twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    4K రెజిల్యూషన్ తో 'బాహుబలి' ...నేటి నుంచి

    By Srikanya
    |

    హైదరాబాద్‌: ప్రముఖ దర్శకుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్‌, రానా, రమ్యకృష్ణ, అనుష్క, తమన్నాలు ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'బాహుబలి'. జులై 10న విడుదలైన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రికార్డుస్థాయిలో వసూళ్లు సాధించిన విషయం తెలిసిందే.

    ఈ చిత్రం నేటి నుంచి యూట్యూబ్ లో విడుదల చేయనున్నారు. అది కూడా 4 కె రెజిల్యూషన్ లో కావటంతో ....మంచి ఎక్సపీరియన్స్ దక్కే అవకాసం ఉంది. అలాగే ఈ రెజిల్యూషన్ లో విడుదల అయ్యే తొలి ఇండియన్ సినిమా కూడా ఇదే.

    తెలుగుతో పాటు, తమిళం, హిందీ, మళయాలం బాషల్లో గ్రాండ్‌గా విడుదలైన ఈ సినిమా ఇండియన్ సినిమా చరిత్రలోనే ఓ సంచలన చిత్రంగా నిలిచింది. రూ. 600 కోట్లకుపైగా వసూలు చేసి అందరినీ ఆశ్చర్య పరిచింది.

    ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

    Baahubali hits youtube with 4K

    విడుదలవడమే భారీగా విడుదలైన ఈచిత్రం 100 రోజుల పాటు విజయవంతంగా ప్రదర్శితం అయి కలెక్షన్ల సునీమీ సృష్టించింది. ప్రస్తుతం ఈ సినిమా బిజినెస్ దాదాపుగా క్లోజ్ అయింది. దర్శకుడు రాజమౌళి కూడా రికార్డుల కోసం సినిమాను ఎక్కువ రోజులు నడిపించాలనే ఉద్దేశ్యం తమకు లేదని, కలెక్షన్లు వచ్చే కొన్ని చోట్ల మాత్రమే ప్రదర్శిస్తామని గతంలోనే ప్రకటించారు.

    తెలుగులో ‘బాహుబలి' మూవీ బిజినెస్ పూర్తవడంతో కలెక్షన్ వివరాలు బయటకు వచ్చాయి. ఒక తెలుగు వెర్షన్ చిత్రమే రూ. 172 కోట్లకుపైగా షేర్ వసూలు చేసింది. తెలుగులో సినిమా చరిత్రలో ఈ రేంజిని అందుకునే సత్తా త్వరలో రాబోయే ‘బాహుబలి-2' సినిమాకు తప్ప మరే సినిమాకు లేదని చెప్పడంలో సందహం లేదు.

    English summary
    S S Rajamouli’s Baahubali will be released on YouTube with 4K resolution.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X