twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మీడియాపై కోప్పడ్డ రాజమౌళి..సర్దిన అల్లు అరవింద్ (వీడియో)

    By Srikanya
    |

    హైదరాబాద్ : ప్రభాస్, రానా, అనుష్క తమన్నాలు ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'బాహుబలి'. ఈ సినిమా తెలుగు, తమిళ, మళయాల, హిందీ భాషల్లో జూలై 10న భారీ ఎత్తున బాహుబలి విడుదల కానున్న విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో చిత్రం పైరిసీకు గురి కాకుండా చూడటం కోసం పైరసీ మీట్ ని ఏర్పాటు చేసారు. ఈ మీట్ లో రాజమౌళి ...కి ఓ మీడియా వ్యక్తి అడిగిన ప్రశ్నకు కోపం వచ్చింది. టిక్కెట్ రేటు పెంచటం వల్లే పైరసీ జరుగుతోందన్నట్లు అడిగితే రాజమౌళి ఏం సమాధానం ఇచ్చారో ఇక్కడ చూడండి.

    ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

    ఇక పైరసీ జరగకుండా థియేటర్‌ యజమానులు జాగ్రత్తలు తీసుకోవాలని 'బాహుబలి' చిత్ర దర్శకుడు రాజమౌళి కోరారు. హైదరాబాద్‌ ఫిల్మ్‌ ఛాంబర్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... థియేటర్లలో నైట్‌ షోస్‌ అయిపోయిన తర్వాత పైరసీకి పాల్పడుతున్నారన్నారు.

    ఎవరు ఎక్కడ పైరసీ చేసినా వెంటనే తెలిసిపోతుందన్నారు. బాహుబలి పెద్ద సినిమా... పెద్ద తెరపై చూడాల్సిన సినిమా అన్నారు. జులై 10న బాహుబలి విడుదల కాబోతుందని, అందరూ థియేటర్లలో చూడాలని విజ్ఞప్తి చేశారు.

    Baahubali Anti Piracy Press Meet...Angry Rajamouli

    సినీ నిర్మాత అల్లు అరవింద్‌ మాట్లాడుతూ... పైరసీ నియంత్రణకు ప్రత్యేక సెల్‌ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. సర్వీస్‌ ప్రొవైడర్‌ల నుంచి రక్షణ కోసం కోర్టు ఆర్డర్‌ ఇచ్చిందని, పైరసీ నియంత్రణకు అందరూ ముందుకు రావాలని కోరారు. 9మంది పైరసీ దారులపై నిఘా పెట్టేందుకు బెంగళూరు పోలీసులు సహకరించారని చెప్పారు.

    రెండున్నర సంవత్సరాలు కష్టపడి బాహుబలి సినిమా తీశారు. ఈనెల 10న బాహుబలి విడుదల కాబోతోంది... తెలుగువాళ్లంతా సగర్వంగా చెప్పుకునే రోజు అది. భారత దేశం, ప్రపంచంలోని పలు దేశాలు 'బాహుబలి' కోసం ఎదురు చూస్తున్నాయన్నారు. సమావేశంలో సినీనటుడు రాణా, బాహుబలి నిర్మాత శోభు యార్లగడ్డ తదితరులు పాల్గొన్నారు.

    ఇక చిత్రం బిజినెస్ , క్రేజ్ విషయానికి వస్తే...

    Baahubali Anti Piracy Press Meet...Angry Rajamouli

    ట్రేడ్ వర్గాల్లో అందుతున్న సమాచారం ప్రకారం తెలుగు రాష్ట్రాలు రెండింటిలోనూ బాహుబలి తొలి రోజు... 15 కోట్లు వరకూ కలెక్టు చేస్తుందని అంటున్నారు. బెనిఫిట్ షో నుంచి వచ్చే మొత్తం కూడా రికార్డు క్రియేట్ చేస్తుందని భావిస్తున్నారు. 15 కోట్లు వరకూ కలెక్టు చేస్తే..మిగతా అన్ని చోట్లా కలిపి మరో ఐదు కోట్లు వసూలు చేసి మొత్తం 20 కోట్లు మార్కుని చేరుతుంది అంటున్నారు. కేవలం యుఎస్ లోనే ...$800K నుంచి $1M కు చేరే అవకాసం ఉంది.

    ఇక మొదటి వారం బాహుబలి కలెక్షన్స్ అరవై కోట్లు వరకూ ఉండవచ్చు అని అంచనా వేస్తున్నారు. కర్ణాటక నుంచి వచ్చే షేర్ కూడా భారీగా ఉంటుందని ఎక్సపెక్టు చేస్తున్నారు. ఎందుకంటే అక్కడ ఎగ్జిబిటర్లు ఈ చిత్రం ప్రదర్శించే ధియోటర్లలో టిక్కెట్ రేటు ని రెట్టింపు చేయనున్నారు.

    'బాహుబలి' చిత్రం విశేషాలకు వస్తే....

    Baahubali Anti Piracy Press Meet...Angry Rajamouli

    కేవలం భారతదేశంలోని సినీ ప్రియులే కాదు...ప్రపంచం మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం 'బాహుబలి'. భారతీయ పరిశ్రమ నుంచి రాబోతున్న ఓ అద్భుత చిత్రంగా ఈ సినిమాను కొనియాడుతున్న ఈ సినిమా ప్రచారంలో భాగంగా ప్రతిష్ఠాత్మక బీబీసీతో రాజమౌళి మాట్లాడారు. ఆ కార్యక్రమాన్ని ఆదివారం సాయంత్రం బీబీసీ ఆసియా విభాగంలో ప్రసారం చేశారు. మంచి రెస్పాన్స్ వచ్చింది.

    అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందించిన చిత్రం ‘బాహుబలి' . ఈ చిత్రం సెన్సార్ రీసెంట్ గా పూర్తైన సంగతి తెలిసిందే. 2 గంటలు 39 నిముషాలు ఉన్న ఈ చిత్రానికి U/A రేటింగ్ ఇవ్వటం జరిగింది.

    ఈ చిత్రం విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి. ఇప్పటికే విడుదలైన ‘బాహుబలి' ట్రైలర్లు, పాటలకు మంచి ప్రజాదరణ దక్కుతోంది. జూలై 10న ప్రపంచ వ్యాప్తంగా సుమారు నాలుగు వేలకు పైగా ధియేటర్లలో విడుదల అవుతోంది.

    Baahubali Anti Piracy Press Meet...Angry Rajamouli

    అలాగే ఈ చిత్రం రీసెంట్‌గా సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకుని ‘యు/ఎ' సర్టిఫికేట్ పొందింది. ఈ చిత్రాన్ని
    , చైనా లాంటి దేశాల్లో సైతం రిలీజ్ చేసేందుకు చిత్ర నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

    బాహుబలి ది బిగినింగ్ విడుదలకు దగ్గరవడంతో సినిమా యూనిట్ ఇప్పటికే దేశవ్యాప్తంగా ప్రచార కార్యక్రమాలను వేగవంతం చేసింది. సాంప్రదాయ ప్రెస్, మీడియా ప్రచారాలతో పాటు సోషల్ మీడియాలోనూ ప్రచార కార్యక్రమాలతో ‘బాహుబలి' దూసుకుపోతోంది. గత కొన్ని నెలలుగా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ వస్తోన్న బాహుబలి టీమ్ సోషల్ మీడియా ద్వారానే ఈ స్థాయి ప్రచారాన్ని సొంతం చేసుకుంది.

    ఇక సోషల్ మీడియా ప్రమోషన్లలో భాగంగా మమతల తల్లి వీడియో సాంగ్‌ను విడుదల చేయగా ఆ పాటకు అద్భుతమైన స్పందన వచ్చింది. ఇక నేడు బాహుబలిలోని నిప్పులే శ్వాసగా పాటకు సంబంధించిన వీడియో సాంగ్‌ను విడుదల చేశారు. కాగా ఈ పాటలో ఇంతకుముందు చూసిన చాలా షాట్లను మళ్ళీ చూపించారు.

    అయితే కొన్ని కొత్త షాట్స్ కూడా జతచేయడంతో సాధారణంగానే ప్రతీ కొత్త షాట్‌కూ అభిమానులు సినిమాపై అంచనాలు పెంచేసుకుంటున్నారు.

    ఈ చిత్రంలో ప్రభాస్‌, అనుష్క, తమన్నా, రానా ఇతర ముఖ్య పాత్రధారులు. ప్రసాద్‌ దేవినేని, శోభు యార్లగడ్డ నిర్మాతలు. కె.రాఘవేంద్రరావు సమర్పకుడు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌కు అంతర్జాలంలో మంచి స్పందన వస్తోంది.

    English summary
    Rajamouli's Baahubali Anti Piracy Press Meet held at Hyderabad.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X