twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఈ పుస్తకం చదివారా?? ఇప్పుడు సినిమాగా వస్తోంది కథ అదే

    1984 లో ప్రచురితమై మూడువ్దశాబ్దాలకు పైగా పాఠకులను అలరించిన అతడు అడవిని జయించాడు అనే ఈ నవల ఇప్పుడు సినిమా రూపం దాల్చనుంది

    |

    1984 లో ప్రచురితమై మూడువ్దశాబ్దాలకు పైగా పాఠకులను అలరించిన అతడు అడవిని జయించాడు అనే ఈ నవల ఇప్పుడు సినిమా రూపం దాల్చనుంది.. ప్రముఖ రచయిత డా. కేశవ రెడ్డి గారు రాసిన ఈ నవల ప్రపంచవ్యాప్త సినిమా నిర్మాణ హక్కులను DSN FILMS నిర్మాణ సంస్థ సొంతం చేసుకుంది. అంతర్జాతీయ ఫిలింమేకర్ దూలం సత్యనారాయణ దర్శకత్వం లో పలు చిత్ర నిర్మాణ సంస్థల భాగస్వామ్యం తో ''అతడు అడవిని జయించాడు'' నవల సినిమా గా రూపొందడానికి ప్రయత్నాలు మొదలయ్యాయి.

    ''అతడు అడవిని జయించాడు'' తెలుగు సాహిత్యం లో విశిష్ట రచన.. అంతర్జాతీయ స్థాయి సినిమా గా రూపొందే సత్తా ను ఈ నవల కలిగి ఉందనీ, భారీ బడ్జెట్, అత్యాదునిక టెక్నాలజీ లతో ఆస్కార్ , కాన్స్ , లొకర్నో , బెర్లిన్, టొరంటో , బుసాన్లాం టి అంతర్జాతీయ సినిమా వేదికల మీద పోటీ పడేలా సినిమా నిర్మాణం ఉంటుందనీ, ఇప్పటికే హాలీవుడ్ సాంకేతిక నిపుణులతో చర్చలు జరిపినట్టు దర్శకుడు దూలం సత్యనారాయణ తెలిపారు. దూలం సత్యనారాయణ ఇప్పటివరకు అనేక అంతర్జాతీయ డాక్యుమెంటరీ లను రూపొందించాడు, ఇటీవలే తెలంగాణా టూరిజం ఫిలిం కి పోర్చుగల్ లో ఇంటర్నేషనల్ అవార్డు ని సాధించారు.

     తప్పిపోయిన సుక్క పంది :

    తప్పిపోయిన సుక్క పంది :


    "అతడు అడవిని జయించాడు" తెలుగు సాహిత్యం లో నే ఒక ప్రత్యేక స్థానం ఉన్న నవల. ఇంటినుంచి తప్పిపోయిన సుక్క పంది (ఈనటానికి సిద్దంగా ఉన్న పంది) ని వెతుకుతూ బయలు దేరుతాడో ముసలి వాడు. అడవంతా గాలించి అప్పుడే ఈని తనపిల్లలతో ఉన్న పందిని కనుక్కుంటాడు.

     ఇదే కథ.:

    ఇదే కథ.:


    కానీ ఆ స్థితి లో పంది ని తరలించటం ప్రమాదకరం అది తిరగబడుతూ ఉంటుంది. ముసలాడూ , తోటి పిట్ట (పక్షి) , ఆ పంది నీ, దానికి పుట్టిన పిల్లలని తినేందుకు దాడులు చేసే నక్కలు అక్కడ ఉండే పాత్రలు. తన పందినీ, దాని పిల్లలనూ కాపాడుకునేందుకు పోరాటం చేసే ముసలివాడు.. , ఇదే కథ.

     రక్షించుకునేందుకు:

    రక్షించుకునేందుకు:


    కథ జరిగే ప్రదేశం దట్టమైన అడవి., నక్కలే కాదు, తానెవర్ని రక్షిస్తున్నాడో స్వయానా ఆ పంది కూడా ఈ పోరాటంలో ముసలివాడి ప్రత్యర్థే. ఎందుకంటే ఈనిన స్థితిలో ఉన్న పంది తన పిల్లలని రక్షించుకునేందుకు తన యజమాని అయిన ముసలివాన్ని కూడా చంపటానికి సిద్దపడుతుంది.

     పోరాటం:

    పోరాటం:


    దాని భయంతో చెట్టు మీదెక్కి కూచుంటాడు ఆ ముసలాడు. అ పందినీ దాని పిల్లలనీ ఇంటికి తరలించలేడు.., అలాగని వాటిని అడవిలో వదిలేయనూ లేడు. మృగాలు తినేస్తాయి. ఎందుకంటే జంతు న్యాయం అది, మృగాల జీవితం అది.. ఇక అప్పుడు మొదలవుతుంది అసలు పోరాటం... మనిషికీ మృగానికీ, మృగానికీ మృగానికీ.., ఆకలికీ కోపానికీ.., అడవికీ మనిషికీ, మధ్య పోరాటం...

    పీక కొరికి చంపేస్తుంది:

    పీక కొరికి చంపేస్తుంది:

    నక్కలు పంది పిల్లల వాసన పసిగట్టి, వాటి కోసం ప్రయత్నాలు మొదలెడతాయి. ముందుగా దాడికి ప్రయత్నించిన రెండు నక్కలను సుక్క పంది అమాంతం పీక కొరికి చంపేస్తుంది. ఇంకో నక్కను ముసలివాడు తన ఈటెతో చంపేస్తాడు.కానీ అంతలోనే మరో రెండు నక్కలు ఓ రెండు సలుగులను (పంది పిల్లలను)నోటకరుచుకుపోతాయి.
     పందిని ఈటెతో చంపేస్తాడు:

    పందిని ఈటెతో చంపేస్తాడు:


    ఆ తరువాత ఏకంగా నక్కల గుంపే దాడికి వస్తుంది. ఒక్క పంది అన్ని నక్కలను ఎదుర్కోలేదు.పోనీ తానే చెట్టు మీదనుండి దిగితే నక్కలని తరమగలడు కానీ... తన పంది నిస్సందేహంగా అతన్ని చంపేస్తుంది. అందుకే పిల్లలని కాపాడటం కోసం ప్రాణానికి ప్రాణమైన పందినే ఈటెతో చంపేస్తాడు.

     బుట్టలో వేసుకొని:

    బుట్టలో వేసుకొని:


    ఆ తరువాత నక్కల్ని తరిమేసి, పందిపిల్లలని బుట్టలో వేసుకొని అడవినుంచి బయలుదేరుతాడు. బయల్దేరుతాడు. కొన్ని గంటలపాటు జరిపే ప్రయాణంలో పాలు లేకపోవడం చేత, కొన్ని పంది పిల్లలు చచ్చిపోతాయి, నడిచీ నడిచీ సొమ్మసిల్లి పోయి తిరిగి లేచేసరికి మిగిలిన పిల్లలని రాబందులు తినేస్తాయి.

     ఉత్త చేతుల్తో:

    ఉత్త చేతుల్తో:


    కొన్ని గంటలపాటు పడ్డ శ్రమా, తపనా, యుద్దమూ వృధా అయిపోయి ఉత్త చేతుల్తో ముసలివాడు ఇంటికి తిరిగి వస్తాడు. ఇదీ ఆనవల లోని కథ. . అలసిన నా మనసుకు ఒకింత విశ్రాంతి ఇవ్వాలి. ఆ తర్వాత నేను చెయ్యవలసిన పనులు చాలా ఉన్నాయి. ఎందుకంటే ఇది నా జీవితంలో చివరి రోజు కాదు గనుక..." అంటూ ఒక ఆశావద దృక్పదం తో ముగుస్తుందీ నవల....

    చదివినంత సేపూ మనమూ ఆ ముసలి వాడి పాత్రతోనే

    చదివినంత సేపూ మనమూ ఆ ముసలి వాడి పాత్రతోనే

    తిరుగుతూంటాం, ఆ అడవిలో నక్కలని తరుముతూ భయం భయం గా అక్కడే ఉన్నట్టు అనుబూతి చెందుతాం. ఇప్పుడు అదే నవల ని సినిమాగా తెరకెక్కించటం అనే ఆలోచన నిజంగా ఒక అద్బుతమైన ఆలోచ్య్హనే అనుకోవాలి. సినిమా కోసం ఎదురు చూడాలి

    English summary
    Written by well known Telugu novelist Dr Kesava Reddy, Athadu Adavini Jayinchadu is set to become a feature film now. DSN FILMS has bought the worldwide filmmaking rights for the novel.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X