»   » బాహుబలి-2 సీన్లు లీక్..... నిర్మాత ఫిర్యాదు, ఒకరి అరెస్ట్!

బాహుబలి-2 సీన్లు లీక్..... నిర్మాత ఫిర్యాదు, ఒకరి అరెస్ట్!

అప్పట్లో లీకైన బాహుబలి వీడియోలు వాట్సాప్ ద్వారా వైరల్ అయ్యాయి. తాజాగా ‘బాహుబలి-2’ విషయంలోనూ మరోసారి ఇలాంటి లీక్ బాగోతం చోటు చేసుకుంది.

Posted by:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: గతేడాది.... బాహుబలి సినిమాకు సంబంధించిన సీన్లు ఎడిటింగ్ రూమ్ నుండి లీక్ అయిన సంగతి తెలిసిందే. అప్పట్లో ఈ విషయంలో కొందరిని అరెస్టు చేసారు కూడా. అప్పట్లో లీకైన వీడియోలు వాట్సాప్ ద్వారా వైరల్ అయ్యాయి.

తాజాగా 'బాహుబలి-2' విషయంలోనూ మరోసారి ఇలాంటి లీక్ బాగోతం చోటు చేసుకుంది. 9 నిమిషాల నిడివిగల సీన్ లీకైంది. 'బాహుబలి-2' మూవీకి సంబంధించిన ఎడిటింగ్ అన్నపూర్ణ స్టూడియోలో జరుగుతోంది. ఎడిటింగ్ టీంలో పని చేస్తున్న కృష్ణ అనే గ్రాఫిక్ డిజైనర్ ఈ సీన్ లీక్ చేసినట్లు గుర్తించారు.

విజయవాడలో దొరికాడు

విషయం తెలుకున్న నిర్మాత వెంటనే జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్, సైబర్ సెల్ లో ఫిర్యాదు చేసారు. కృష్ణను విజయవాడలో అరెస్టు చేసారు. సినిమా రిలీజ్ ముందే ఇలా సినిమాకు సంబంధించిన పుటేజ్ బయటకు లీక్ కావడంలో సినీ వర్గాల్లో ఆందోళన కలిగిస్తోంది.

బాహుబలిని.... పడగొట్టేందుకు రూ. 40 కోట్లు ఖర్చు చేస్తున్నారు?

బాహుబలిని.... పడగొట్టేందుకు రూ. 40 కోట్లు ఖర్చు చేస్తున్నారు... ఈ పని చేస్తున్నది మరెవరో కాదు, రజనీకాంత్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 2.0 మూవీ నిర్మాతలు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

‘బాహుబలి-2’..... కరణ్ జోహార్ దెబ్బ కొడితే కోలుకోవడం కష్టమే!

'బాహుబలి-ది బిగినింగ్' సినిమా ఎవరూ ఊహించని భారీ విజయం సాధించింది. ఈ సినిమా మొత్తం రూ. 650 కోట్లు వసూలు చేస్తే... అందులో ఎక్కువ మొత్తం హిందీ నుండే వచ్చాయి. కరణ్ జోహార్ దెబ్బ కొడితే కోలుకోవడం కష్టమే... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

నేను చేసిన తప్పు అదే... మళ్లీ కనిపించను: రాజమౌళి

నేను చేసిన తప్పు అదే... మళ్లీ కనిపించను అంటూ రాజమౌళి సంచలన ప్రకటన చేసారు. మరి ఆయన చేసిన ప్రకటన ఏమిటి, ఎందుకు అలా అన్నారు అనే పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

English summary
In a shocking update, 9 minute footage of the most famous film Baahubali 2 leaked out. Baahubali 2 leakage complaint to Cyber Police.
Please Wait while comments are loading...