twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    డీమోనిటైజేషన్ మీద తొలి సినిమా... ‘ఎటిఎం-నాట్ వర్కింగ్’

    By Bojja Kumar
    |

    పెద్దనోట్లరద్దు నేపధ్యంలో తెరకెక్కిన సరదా పొలిటికల్ సెటైర్ ప్రేమకథా చిత్రం 'ఏటిఎం- నాట్ వర్కింగ్'. నవంబర్ 8 నుండి డిసెంబర్ 31 వరకు జరిగిన సంఘటనలతో అల్లిన ఈ కధని డిజిక్వెస్ట్ ఇండియా లిమిటెడ్ మరియు శ్రావ్య ఫిలింస్ బ్యానర్ల సమర్పణలో కిషోర్ బసిరెడ్డి, యక్కలి రవీంద్రబాబు నిర్మించారు, సునీల్ కుమార్ రెడ్డి దర్శకుడు.

    అనంత్(A), త్రిలోక్(T), మహేష్(M) అనే ముగ్గురు పనీ పాట లేని కుర్రాళ్ళ జీవితంలో డిమానిటైజేషన్ సృష్టించిన సునామీ, ఎటిఎం క్యు లైన్ లో పుట్టిన ప్రేమ, దాని పర్యవసానాలే ఈ సినిమా ప్రధాన ఇతివృత్తం.

    'ATM - Not Working' movie details

    దర్శకుడు సునీల్ కుమార్ రెడ్డి మాట్లాడుతు స్వతంత్ర భారత దేశంలోని ప్రతి వ్యక్తిని ఏదో ఒక విధంగా ప్రభావితంచేసిన నిర్ణయం డిమాని టైజేషన్. ఈ నిర్ణయం నేపథ్యంలో ఒక జాతి జాతి 50 రోజులు క్యూలైన్ లో గడిపేసింది. రాజకీయాలు, ఆర్ధికనిపుణులు, సామాన్యులు పండితులు, పామరులుఅందరూచర్చించిన విషయానికి ఒక క్యారికేచర్లాంటిది ఈ చిత్రం.125 కోట్ల మందిని ప్రభావితంచేసిన ఈ నిర్ణయం సృష్టించిన అరుదైన సంఘటలనుసునిశితంగా, స్ప్రుశించేప్రయత్నమే ఈ చిత్రం" అని తెలియజేసారు.

    కారుణ్య యార్ల గడ్డ, పవన్ హీరో హీరోయిన్ లగా , రాకేష్,ఆషా చౌదరి, మహేంద్ర, నారాయణ, వినోద్,కరణ్, మహేష్, చిల్లర రాంబాబు, అంబటి శ్రీను, కిషోర్ ాస్, వీరభద్రం, గబ్బర్ సింగ్ ఆంజనేయులు, లక్ష్మి, తిరుపతి దొరై తదితరులుముఖ్య పాత్ర పోషించారు.

    ఈ చిత్రానికి సంగీతం-ప్రవీణ్ ఇమ్మడి, లిరిక్స్-వీరేంద్ర, వాసవి రెడ్డి. కెమెరా-శివరాం. ఎడిటర్-సామ్యూల్ కళ్యాణ్. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్- బి. బాపిరాజు. నిర్మాతలు-కిషోర్ బసిరెడ్డి, యక్కలి రవీంద్రబాబు. రచన, దర్శకత్వం- పి. సునీల్ కుమార్ రెడ్డి.

    English summary
    ATM Not working...This is the upcoming Telugu movie which was directed by Sunil Kumar Reddy and noticeable joint producers Kishorei Basi Reddy & Yakkali Ravindra working for this film. The entire movie is based on the concept of demonetization, which is nothing but notes ban in India.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X