twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అనుకున్నంత లేదు... అక్కడ బాహుబలి2 ప్రభావం తక్కువే

    బాహుబలి ది కన్‌క్లూజన్‌ చిత్రానికి ప్రపంచవ్యాపంగా ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నట్టు వార్తలు వస్తున్నాయి.

    |

    అమెరికా, కెనడాలో భారతీయ చిత్రాలకు ఆదరణ కొంత తక్కువే. హాలీవుడ్ చిత్రాల జోరే అక్కడ కొనసాగుతుంటుంది. ఇటీవల వచ్చిన సుల్తాన్, పీకే, దంగల్ సినిమాలు కలెక్షన్ల పరంగా హాలీవుడ్ సినిమాలకు దీటుగా నిలిచాయి. తాజాగా బాహుబలి సినిమా ఆ పరిస్థితి మార్చేసింది. అమెరికా, కెనడాలో హాలీవుడ్‌ సినిమాలు తొలిరోజు సాధించిన రికార్డును బాహబులి2 బద్దలు కొట్టింది.

    ప్రపంచవ్యాప్తంగా 9 వేల స్క్రీన్లలో

    ప్రపంచవ్యాప్తంగా 9 వేల స్క్రీన్లలో

    బాహుబలి ది కన్‌క్లూజన్‌ చిత్రానికి ప్రపంచవ్యాపంగా ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ప్రతిష్ఠాత్మకంగా రూపొందిన బాహుబలి2 సినిమా ప్రపంచవ్యాప్తంగా 9 వేల స్క్రీన్లలో విడుదలైన సంగతి తెలిసిందే. అయితే తెలుగు వెర్షన్ బాహుబలి2 ఓవర్సీస్ లో ఇరగదీసేస్తోంది. కానీ అదే ఓవర్సీస్ లో తమిళ హిందీ వెర్షన్ లకు మాత్రం ఆదరణ కరవయ్యింది.

    మెజారిటీ పార్ట్ తెలుగు వెర్షన్ దే

    మెజారిటీ పార్ట్ తెలుగు వెర్షన్ దే

    ఇప్పటివరకూ బాహుబలి2కి ఓవర్సీస్ లో 10 మిలియన్ వసూళ్లు రాగా.. ఇందులో మెజారిటీ పార్ట్ తెలుగు వెర్షన్ దే. హిందీ.. తమిళ్ వెర్షన్ లు కూడా భారీగా రిలీజ్ అయినా.. వసూళ్లు నామమాత్రంగానే ఉన్నాయి. తెలుగు వెర్షన్ కలెక్షన్స్ తో పోలిస్తే.. అసలు దరిదాపుల్లో ఎక్కడా కనిపించడం లేదు.

    కనీస మాత్రం వసూళ్లతో

    కనీస మాత్రం వసూళ్లతో

    దీంతో హిందీ- తమిళ్ వెర్షన్స్ ను కొనుగోలు చేసిన నిర్మాతలు షాక్ తినేశారు. ఈ ఏరియా నుంచి భారీ రెవెన్యూను ఆశించగా.. కనీస మాత్రం వసూళ్లతో సరిపెట్టుకోవాల్సి రావడం వారిని నిరుత్సాహానికి గురి చేస్తోంది. బాహుబలి2 మూవీ ఓవర్సీస్ లో కనీసం 15 మిలియన్ డాలర్లు వసూలు చేస్తేనే సక్సెస్ అనిపించుకుంటుంది.

    100 కోట్ల రూపాయలకు సమానం

    100 కోట్ల రూపాయలకు సమానం

    మన కరెన్సీలో అయితే ఇది దాదాపు 100 కోట్ల రూపాయలకు సమానం. కానీ బాహుబలి2 చూపిస్తున్న జోరు చూస్తే.. ఈ మొత్తాన్ని తేలికగానే అధిగమించేస్తుందని చెప్పచ్చు. బాహుబలి2 సినిమా దాదాపు రూ.250 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కింది. పెట్టిన ఖర్చులో ప్రతీ పైసా స్క్రీన్ మీద కనిపిస్తూనే ఉంది.

    విడుదలకు ముందే

    విడుదలకు ముందే

    బాహుబలి సినిమా విడుదలకు ముందే శాటిలైట్, డిస్ట్రిబ్యూషన్ హక్కుల కింద రూ.500 వసూలు చేసింది. తొలి రోజు అంచనాల ప్రకారం వారం నుంచి పది రోజులపాటు బాహుబలి2 హవా కొనసాగితే రూ.1000 కోట్లు వసూలు చేసే అవకాశం ఉందని ట్రేడ్ అనలిస్టులు అంచనా వేస్తున్నారు.

    English summary
    While, the original Telugu version is doing phenomenally well in the US, the Hindi dubbed version and Tamil dubbed version are really walking a tight rope at the US BO since their premieres.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X