» 

రూ. 100 కోట్లంటే జోక్ అనుకున్నాం....ఇపుడు ‘అత్తారింటికి దారేది’ నిరూపిస్తోంది : రాజమౌళి

Posted by:

హైదరాబాద్: కలెక్షన్ల పరంగా నెం.1 స్థానంలో ఉన్న 'మగధీర' చిత్రాన్ని ఐదేళ్లుగా ఎవరూ అందుకోలేక పోయిన సంగతి తెలిసిందే. ఎట్టకేలకు పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన 'అత్తారింటికి దారేది' చిత్రం ఆ రికార్డు బద్దలు కొట్టింది. ఈ నేపథ్యంలో మగధీర దర్శకుడు రాజమౌళి తన ట్విట్టర్ ద్వారా స్పందించారు.

మగధీర రికార్డును అత్తారింటికి దారేది చిత్రం క్రాస్ చేసింది. టీం మొత్తానికి కంగ్రాట్స్. పవన్ అభిమానులకూ కూడా కంగ్రాట్స్. ఒక మంచి తెలుగు సినిమా రూ. 100 కోట్లు వసూలు చేసే కెపాసిటీ కలిగి ఉందని నిర్మాత శ్యాం ప్రసాద్ రెడ్డిగారు ఐదేళ్ల క్రితమే చెప్పారు. అప్పుడు ఆయన అలా చెబితే జోక్ చేసాడని అనుకున్నాం. ఆ విషయాన్ని ఇపుడు 'అత్తారింటికి దారేది' చిత్రం నిరూపిస్తోంది అంటూ రాజమౌళి చెప్పుకొచ్చారు.

ఇది కేవలం 'అత్తారింటికి దారేది' చిత్రానికి మాత్రమే హిస్టారిక్ మూమెంటు కాదు, మొత్తం తెలుగు సినిమా పరిశ్రమ సత్తా ఏమిటో నిరూపించే సందర్బం. అయితే పైరసీ మూలంగా సినిమాకు చాలా నష్టం జరిగింది. పైరసీ లేకుండా ఉంటే మరింత ఎక్కువ కలెక్షన్లు వస్తాయి...అని రాజమౌళి అభిప్రాయ పడ్డారు.

పైరసీకి సొల్యూసన్ ఏమిటంటే? త్రివిక్రమ్ గారి మాటల్లో చెప్పాలంటే....'కిల్లి కొట్టులో సిగరెట్లు దొరుకుతాయి. తాగాలా వద్దా అనేది వ్యక్తిగత నిర్ణయం' అంటూ పైరసీ అరికట్టడం అనేది ప్రేక్షకుల చేతుల్లోనే ఉంది అనే విధంగా వ్యాఖ్యానించారు రాజమౌళి. అత్తారింటికి దారేది చిత్రం రూ. 100 కోట్ల వసూలు దిశగా పరుగు పెడుతుండటంతో తన తర్వాతి సినిమా 'బాహుబలి' మార్కెట్‌పై రాజమౌళిలో సరికొత్త ఆశలు చిగురించినట్లయింది.

Read more about: pawan kalyan, attarintiki daredi, rajamouli, magadheera, పవన్ కళ్యాణ్, అత్తారింటికి దారేది, రాజమౌళి, మగధీర
English summary
"#ADcrossesMD!! Congratulations to the whole team for the new IH status. and congrats to PSPK fans too..:). When Shyamprasadreddy garu said, The capacity if a good telugu film is 100crs 5 yrs back, we thot he was joking. Now #AD is going to make it a reality.. Historic moment not just for team AD, but for the entire Telugu film Industry." Rajamouli tweeted.
Please Wait while comments are loading...