twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    లండన్‌లో బాహుబలికి అరుదైన గౌరవం.. బ్రిటన్‌‌కు రాజమౌళి, శోభూ.. ప్రభాస్ మిస్.. ఎందుకంటే?

    ప్రపంచవ్యాప్తంగా సంచలన రేపుతున్న బాహుబలి చిత్రానికి మరో అరుదైన గౌరవం దక్కింది. ఈ చిత్రాన్ని లండన్‌లోని బ్రిటిష్ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో మంగళవారం ప్రదర్శించనున్నారు.

    By Rajababu
    |

    ప్రపంచవ్యాప్తంగా సంచలన రేపుతున్న బాహుబలి చిత్రానికి మరో అరుదైన గౌరవం దక్కింది. ఈ చిత్రాన్ని లండన్‌లోని బ్రిటిష్ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో మంగళవారం ప్రదర్శించనున్నారు. ఈ ప్రదర్శనకు సంబంధించిన ఏర్పాటు చేయడానికి దర్శకుడు రాజమౌళి, నిర్మాత శోభూ యార్లగడ్డ, సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి సోమవారం లండన్‌కు బయలుదేరి వెళ్లినట్టు సమాచారం.

    కుటుంబం సమేతంగా లండన్‌కు..

    కుటుంబం సమేతంగా లండన్‌కు..

    గత ఐదేళ్లుగా దర్శకుడు రాజమౌళి బాహుబలి షూటింగ్‌కే అంకితమయ్యారు. బాహుబలి2 సినిమా తర్వాత వెకేషన్ టూర్‌కు వెళ్లనున్నానని ఇటీవల రాజమౌళి మీడియాకు వెల్లడించారు. లండన్‌లో బాహుబలి2 ప్రత్యేక ప్రదర్శన ఉండటంతో రాజమౌళి, శోభూ, కీరవాణి తమ కుటుంబ సమేతంగా లండన్‌లోనే సమ్మర్ వెకేషన్స్ గడుపాలని నిర్ణయించుకొన్నట్టు సమాచారం. బాహుబలి2 రిలీజ్ తర్వాత భూటన్‌ పర్యటనక వెళ్లనున్నట్టు ఇంతకు ముందు రాజమౌళి తెలిపిన సంగతి తెలిసిందే.

    బ్రిటీష్ ఫిల్మ్ ఇనిస్టిట్యూట్‌లో..

    బ్రిటీష్ ఫిల్మ్ ఇనిస్టిట్యూట్‌లో..

    బాహుబలి2 సినిమాను లండన్‌లోని బ్రిటీష్ ఫిల్మ్ ఇనిస్టిట్యూట్‌లో మంగళవారం ప్రదర్శించనున్నారు. ఆ ప్రదర్శన కోసం లండన్ వెళ్తున్నాం. వారం రోజుల తర్వాత తిరిగి వస్తాం. ప్రదర్శన కోసం అక్కడ చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి అని నిర్మాత శోభూ తెలిపారు.

    ప్రభాస్ మిస్..

    ప్రభాస్ మిస్..

    లండన్‌లో బాహుబలి ప్రదర్శించే కార్యక్రమానికి ప్రభాస్ కావడం లేదట. ప్రభాస్ ప్రస్తుతం అమెరికాలో ఉన్నందున వీలు కావడం లేదని తెలుస్తున్నది. ఈ స్క్రీనింగ్ కోసం బాహుబలి నటీనటులు, సాంకేతిక నిపుణులు వెళ్తారా అనే అంశంపై ఇంకా క్లారిటీ లేదు.

    625 కోట్ల కలెక్షన్లు..

    625 కోట్ల కలెక్షన్లు..

    ఇదిలా ఉండగా, బాహుబలి సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.600 కోట్లకు (గ్రాస్) పైగా వసూలు చేసింది. ఇండియాలో రూ.490 కోట్లు, ఓవర్సీస్‌లో రూ.135 కోట్లు, మొత్తం రూ.625 కోట్లు వసూలు చేసిందని ట్రేడ్ అనలిస్టులు వెల్లడించారు.

    పీకే రికార్డు తడిచిపెట్టడానికి...

    పీకే రికార్డు తడిచిపెట్టడానికి...

    బాహుబలి త్వరలోనే అమీర్ ఖాన్ నటించిన పీకే సినిమా రికార్డులను తడిచిపెట్టడానికి సిద్ధమవుతున్నది. పీకే చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.792 కోట్ల వసూళ్లను రాబట్టింది. భారతీయ సినిమా చరిత్రలో ఇదే అత్యుత్తమ రికార్డు. ఈ రికార్డు త్వరలోనే అధిగమిస్తుందనే అభిప్రాయాన్ని ట్రేడ్ పండితులు వెల్లడిస్తున్నారు.

    English summary
    SS Rajamouli, his producer Shobu Yarlagadda and music composer MM Kreem reached London. Shobu said, “Our film is being screened by the British Film Institute on Tuesday in London. We’re back in a week’s time.There’s so much work to be done.” But Prabhas, will be missing from the special screening in London as he is in the USA.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X