twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కష్టాల్లో 'బాహుబలి' దున్న, తిండి కరువై నానా ఇబ్బందులు

    By Srikanya
    |

    హైదరాబాద్ : రాజమౌళి ప్రతిష్టాత్మక చిత్రం 'బాహుబలి'లో నటించిన దున్న గుర్తుండే ఉండి ఉంటుంది. రానా (భల్లారదేవ) ఇంట్రడక్షన్ సీన్ లో ఓ పెద్ద దున్నతో ఆయన పోరాడతాడు. ఈ సినిమాలో నటించిన దున్నపోతుకు అప్పట్లో ప్రాధాన్యం సంతరించుకుంది. చివరకు యుద్ధ సన్నివేశంలో రానా బలిచ్చే సన్నివేశంలో అదే దున్నపోతు కనిపిస్తుంది. ఈ దున్నపోతుకు ప్రస్తుతం తిండి కరువై నానా ఇబ్బందులు పడుతూ వార్తలకు ఎక్కింది.

    బాహుబలి షూటింగ్ పూర్తయిన అనంతరం దాన్ని రాఘవేంద్రస్వామి మంత్రాలయానికి బహూకరించారు. అక్కడ ఏమైందో ఏమోగాని ప్రస్తుతం నల్లగొండ జిల్లా రాజాపేట మండలం చల్లూరులో ఉన్న సహయోగ్ గోశాలలో తలదాచుకుంటోంది.రోజువారీగా తిండి సైతం లేక ప్రస్తుతం 'బహుబలి' దున్న అష్టకష్టాలు పడుతూండటం అందరినీ బాధపెడుతోంది.

    Baahubali Bull in Real Life problmes

    బాహుబలి-2 సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. చిత్రీకరణ ప్రస్తుతం చివరి దశలో ఉంది. 2017, ఏప్రిల్ 28న విడుదలవుతుంది. ధర్మ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై బాలీవుడ్‌లో 'బాహుబలి'ని విడుదల చేసిన కరణ్‌... రెండో పార్ట్ బాహుబలి ది కన్ క్లూజన్ హిందీ వర్షెన్ ను కూడా డిస్ట్రిబ్యూట్ చేయనున్నట్టు ప్రకటించారు.

    బాహుబలి పార్ట్-1 భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. తెలుగు, తమిళం, మళయాలంతో పాటు హిందీలో కూడా రిలీజైన ఈ చిత్రం దేశ వ్యాప్తంగా కలెక్షన్ల వర్షం కురిపించింది. దాదాపు రూ. 650 కోట్లు వసూలు చేసింది. ఇంతర భారీ మొత్తం వసూళ్లు ఒకప్పుడు బాలీవుడ్ సినిమాలకే సాధ్యం అనే ఒక వాదన ఉండేది. సౌత్ సినిమాలకు కూడా ఆ సత్తా ఉందని బాహుబలి సినిమా నిరూపించింది.

    బాహుబలి 2లో యుద్ద సన్నివేశాలు తొలి భాగాన్ని మించేలా ఉండబోతున్నాయి. ఈ విషయాన్ని రాజమౌళి కూడా ఆ మధ్య వెల్లడించిన సంగతి తెలిసిందే. తొలి భాగం కంటే రెండో భాగానికి ఖర్చు కూడా భారీగానే పెడుతున్నారు. బాహుబలి సినిమా వెనక మాస్టర్ మైండ్ రాజమౌళి. ఆయన లేకుంటే తెలుగులో ఇంత పెద్ద సినిమా ఉండేదే కాదు. అయితే తొలి భాగంలో కొన్ని లోపాలు ఉండటంతో విమర్శలు వచ్చాయి. అయితే రెండో భాగంలో అలాంటివేమీ లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు రాజమౌళి.

    Baahubali Bull in Real Life problmes

    రాజమౌళి ప్రతిష్టాత్మక చిత్రం 'బాహుబలి'లో నటించిన దున్న గుర్తుండే ఉండి ఉంటుంది. రానా (భల్లారదేవ) ఇంట్రడక్షన్ సీన్ లో ఓ పెద్ద దున్నతో ఆయన పోరాడతాడు. ఈ సినిమాలో నటించిన దున్నపోతుకు అప్పట్లో ప్రాధాన్యం సంతరించుకుంది. చివరకు యుద్ధ సన్నివేశంలో రానా బలిచ్చే సన్నివేశంలో అదే దున్నపోతు కనిపిస్తుంది. ఈ దున్నపోతుకు ప్రస్తుతం తిండి కరువై నానా ఇబ్బందులు పడుతూ వార్తలకు ఎక్కింది.

    English summary
    we all know Rana (ballaladeva) introduction scene, fight between a massive Bull and Rana. killed that bull in just One Strong Punch. This scene Rajamouli directed very Creatively, Most of the audience liked a lot And watching again and again to watch EPIC WAR and RANA BULL FIGHT. Now it is the news about that Baahubali bull.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X