twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఏరియా వైజ్ షేర్: పవన్ కళ్యాణ్ నెం.1

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: పెద్ద హీరోల సినిమాలు రిలీజైతే చాలు...అప్పటి వరకు ఉన్న రికార్డులు, కలెక్షన్లు, ఏరియా వైజ్ ఏ సినిమా ఎక్కువ వసూలు చేసింది లాంటి చర్చలు మొదలవుతాయి. తాజాగా ‘టెంపర్' విడుదలైన విజయవంతంగా దూసుకెలుతున్న నేపథ్యంలో ఆ సినిమా కలెక్షన్లను ఇప్పటి వరకు వచ్చి టాప్ మూవీ కలెక్షన్లతో బేరీజు వేస్తూ విశ్లేషణలు మొదలయ్యాయి.

    తాజాగా టెంపర్ మూవీ విడుదలై బాక్సాఫీసు వద్ద విజయవంతంగా ఫస్ట్ వీక్ కంప్లీట్ చేసుకుంది. ఈ చిత్రం ఫస్ట్ వీక్ ఏరియా వైజ్ కలెక్షన్ల పరిశీలిస్తే నైజాం: రూ. 9.12 కోట్లు, సీడెడ్: రూ. 5.30 కోట్లు, వైజాగ్: రూ. 2.45 కోట్లు, గుంటూరు: రూ. 2.52 కోట్లు, కృష్ణ: రూ. 1.71 కోట్లు, ఈస్ట్: రూ. 1.90 కోట్లు, వెస్ట్: రూ. 1.42 కోట్లు, నెల్లూరు: రూ. 1.02 కోట్లుగా ఉంది.

    2015లో ఇప్పటి వరకు టెంపరే టాప్. ఓవరాల్ గా చూసుకుంటే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో మూడో బిగ్గెస్ట్ ఓపెనర్ గా టెంపర్ రికార్డుల కెక్కింది. మొదటి, రెండో స్థానాల్లో అత్తారింటికి దారేది, ఎవడు చిత్రాలు ఉన్నాయి.

    ఫేస్‌బుక్, ట్విట్టర్, గూగుల్ ప్లస్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

    Attarintiki Daredi movie still ruling

    ఇప్పటి వరకు ఆయా ఏరియాల్లో వారం రోజుల్లో అత్యధిక షేర్ సాధించిన సినిమాల విషయానికొస్తే.....పవన్ కళ్యాణ్ నటించిన ‘అత్తారింటికి దారేది' చిత్రం టాప్ లో ఉంది.

    నైజాం-రూ. 12.84 కోట్లు (అత్తారింటికి దారేది)
    సీడెడ్ - రూ. 6.38 కోట్లు (అత్తారింటికి దారేది)
    వైజాగ్: రూ. 3.49 కోట్లు (అత్తారింటికి దారేది)
    ఈస్ట్ గోదావరి: రూ. 2.67 కోట్లు (ఎవడు)
    వెస్ట్ గోదావరి - రూ. 2.22 కోట్లు (ఎవడు)
    కృష్ణా - రూ 2.42 కోట్లు (అత్తారింటికి దారేది)
    గుంటూరు -రూ. 3.21 కోట్లు (అత్తారింటికి దారేది)
    నెల్లూరు - రూ. 1.63 కోట్లు (అత్తారింటికి దారేది)

    టోటల్ ఆంధ్ర, నైజాం: రూ. 34.67 కోట్లు (అత్తారింటికి దారేది)

    కర్ణాటక - రూ. 4.06 కోట్లు (ఎవడు)
    రెస్టాఫ్ ఇండియా - 1.45 కోట్లు (ఆగడు)
    యూఎస్ఏ - 6.65 కోట్లు (అత్తారింటికి దారేది)
    రెస్టాఫ్ ఓవర్సీస్ : 1.25 కోట్లు (ఆగడు)

    English summary
    Power Star’s Attarintiki Daredi movie still ruling top charts by area wise shares. AD still stands top in most places of 1 st week area wise shares.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X