twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బాహుబలి క్రేజ్: 10 సెకన్లకు రూ. 2.5 లక్షలు

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: బాహుబలి మూవీ తెలుగు సినిమా చరిత్రలోనే కాదు... ఇండియన్ సినిమా చరిత్రలోనే ఓ సంచలనం. ఇండియన్ డొమెస్టిక్ మార్కెట్లో అత్యధిక వసూలు చేసిన చిత్రంగా బాహుబలి రికార్డు క్రియేట్ చేసింది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా అన్ని బాషల్లో కలిపి ఈ చిత్రం దాదాపు 650 కోట్లు వసూలు చేసిన అందరినీ ఆశ్చర్య పరిచింది.

    త్వరలో బాహుబలి సినిమాను టీవీల్లో ప్రసారం చేయబోతున్నారు. అక్టోబర్ 25న బాహుబలి తెలుగు వెర్షన్ మాటీవీలో ప్రసారం కానుంది. తెలుగు టెలివిజన్ చరిత్రలో హయ్యెస్ట్ టీఆర్పీ రేటింగ్ ఈ సినిమాకు వస్తుందని ఆశిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా మధ్యలో ప్రసారం అయ్యే యాడ్స్ రేటు కూడా భారీగా రేటు ఫిక్స్ చేసినట్లు సమాచారం.

    Baahubali film is expected to get highest TRPs ever

    10 సెకన్ల యాడ్ కోసం పలు కంపెనీలు రూ. 2.5 లక్షలు చెల్లించేందుకు అంగీకరించినట్లు సమాచారం. ఇప్పటి వరకు ఏ సినిమాకు యాడ్స్ ఇంత ఖరీదుగా లేవు. దీన్ని బట్టి బాహుబలి సినిమాపై క్రేజ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. బాహుబలి రెండు పార్టులు కలిపి శాటిలైట్ రైట్స్ రూ. 18 కోట్లకు కొనుగోలు చేసారు. మరి ఇంత భారీ మొత్తం తిరిగా రావాలంటే యాడ్స్ రేట్లు ఈ మాత్రం ఉండటంలో ఆశ్చర్యం ఏమీ లేదని ట్రేడ్ వర్గాల్లో చర్చ సాగుతోంది.

    మరో వైపు సెప్టెంబర్ 30న హిందీ వెర్షన్ ‘బాహుబలి' డీవీడీలు విడుదల చేసేందుకుప్లాన్ చేస్తున్నారు. ప్రముఖ ఆన్ లైన్ షాపింగ్ వెబ్ సైట్ ‘అమేజాన్ డాట్ కామ్' ద్వారా ముందుస్తు బుకింగ్స్ ప్రారంభించారు. బ్లూ-రే ఫార్మాట్ రూ. 718, డీవీడీ ఫార్మాట్ రూ. 268 కు అమ్మకానికి పెట్టారు. మీరు ఇపుడు ఆర్డర్ చేస్తే విడుదల వెంటనే మీ ఇంటికి వస్తాయి.

    English summary
    On October 25th, first ever television premiere of Baahubali: The Beginning will be aired on MAA TV. And the film is expected to get highest TRPs ever.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X