twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఫ్యాన్స్ ఫైర్: బాహుబలి-2 సినిమాను కీరవాణి చెడగొట్టాడు!

    కొందరు అభిమానులు బాహుబలి 2 చిత్రానికి సంగీతం, బ్యాగ్రౌండ్ స్కోర్ అందించిన కీరవాణిపై విమర్శలు చేయడం సోషల్ మీడియాలో వైరల్ అయింది.

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: గత రెండేళ్లుగా యావత్ భారత దేశం ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం 'బాహుబలి-2' మూవీ రానే వచ్చింది. అన్ని ఏరియాల నుండి సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. బాక్సాఫీసు వద్ద సినిమా జోరు చూస్తుంటే బాలీవుడ్, టాలీవుడ్ లో ఉన్న అన్ని రికార్డులను బద్దలు కొట్టడం ఖాయంగా కనిపిస్తోంది.

    అంతా బాగానే ఉంది కానీ.... కొందరు అభిమానులు ఈ చిత్రానికి సంగీతం, బ్యాగ్రౌండ్ స్కోర్ అందించిన కీరవాణిపై విమర్శలు చేయడం సోషల్ మీడియాలో వైరల్ అయింది. సినిమా ఉదయం ఆట అయిపోగానే థియేటర్స్ నుండి బయటకు వస్తున్న ప్రేక్షకులను, అభిమానులను టీవీ ఛాన్సల్ వారు అభిప్రాయాలు కోరగా... అంతా బాగానే ఉంది కానీ కీరవాణి సినిమాను చెడగొట్టాడంటూ విమర్శలు చేయడం గమనార్హం.

    బ్యాగ్రౌండ్ స్కోర్ లో కీరవాణిని తీసేయాలంటూ...

    బ్యాగ్రౌండ్ స్కోర్ లో కీరవాణిని తీసేయాలంటూ...

    ఓ అభిమాని ప్రసాద్స్ ఐమాక్స్ థియేటర్ వద్ద మీడియాతో మాట్లాడుతూ... సినిమా అంతా బాగానే ఉంది కానీ బ్యాగ్రౌండ్ స్కోర్ లో కీరవాణి గారిని తీసేయాలని, ఆయన అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ బాగోలేదని, ఇది తమను తీవ్రంగా నిరాశ పరిచిందని వ్యాఖ్యానించారు.

    రాజమౌళి పడ్డకష్టానికి న్యాయం చేయలేదు

    రాజమౌళి పడ్డకష్టానికి న్యాయం చేయలేదు

    రాజమౌళిగారు పడ్డ కష్టానికి కీరవాణి 100 శాతం న్యాయం చేలేదని, సినిమా మొత్తం బాగా తీసినా బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమాకు మైనస్ అయిందని వ్యాఖ్యానించాడు. బ్యాగ్రౌండ్ స్కోర్ అంటే రొమాలు నిక్కపొడిచేలా ఉండాలని, కానీ ఈ సినిమాలో అలాంటి ఫీలింగ్ తమకు కలుగలేదని కామెంట్ చేసారు.

    మనలాంటోళ్ల మాట ఎవరు వింటారు?

    కీరవాణి ఫస్ట్ పార్టే చెడగొట్టాడు... సెకండ్ పార్ట్ కు ఆయన వద్దని అప్పుడే చెప్పాం. కానీ మనలాంటోళ్ల మాటలు ఎవరు వింటారు? పెద్ద పెద్దోళ్ల మాటలే వింటారు. రాజమౌళిగారు కీరవాణి గారిని అనవసరంగా ఎందుకు నమ్ముతున్నారో తెలియదు అంటూ సదరు అభిమాని ఫైర్ అవ్వడం గమనార్హం.

    మరో అభిమాని కూడా ఇలానే...

    మరో అభిమాని కూడా ఇలానే...

    ఇలా మరో అభిమాని కూడా సినిమాకు బ్యాగ్రౌండ్ సరిగా లేదని డిసప్పాయింట్ వ్యక్తం చేసారు. అయితే కొందరు అభిమానులు, ప్రేక్షకులు సినిమాలో పాటులు బావున్నాయని వ్యాఖ్యానించడం గమనార్హం.

    సినీ విమర్శకుల నుండి మంచి మార్కులే

    సినీ విమర్శకుల నుండి మంచి మార్కులే

    మరో వైపు పలువురు సినీ విమర్శకులు తమ తమ రివ్యూల్లో కీరవాణి బ్యాగ్రౌండ్ స్కోర్ పై ప్రశంసలు గుప్పించారు. ఆయన మంచి బ్యాగ్రౌండ్ స్కోర్ అందించారని పేర్కొన్నారు. మరి అభిమానులు ఇలా ఎందుకు స్పందించారో? అర్థం కావడం లేదు.

    అందరికీ నచ్చక పోవచ్చు

    అందరికీ నచ్చక పోవచ్చు

    ఒక సినిమాకు సంబంధించిన ఏదైనా అంశం అందరికీ నచ్చాలని ఏమీ లేదు. కొందరికి కొన్ని నచ్చక పోవచ్చు. అంతమాత్రాన కీరవాణి లాంటి మ్యూజిక్ డైరెక్టర్ల టాలెంటును శంకించాల్సిన అవసరం లేదని మరికొందరి వాదన.

    English summary
    Some Baahubali movie fans have expressed dissatisfaction on MM Keeravani's background score.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X