» 

‘మగధీర’ బాక్సు బద్దలైంది గురూ..!

Posted by:

హైదరాబాద్: 2009లో వచ్చిన 'మగధీర' చిత్రం తెలుగు సినిమా చరిత్రలోనే బిగ్గెస్ట్ హిట్ చిత్రంగా నిలిచింది. రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన ఈచిత్రం రూ. 73 కోట్లు వసూలు చేసి కలెక్షన్ల పరంగా నెం.1 పొజిషన్లో నిలిచింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ తెలుగు సినిమా కూడా ఆ రికార్డును బ్రేక్ చేయలేదు.

తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన 'అత్తారింటికి దారేది' చిత్రం సరికొత్త రికార్డు సృష్టించింది. మగధీర పేరుతో ఉన్న రూ. 73 కోట్ల రికార్డును బ్రేక్ చేసింది. సినిమా విడుదలైన మూడు వారాలు పూర్తయింది. అయినా మంచి కలెక్షన్లతో ముందుకు సాగుతోంది. మరి బిజినెస్ పూర్తయ్యే వరకు 'అత్తారింటికి దారేది' చిత్రం మొత్తం ఎన్ని కోట్లు వసూలు చేస్తుందనే విషయమై సర్వతా ఆసక్తి నెలకొంది.

Attarintiki Daredi Break Magadheera Record

కాగా....'మగధీర' సినిమా రికార్డును మెగా ఫ్యామిలీ హీరో పవన్ కళ్యాణ్ బద్దలు కొట్టడంతో మెగా ఫ్యాన్స్ హ్యాపీగా ఉన్నారు. ఇక టాప్ 5 సినిమాల వివరాల్లోకి వెళితే.....73 కోట్లో మగధీర రెండో స్థానంలో, గబ్బర్ సింగ్ రూ. 60 కోట్లతో 3వ స్థానంలో, దూకుడు 56 కోట్లతో నాలుగో స్థానంలో, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు 51 కోట్లతో ఆ తర్వాతి స్థానంలో ఉంది.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా స్టార్ రైటర్, డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రిలయన్స్ ఎంటర్టెన్మెంట్స్ సమర్పణలో శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర ఇండియా ప్రై.లి.పతాకంపై భారీ చిత్రాల నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్'అత్తారింటికి దారేది' చిత్రాన్ని నిర్మించారు. పవన్ సరసన సమంత, ప్రణీత హీరోయిన్లుగా నటించారు. నదియా, కోట శ్రీనివాస్, అలీ, బ్రహ్మానందం, ఎంఎస్ నారాయణ తదితరులు నటించారు. ఈచిత్రానికి సంగీతం : దేవిశ్రీ ప్రసాద్, ఫోటోగ్రఫీ : ప్రసాద్ మూరెళ్ల, ఫైట్స్ : పీటర్ హెయిన్స్, ఆర్ట్ : రవీందర్, కో ప్రొడ్యూసర్స్ : భోగవల్లి బాపినీడు, రిలయన్స్ ఎంటర్టెన్మెంట్స్, నిర్మాత : బివిఎస్ఎన్ ప్రసాద్, రచన-దర్శకత్వం : త్రివిక్రమ్ శ్రీనివాస్.

Read more about: pawan kalyan, ram charan teja, magadheera, attarintiki daaredi, samantha, trivikram, praneetha, పవన్ కళ్యాణ్, సమంత, త్రివిక్రమ్, ప్రణీత, అత్తారింటికి దారేది, మగధీర, రామ్ చరణ్ తేజ్
English summary
Pawan Kalyan’s Attarintiki Daredi received Unanimous positive talk from critics and fans, despite piracy AD broke Magadheera records. Attarintiki Daredi collected 73 crores World wide.
Please Wait while comments are loading...