twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ట్రోలింగ్: మహేష్ బాబు మూవీలో ‘బీకాంలో ఫిజిక్స్’

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: బి.కాంలో ఫిక్స్ కూడా ఉంటుంది అంటూ ఇటీవల జలీల్ ఖాన్ అనే పొలిటీషియన్ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. మన దేశంలో కొందరు రాజకీయ నాయకులకు నాలెడ్జ్ ఎలా ఉందో చూడండి అంటూ చాలా మంది సోషల్ మీడియాలో ఈ అంశాన్ని ట్రోల్ చేసారు.

    సోషల్ మీడియాలో బాగా ట్రోలింగ్ అయిన ఈ అంశాలను ఈ మధ్య చాలా కామెడీ షోలలో కూడా వాడేసారు. మహేష్ బాబు 'స్పైడర్' మూవీలో బికాంలో ఫిజిక్స్ అనే పదాన్ని వాడబోతున్నట్లు సమాచారం. సినిమాలో సెటైరిక్ గా ఓ సీన్లో ఈ డైలాగ్ పెట్టే ఆలోచనలో ఉన్నారట.

    వివాదం అవుతుందా?

    వివాదం అవుతుందా?

    అయితే ఈ డైలాగ్ పెట్టాలనే ఆలోచనైతే చేసారు కానీ... అనవసరంగా ఏమైనా పొలిటికల్ ఇబ్బందులు ఎదురవుతాయా? అనే కోణంలో కూడా దర్శకత నిర్మాతలు ఆలోచిస్తున్నట్లు సమాచారం.

    మహేష్ బాబుకు క్లీన్ గా ఇమేజ్

    మహేష్ బాబుకు క్లీన్ గా ఇమేజ్

    మహేష్ బాబు తన సినిమాల్లో వివాదాలు పెట్టడానికి ఎక్కువగా ఇష్టపడరు. వివాదాలకు వీలైనంత దూరంగా ఉంటారు. మరి బీకాంలో పిజిక్స్ అంశంపై మహేష్ బాబు తీసుకునే నిర్ణయం మీదే ఈ సెటైరిక్ సీన్ సినిమాలో ఉంటుందా? లేదా? అనేది తేల నుంది.

    కథ ప్రకారం సెట్టవుతుంది

    కథ ప్రకారం సెట్టవుతుంది

    మురుగదాస్ రాసుకున్న కథ ప్రకారం... పొలిటికల్ పంచ్ లు సినిమాలో ఉంటాయని తెలుస్తోంది. అందులో బీకాంలో ఫిజిక్స్ సీన్ పెట్టినా బాగా ఇమిడిపోతుందట. మరి ఈ విషయమై చివరకు ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

    స్పైడర్

    స్పైడర్

    క్లైమాక్స్‌, రెండు పాటలు మినహా షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని జూన్‌ 23న తెలుగు, తమిళ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

    విలన్ పాత్రలో సూర్య

    విలన్ పాత్రలో సూర్య

    ఈ చిత్రంలో మహేష్ బాబుకు విలన్ గా ఎస్.జె.సూర్య కనిపించబోతున్నారు. స్పై(గూడాచారి) కాన్సెప్టుతో ఈ సినిమా తెరకెక్కుతోంది. మహేష్ బాబు ఇప్పటి వరకు ఎప్పుడూ చేయని ఒక డిఫరెంట్ కాన్సెప్టుతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు.

    ఇతర వివరాలు

    ఇతర వివరాలు

    స్పైడర్ సూపర్‌స్టార్‌ మహేష్‌, రకుల్‌ప్రీత్‌ సింగ్‌, ఎస్‌.జె.సూర్య తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: హేరిస్‌ జయరాజ్‌, సినిమాటోగ్రఫీ: సంతోష్‌ శివన్‌ ఎఎస్‌సి.ఐఎస్‌సి, ఎడిటింగ్‌: శ్రీకర్‌ప్రసాద్‌, ప్రొడక్షన్‌ డిజైనర్‌: రూపిన్‌ సుచక్‌, ఫైట్స్‌: పీటర్‌ హెయిన్‌, సమర్పణ: ఠాగూర్‌ మధు, నిర్మాత: ఠాగూర్‌ మధు, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఎ.ఆర్‌.మురుగదాస్‌.

    English summary
    Apparently the line "B.Com lo Physics" became super synonymous with Telugu audiences. Thanks to that interview of Vijayawada-based politician Jaleel Khan who led huge outrage on social media with his revelation. And now, many filmmakers are getting ready to use it. Jokes are being written and played already on 'B.Com lo Physics' in TV shows like Jabardasth already and now filmmakers have started the usage. Here comes an exclusive information that even Mahesh Babu's upcoming "Spyder" will have a piece of this hilarious thing.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X