»   » త్రివిక్రమ్ లాంచ్ చేసిన ‘అవసరానికో అబద్దం’ ట్రైలర్ ఇదే..

త్రివిక్రమ్ లాంచ్ చేసిన ‘అవసరానికో అబద్దం’ ట్రైలర్ ఇదే..

Posted by:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: 'అవసరానికో అబద్ధం' అనే ఇంట్రస్టింగ్ టైటిల్ తో తెరకెక్కిస్తున్న చిత్ర ట్రైలర్ ను ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ విడుదల చేసారు. ఈ చిత్రానికి సురేష్ కెవి దర్శకత్వం వహిస్తున్నారు.

ఈ సందర్భంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ మాట్లాడుతూ...'అవసరానికో అబద్ధం చిత్ర ట్రైలర్ చాలా బాగుంది. ముఖ్యంగా డైలాగ్స్ బాగా నచ్చాయి. సినిమాను బాగా ప్రమోట్ చేసి, మౌత్ పబ్లిసిటీతో సినిమా విజయవంతం అయ్యేలా ప్రయత్నించండి. అప్పట్లో మా స్వయంవరం చిత్రం టాక్ కూడా స్లోగా స్టార్ట్ అయ్యి బాగా పికప్ అందుకొని విజయవంతంగా 175 రోజులు పూర్తి చేసుకుంది. అవసరానికో అబద్ధం చిత్ర యూనిట్ అందరికీ ఈ సందర్భంగా ఆల్ ది బెస్ట్ చెబుతున్నాను' అన్నారు.

చిత్ర రచయిత, దర్శకుడు సురేష్ కెవి మాట్లాడుతూ... మా అవసరానికో అబద్ధం చిత్ర ట్రైలర్ ను లాంచ్ చేసిన త్రివిక్రమ్ శ్రీనివాస్ గారికి కృతజ్ఞతలు. సినిమాలోని డైలాగ్స్ ను మాటల మాంత్రికుడు మెచ్చుకోవడం మాకు పెద్ద కాంప్లిమెంట్. నాపై ఉన్న నమ్మకంతో చిత్రాన్ని నిర్మించిన నా స్నేహితులకు... సినిమా అనుకున్నది అనుకున్నట్టుగా రావడానికి కృషి చేసిన మా టీంకు, సినిమాపై ఉన్న నమ్మకంతో ప్రమోషనల్ పార్ట్ నర్ గా వ్యవహరిస్తున్న శ్రియాస్ మీడియాకు కృతజ్ఞతలు తెలిజయేస్తున్నాను అన్నారు.

అవసరానికో అబద్దం


నిజమని నువ్వు నమ్మేదాన్ని నిజమని నీకు చెప్పిందెవరు? అబద్దమని నువ్వు అనుకొనే దాన్ని అబద్దమని నీకు చెప్పిందెవరు? అనే ఆలోచనకు ప్రతి రూపమే అవసరానికో అబద్ధం సినిమా అని దర్శకుడు తెలిపారు.

థ్రిల్లర్ జోనర్


ఇది థ్రిల్లర్ జోనర్ లో తెరకెక్కించిన చిత్రం. సినిమాలోని ప్రతి సన్నివేశం అందరినీ కట్టిపడేసేలా తెరకెక్కించామని తెలిపారు.

అదే పాయింట్


అవసరం మనిషికి అందించే అతి శక్తివంతమైన ఆయుధం. దాని చుట్టూ అల్లుకున్న కథే మా ఈ చిత్రం అన్నారు.

నటీనటులు, తెర వెనక


బ్యానర్ - చక్రం క్రియేషన్స్
నటీనటులు - లోకేష్, రాజేష్, శశాంక్, గీతాంజలి, సందీప్, వెంకీ, ఎంజిఆర్, గిరిధర్, మురళి, విజయ్ తదితరులు
సినిమాటోగ్రఫి - వెంకటరమణ ఎస్
సంగీతం - సాయి కార్తిక్
ఎడిటింగ్ - కార్తిక్ శ్రీనివాస్
డిఐ - శ్రీనివాస్ మామిడి
ఎఫెక్ట్స్ - యతిరాజ్
లైన్ ఎడిటింగ్ - అజయ్ బి
డిటిఎస్ మిక్సింగ్ - రాజశేఖర్
ఆర్ట్ - కిరణ్
ప్రమోషనల్ పార్ట్ నర్ - శ్రియాస్ మీడియా
రచన దర్శకత్వం - సురేష్ కెవి
నిర్మాతలు - విజయ్.జె, పులి శ్రీకాంత్, సందీప్ మరియు స్నేహితులు

ట్రైలర్ ఇదే..


అవసరానికో అబద్దం ట్రైలర్

English summary
Avasaraniko Abaddam theatrical trailer. Avasaraniko Abaddam Moviestarring: Lokesh, Rajesh, Shashank, Geethanjali & Sandeep, Director : Sureh KV. Producer : Vijay J, Suresh KV & Friends. Music :Sekhar Chandra.
Please Wait while comments are loading...