twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అజహర్ వర్సెస్ ధోనీ.... ఆ సినిమా లాగే విమర్శలు ఎదురవుతాయా..??

    |

    అన్ని దేశాల్లో ఏమో గానీ భారత దేశం లో మాత్రం క్రికెట్ అంటే ఒక మతం... దేశభక్తి అన్న అంశాన్ని కూడా ప్రభావితం చేయగలిగే స్థాయి లో క్రికెట్ ప్రభావం ఉందంటే అతిశయోక్తి కాదు. ఇక ఒక్కో క్రికెటర్ మీదా ఎంత అభిమానం ఉంతుందో ఇక చెప్పక్కర లేదు. ధోనీ భారత క్రికెట్ చరిత్ర లోనే ఒక సంచలనం. ఏ కెప్టెన్ వల్ల కానిదీ అతను రెండు సార్లు సాధించాడు. రెండు ఫార్మాట్లలోనూ వరల్డ్ కప్ లని సాధించాడు.

    ఇప్పుడు ఇండియన్ క్రికెట్ టీమ్ గ్రేటెస్ట్ ఎవర్ కెప్టెన్లలో ఒకడైన ధోని కెరీర్ ఎలా ఆరంభమైందో.. అతను ఎలా ఎదిగాడో.. ప్రపంచంలోనే అత్యుత్తమ కెప్టెన్లలో ఒకడిగా ఎలా గుర్తింపు తెచ్చుకున్నాడో అందరికీ తెలుసు. ఐతే అతడి కెరీర్ ఆరంభమవ్వడానికి ముందు ఏం జరిగిందన్నది చాలామందికి తెలియదు. ఆ విశేషాలతోనే నీరజ్ పాండే ?ఎం.ఎస్.ధోని? సినిమా తీశాడు. అంతర్జాతీయ కెరీర్ ఆరంభమవడానికి ముందు ధోని జీవితంలో జరిగిన విశేషాలన్నీ ఇందులో చూపించబోతున్నారు.ఇంకో రెండు గంటల్లో సినిమా సంగతి తేలనున్న సమయం లో కొన్ని విషయాల మీద చిన్న లుక్

    మాజీ కేప్టెన్ అజారుద్దీన్ జీవిత కథ:

    మాజీ కేప్టెన్ అజారుద్దీన్ జీవిత కథ:

    సాధారణంగా రిటైర్ అయిన స్పోర్ట్స్ స్టార్ మీద బయో పిక్ తీయటం కామన్. ఇప్పటి వరకూ వచ్చిన సినిమాలన్నీ దాదాపుగా అలానే వచ్చాయి. కాని ఒక క్రికెటర్ అందునా కెరీర్ లో పీక్ స్టేజి ఉన్న ఒక సారధి జీవితం మీద తీయటం అనేది ఇదే మొదటి సారి. ఇప్పటికే మాజీ కేప్టెన్ అజారుద్దీన్ జీవిత కథ ఆధారంగా అంటూ అజహర్ అనే సినిమా వచ్చినా హిట్ మాట పక్కన ఉంచి అనేక విమర్షలకు గురయ్యింది. తనను మంచి వాడిగా చూపించు కోవటానికి మిగతా పాత్రలను మరీ నీచంగా చూపించాడంటూ దుమ్మెత్తి పోసారు అతని కాలం లో క్రికెటర్లు గా ఉన్నవాళ్ళంతా.

    అజహర్ సినిమా లాగా :

    అజహర్ సినిమా లాగా :

    అయితే ధోనీ కి అలంటి స్థితి రాక పోవచ్చు. ఇదేదో కల్పిత కథ అనడానికి లేదు. ఎందుకంటే దర్శకుడు నీరజ్ పాండే సినిమా మొదలు పెట్టడానికంటే ముందే ధోని ని వ్యక్తిగతంగా కలిసి అనుమతి తీసుకోవడమే కాదు, బాల్యం నుంచి ఇప్పటి దాకా ఎన్నో ఆసక్తికర విషయాలను సేకరించి అవసరానికి తగట్టు సినిమాలో వాడుకున్నాడు. కాబట్టి అజహర్ సినిమా లాగా ఇందులో కల్పితాలకు చోటు ఉండదని బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.తాను నటించే అవకాశం లేదు కాబట్టి బాలీవుడ్ నటుడు సుశాంత్ రాజ్ పుత్ టైటిల్ రోల్ పోషిస్తున్నాడు.

    ధోని జీవిత ప్రస్థానమంతా:

    ధోని జీవిత ప్రస్థానమంతా:

    ఇక తన జీవితం సినిమా తీసుకునేందుకు, తనకు సంబందించిన సమాచారం ఇచ్చేందుకు ధోని అక్షరాల 60 కోట్లు డిమాండ్ చేసాడనే మాట బాలీవుడ్ అంతా కోడై కూస్తోంది. మరి ఇది విడుదల అయ్యాక వచ్చే షేర్ నుంచి ఇస్తారా, లేదా ఏదైనా ముందే ఒప్పందం చేసుకున్నారా అనేది బయటికి రావడం లేదు. ధోని మాత్రం సినిమా పట్ల బాగా సంతృప్తిగా ఉన్నాడని తెలుస్తోంది. ధోని జీవిత ప్రస్థానమంతా ఇందులో చక్కగా చూపించారని, ఫాన్స్ కు కాక సగటు ప్రతి సినీ అభిమానికి ఇది నచ్చుతుందని దర్శకుడు చెబుతున్నాడు.అసలు ధోని జీవితం లో ఏం జరిగిందీ అన్న విషయం లో క్లారిటీ కోసం ఇంకో రెండు గంటలు ఆగాల్సిందే.

    ప్రియాంకా ఝా మరణ వార్త :

    ప్రియాంకా ఝా మరణ వార్త :

    అయితే ఇందులో కేవలం ధోని క్రికెట్ చరిత్ర గురించే కాకుండా తన పర్సనల్ లైఫ్ విషయాలను కూడా ప్రస్థావించడం జరిగిందట. 2002 లో ఇండియా ఏ జట్టుకు ఆడుతున్న సమయంలో ధోని ప్రియాంకా ఝా అనే ఓ అమ్మాయితో ప్రేమలో ఉన్నాడట.2004 బంగ్లాదేశ్ టూర్ కు సెలెక్ట్ అయిన ధోని ప్రియాంకా ఝా మరణ వార్త విని షాక్ అయ్యాడట. తను ఎంతో ప్రేమించి జీవితం పంచుకోవాలనే ఆశతో ఉన్న ధోనికి ఆమె మరణం ఎంతో బాధ కలిగించిందట. దాదాపు సంవత్సరం పాటు ఆ బాధ నుండి బయట పడలేదట.

    అన్ టోల్డ్ స్టోరీ :

    అన్ టోల్డ్ స్టోరీ :

    అయినా సరే బంగ్లాదేశ్ టూర్ లో తన అత్యుత్తమ ఆట తీరుతో అందరిని ఎట్రాక్ట్ చేశాడు ధోని.సక్సెస్ ఫుల్ కెప్టెన్ ధోని బయోపిక్ అనగానే అందులో ఏయే ఏయే అంశాల ప్రస్థావన ఉంటుందా అని ఆడియెన్స్ లో ఉత్సాహం పెరిగింది. కేవలం తెలిసిన విషయాలే కాదు తెలియని ఎన్నో విషయాలను ఈ సినిమా బయటపెడుతుందట. అందుకే టైటిల్ కూడా ధోని అన్ టోల్డ్ స్టోరీ అని పెట్టారు. మరి సినిమా ఏ రేంజ్ విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

    బాలీవుడ్ సినిమాలో నటిస్తున్న భూమిక:

    బాలీవుడ్ సినిమాలో నటిస్తున్న భూమిక:

    దాదాపు తొమ్మిది సంవత్సరాల తరువాత బాలీవుడ్ సినిమాలో నటిస్తున్న భూమిక.. ఈ చిత్రంలో ధోనికి సిస్టర్ పాత్ర పోషిస్తుంది. దీనిలో భాగంగా చిత్ర ప్రమోషన్ లో మాట్లాడిన భూమిక ధోని జీవితం గురించి తెలియని స్టోరీ అనేక ఉందని పేర్కొంది. 'ధోని జీవితం గురించి ప్రతీ ఒక్కరూ తెలుసుకోవాల్సింది చాలా ఉంది. నాకు ధోని జీవితం గురించి పెద్దగా తెలియదు. ఈ సినిమాల్లో పని చేశాక అతని స్ఫూర్తిదాయకమైన జీవితం గురించి తెలుసుకున్నా. ధోని వ్యక్తిగతం గురించి చాలా మందికి పూర్తిగా తెలియదని అనుకుంటున్నా. అతను ఏ విధంగా మనకు ఆదర్శవంతంగా నిలిచాడు అనేది దానిపై ఇప్పుడు చాలా మందిలో విపరీతమైన ఆసక్తి నెలకొంది'అని భూమిక పేర్కొంది.

    మాజీ గర్ల్‌ఫ్రెండ్:

    మాజీ గర్ల్‌ఫ్రెండ్:

    ధోనీ జీవితంపై తీసిన సినిమా ‘ఎం.ఎస్. ధోని- ద అన్‌టోల్డ్ స్టోరీ'లో రాయ్ లక్ష్మితో అతడి రిలేషన్‌షిప్ గురించి ఉంటుందా? లేదా? అనే చర్చ జరుగుతోంది. ఈ చర్చకు కారణం ఏంటంటే.. ‘చెన్నై సూపర్‌కింగ్స్' ఐపీయల్ టీమ్‌కి ధోనీ కెప్టెన్‌గా ఉన్నప్పుడు, రాయ్ లక్ష్మి ఆ టీమ్‌కి బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించారు. అప్పట్లో ఇద్దరూ డేటింగ్ చేసుకున్నారు.,,ధోనీ మాజీ గర్ల్‌ఫ్రెండ్ ప్రియాంక గురించి ‘ఎం.ఎస్. ధోని' ప్రచార చిత్రాల్లో చూపించడంతో, తాజాగా మళ్ళీ రాయ్ లక్ష్మి ప్రస్తావన కూడా వస్తోంది. ‘అకిరా'లో రాయ్ లక్ష్మి అతిథి పాత్రలో తళుక్కుమన్నారు. హిందీలో హీరోయిన్‌గా పరిచయమవుతున్న ‘జూలీ2' త్వరలో విడుదల కానుంది. అయితే, మీడియా మాత్రం రానున్న ఈ సినిమాల గురించి కాక గతాన్ని గుర్తు చేయడం ఎందుకంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్న రాయ్ లక్ష్మి.

    పెళ్లి చేసుకోవాలనుకోలేదు:

    పెళ్లి చేసుకోవాలనుకోలేదు:

    ధోనీ, నేనూ ఎప్పుడూ పెళ్లి చేసుకోవాలనుకోలేదు. ఆ ఆలోచన కూడా రాలేదు. ఏడాది కంటే తక్కువ రోజులే రిలేషన్‌షిప్‌లో ఉన్నాం. మా ఇద్దరి అభిప్రాయాలూ కలవలేదు. దాంతో విడిపోయాం. ఎనిమిదేళ్ల క్రితమే ఆ అధ్యాయం ముగిసింది. ఆ తర్వాత అతడితో టచ్‌లో లేను. అయినా, ధోనీ నాతో మాత్రమే డేటింగ్ చేయలేదు. నా తర్వాత చాలామంది అమ్మాయిలతో డేటింగ్ చేశాడు. చాలామందితో రిలేషన్‌షిప్‌లో ఉన్నాడు. ఆ జాబితా చాలా పెద్దదే. ఆ సంగతులు ఎలా ఉన్నా, అతని జీవిత కథా చిత్రం అంటే అమ్మాయిలు, డేటింగ్ మాత్రమే కాదు కదా. ఈ సినిమాలో ధోనీ జీవిత ముఖ్య ఘట్టాలు చూపిస్తారనుకుంటున్నా.

    వ్యక్తిగత పరిచయం లేదు:

    వ్యక్తిగత పరిచయం లేదు:

    అందులో నా ప్రస్తావన లేదనే అనుకుంటున్నా. ఒక క్రికెటర్‌తో సినిమా హీరోయిన్ డేటింగ్ కథ ఏంటో? తెలుసుకోవాలని అందరిలో ఆసక్తి ఉంటుంది. నావైపు నుంచి కథేంటో తెలుసుకోవాలని కొందరు ప్రయత్నించారు. కానీ, నేనేమీ చెప్పలేదు. ఏ అమ్మాయీ మరొకరి మాజీ గర్ల్ ఫ్రెండ్ అనిపించుకోవాలని కోరుకోదు.ఇప్పుడు ధోనీ పెళ్లి చేసుకుని హాయిగా ఉన్నాడు. ఓ పాప కూడా పుట్టింది. అందుకే, ఇకపై ధోనీ గురించి అడిగితే, ‘క్రికెటర్‌గానే తెలుసు. వ్యక్తిగత పరిచయం లేదు' అని చెబుతా. అంటూ చెప్పేసింది.

    హైప్ ఉంది:

    హైప్ ఉంది:

    సినిమా మొదలైనపుడు బాలీవుడ్ జనాలు పెద్దగా పట్టించుకోలేదు కానీ.. దీని ట్రైలర్ కు వచ్చిన రెస్పాన్స్ చూశాక మాత్రం అందరి ఆలోచన మారింది. అమీర్ ఖాన్.. షారుఖ్ ఖాన్.. సల్మాన్ ఖాన్.. హృతిక్ రోషన్ లాంటి హీరోల సినిమాలు రిలీజైనపుడు ఎంత హైప్ ఉంటుందో ?ఎం.ఎస్.ధోని?కి కూడా అంతే హైప్ ఉంది. పైన చెప్పుకున్న హీరోల సినిమాలు సౌత్ లో అంతగా ఆడవు. ఇంకా కొన్ని రాష్ట్రాల్లో క్రేజ్ ఉండదు. కానీ ధోని సినిమా అందుకు భిన్నం. ధోని తెలియంది ఎవరికి..? అతడి సినిమా అంటే అందరికీ ఆసక్తే. పైగా తెలుగు.. తమిళంతో పాటు కొన్ని రీజనల్ లాంగ్వేజెస్ లో కూడా ఈ సినిమాను అనువదించారు. కాబట్టి ఈ సినిమా కలెక్షన్ల విషయంలో ప్రకంపనలు రేపడం ఖాయమని భావిస్తున్నారు అసలు సంగతేమిటన్నది కొద్ది సేపట్లో తెలిసి పోతుంది మరి.

    English summary
    The latest movie which is hitting screens today MS DHONI is will be controversial as azhar ?
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X