన్ లో ఎన్టీఆర్ మదర్ శాలిని, భార్య లక్ష్మి ప్రణతి. ఎన్టీఆర్ షూటింగులో ఉండటంతో రాలేక పోయారు.

పూరి భార్య లావణ్య


ప్రియాంక దత్- నాగ్ అశ్విన్ వెడ్డింగ్ రిసెప్షన్ లో కూతురుతో కలిసి పూరి భార్య లావణ్య.

వైఎస్ జగన్


ప్రియాంక దత్- నాగ్ అశ్విన్ వెడ్డింగ్ రిసెప్షన్ కి వైసిపి నేత వైఎస్ జగన్ కూడా హాజరయ్యారు.

దాసరి నారాయణ రావు


ప్రియాంక దత్- నాగ్ అశ్విన్ వెడ్డింగ్ రిసెప్షన్ లో దర్శకరత్న దాసరి నారాయణరావు.

అల్లు అరవింద్


ప్రియాంక దత్- నాగ్ అశ్విన్ వెడ్డింగ్ రిసెప్షన్ లో అల్లు అరవింద్.

మణి శర్మ


ప్రియాంక దత్- నాగ్ అశ్విన్ వెడ్డింగ్ రిసెప్షన్లో మణిశర్మ, మెహర్ రమేష్, ఎల్ బి శ్రీరామ్ తదితరులు.

English summary
Aswini Dutt Daughter Priyanka Wedding Reception held at Hyderabad. Priyanka Dutt marries director Nag Ashwin.
Please Wait while comments are loading...