twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నా భార్యకు విడాకులివ్వడానికి అదీ ఓ కారణమే: వర్మ

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: ప్రతి అంశాన్ని తనకు అనుకూలంగా మార్చుకోవడమో, లేదా దానిపై వివాదం క్రియేట్ చేసి పబ్లిసిటీగా మార్చుకోవడమో చేస్తుంటాడు రామ్ గోపాల్ వర్మ. తాజాగా వర్మ తన 'ఎటాక్' మూవీ ఆడియో రిలీజ్ సందర్భంగా ఇలాంటి కామెంటే చేసారు. తన భార్యకు విడాకులు ఇచ్చిన సందర్భాన్ని గుర్తు చేసుకున్నారు.

    మంచు మనోజ్ హీరోగా రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో శ్రీ శుభశ్వేత ఫిలిమ్స్‌ పతాకంపై వరుణ్‌, తేజ, శ్వేతలానా, సి.వి. రావు నిర్మించిన చిత్రం 'ఎటాక్‌'. రవిశంకర్‌ సంగీతం సమకూర్చిన పాటలను మంగళవారం ప్రసాద్‌ ప్రివ్యూ థియేటర్‌లో విడుదల చేశారు.

    ఈ సందర్భంగా వర్మ మాట్లాడుతూ ''గజల్‌ శ్రీనివాస్‌తో పాట పాడిస్తే బాగుంటుందని గేయ రచయిత సిరాశ్రీ సూచించాడు. నాకు మామూలుగా గజల్స్‌ అంటే అస్సలు ఇష్టం ఉండదు. నా భార్యతో నాకు విడాకులవ్వడానికి ప్రధాన కారణాల్లో గజల్స్‌ కూడా ఒకటి. ఆమెకు అవంటే ఇష్టం. నాకు ఇళయరాజా సంగీతమంటే ఇష్టం. ఏదేమైనా ఇందులోని పాటను గజల్‌ శ్రీనివాస్‌ అసాధారణంగా పాడారు. రవిశంకర్‌ చాలా చక్కని మ్యూజిక్‌ ఇచ్చాడు అని తెలిపారు.

    సినిమా గురించి మాట్లాడుతూ... ధూల్‌పేట ప్రాంతంలో మురికి మూసీనది నేపథ్యంలో, చెమట్లు కక్కుకుంటూ, మొహానికి మట్టి అంటుకొని ఉండే పాత్రలతో, ఒక అగ్లీ కైండ్‌ ఆఫ్‌ అట్మాస్పియర్‌తో ఈ సినిమా నడుస్తుంది. దానికి కాస్త అందాన్ని కూడా దిద్దాలని సురభి వంటి అందమైన అమ్మాయిని పెట్టాను. ఆమె వల్ల సినిమాలోని అగ్లీనెస్‌ మరింత ఎఫెక్టివ్‌గా కనిపిస్తుంది. ప్రకాశ్‌రాజ్‌, జగపతిబాబు పాత్రలు బాగా వచ్చాయి అని వర్మ తెలిపారు.

    స్లైడ్ షోలో ఫోటోస్..

    భార్యకు విడాకులకు ఇదీ కారణమే

    భార్యకు విడాకులకు ఇదీ కారణమే


    గజల్‌ శ్రీనివాస్‌తో పాట పాడిస్తే బాగుంటుందని గేయ రచయిత సిరాశ్రీ సూచించాడు. నాకు మామూలుగా గజల్స్‌ అంటే అస్సలు ఇష్టం ఉండదు. నా భార్యతో నాకు విడాకులవ్వడానికి ప్రధాన కారణాల్లో గజల్స్‌ కూడా ఒకటి. ఆమెకు అవంటే ఇష్టం అన్నారు వర్మ.

    మనోజ్ మాట్లాడుతూ

    మనోజ్ మాట్లాడుతూ


    రాముగారితో సినిమా చేస్తే ఎన్నో నేర్చుకోవచ్చనే ఆశతో ఈ సినిమా చేశా. లక్ష లబద్ధాలాడైనా ఓ సినిమా చేద్దామనే తత్వం ఆయనది. డబ్బు కోసం కాక కేవలం ఆయన కోసమే అందరం ఈ సినిమా చేశాం. ఇందులో నటులు కాకుండా పాత్రలే కనిపించాయి నాక .అన్నారు.

    కళ్యాణ్

    కళ్యాణ్


    రామ్‌గోపాల్‌ వర్మ గతంలో తీసిన ‘శివ', ‘గాయం' కంటే మంచి ఎమోషన్స్ ‘ఎటాక్‌'లో ఉంటాయని సమర్పకులు సి.కల్యాణ్‌ చెప్పారు. ఏప్రిల్‌ 1న రిలీజ్‌ చేస్తున్నాం'' అన్నారు.

    గజల్ల్‌ శ్రీనివాస్‌ మాట్లాడుతూ

    గజల్ల్‌ శ్రీనివాస్‌ మాట్లాడుతూ


    వర్మలాంటి క్రియేటివ్‌ జీనియస్‌ని నేనెక్కడా చూడలేదు. ఆయన మన దేశంలో పుట్టడం మన అదృష్టం. ఆయనకు మంచీ చెడు తేడా తెలీదు. దేన్నయినా కన్విక్షన్‌తో తీస్తాడు. నాకు డైరెక్టర్‌గా ఆయన తర్వాతే ఎవరైనా అన్నారు.

    ఎటాక్

    ఎటాక్


    ఈ కార్యక్రమంలో తారలు సురభి, పూనమ్‌ కౌర్‌, సంగీత దర్శకుడు రవిశంకర్‌, ఛాయాగ్రాహకుడు అంజి, గేయ రచయిత సిరాశ్రీ, నటుడు, సహనిర్మాత మలినేని లక్ష్మయ్య, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌ తుమ్మలపల్లి రామసత్యనారాయణ పాల్గొన్నారు.

    English summary
    Manchu Manoj acted, Ram Gopal Varma directed Attack audio launch function held at Prasad Labs in Hyderabad.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X