twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఖరారైంది: బాహుబలి-2 వచ్చే ఏడాది రావడం లేదు!

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: ‘బాహుబలి-ది బిగినింగ్' ఇండియన్ సినిమా చరిత్రలోనే పెద్ద హిట్. కానీ ఈ సినిమా చూసిన ప్రేక్షకులు పూర్తి సంతృప్తిగా లేరు. ఎందుకంటే ఇది సంగం సినిమానే. త్వరలో రాబోతున్న రెండో భాగం ‘బాహుబలి-ది కంక్లూజన్' చూస్తేనే ప్రేక్షకులకు పూర్తి సంతృప్తి లభిస్తుంది. తొలి భాగం చూసిన ఆడియన్స్... రెండో భాగం ఎప్పుడొస్తుందా? అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

    ‘బాహుబలి-2'ను 2016లో విడుదల చేస్తామని రాజమౌళి అండ్ టీం గతంలో ప్రకటించినప్పటికీ అనుకున్న సమయానికి వచ్చే ఏడాది సినిమా రావడం లేదని తేలి పోయింది. ‘బాహుబలి-2' విడుదల సాధ్యమయ్యేది కేవలం 2017లోనే అంటున్నారు ఆచిత్ర యూనిట్ సభ్యులు.

    Baahubali 2 will hit the screens only in 2017

    వాస్తవానికి ‘బాహుబలి-2' షూటింగ్ ఇప్పటికే మొదలు కావాల్సి ఉంది. అయితే కొన్ని మార్పుల కారణంగా డిసెంబర్ లాస్ట్ వీక్ లేదా జనవరి మొదటి వారంలో గానీ షూటింగ్ మొదలు కాబోతోంది. భారీ సినిమా కావడం, గ్రాఫిక్స్ ఆధారమైన సినిమా కావడంతో షూటింగ్ పూర్తయి, పోస్టు ప్రొడక్షన్ పనులు పూర్తయి విడుదల సిద్ధం అయ్యే సరికి 2016 గడిచి పోతుందని అంచనా వేస్తున్నారు.

    మార్పులు..
    బాహుబలి సాంకేతిక బృందంలో కొత్త సభ్యుడు చేరారు. ఆయన మరెవరో కాదు రాజమౌళి మగధీర, ఈగ చిత్రాలకు వీఎఫ్‌ఎక్స్‌ అందించిన ఆర్‌.సి.కమలాకణ్ణన్‌. శ్రీనివాస్‌ మోహన్‌ స్థానంలో కమలాకణ్ణన్‌ వీఎఫ్‌ఎక్స్‌ సూపర్‌వైజర్‌గా పని చేస్తారని చిత్ర యూనిట్ సోషల్‌ మీడియా ద్వారా అభిమానులకు వెల్లడించింది.

    Baahubali 2 will hit the screens only in 2017

    చేర్పులు..
    తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ప్రముఖ బాలీవుడ్ నటి మాధురి దీక్షిత్ బాహుబలి-2లో అవకాశం దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఇందులో ఆమె అనుష్క సిస్టర్ గా, కుంతల రాజ్యం మహారాణిగా కనిపించబోతోందని అంటున్నారు. త్వరలో ఈ విషయమై అపీషియల్ ప్రకటన వెలువడనుంది.

    బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్ బాహుబలి-2లో బాలీవుడ్ నుండి కొందరిని సినిమాలో తీసుకోవాలని ఒత్తిడి తెచ్చారని, అప్పుడే బాలీవుడ్లో కలెక్షన్స్ ఎక్కువగా వస్తాయని సూచించాడని, అందులో భాగంగానే మాధురి దీక్షిత్ ను గెస్ట్ రోల్ కు రాజమౌళి ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.

    English summary
    SS Rajamouli’s Baahubali 2 will hit the screens only in 2017. The film’s shooting is expected to begin in the last week of December or early January.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X