twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'బాహుబలి' పై ఆ డౌట్ వద్దు...నిర్మాత వివరణ

    By Srikanya
    |

    హైదరాబాద్ : " బాహుబలి చిత్రం లో పాత్రలు మహాభారతం నుంచి తీసుకున్నవంటూ ప్రచారం జరుగుతోంది. కథ కానీ, పాత్రలుకానీ ఏ విధంగానూ మహాభారతం తో సంభందం లేదు. బాహుబలి చిత్రం అన్ని రకాలుగా...పూర్తి ఒరిజనల్. ", అని నిర్మాత శోభు తేల్చి చెప్పారు.

    ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

    'బాహుబలి' చిత్రంకు చెందిన పోస్టర్స్ ఈ మధ్యన విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో చాలా మంది నాజర్ పాత్రను ...శకుని పాత్రగనూ, రానా పాత్రను దుర్యోధనుడు పాత్రతోనూ పోలుస్తున్నారు. ఈ విధమైన రూమర్స్ సినిమాకు ఇబ్బంది కలిగిస్తాయని గ్రహించిన నిర్మాత శోభు వెంటనే రంగంలోకి దిగి వివరణ ఇచ్చారు.

    ప్రముఖ దర్శకుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం 'బాహుబలి'. ప్రభాస్‌, రానా, తమన్నా, అనుష్క ప్రధాన పాత్రధారులు. ఆర్కా మీడియా పతాకంపై ప్రసాద్‌ దేవినేని, శోభు యార్లగడ్డ నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రాన్ని దేశవ్యాప్తంగా జులై 10న 3500 థియేటర్లలో విడుదల చేయనున్నట్లు సమాచారం. ఈ సినిమా ప్రచారాన్ని చిత్రబృందం వినూత్నంగా నిర్వహిస్తోంది.

    Baahubali is not based on Mahaabharat –Shobu

    ఇందులో భాగంగా సినిమాను ప్రపంచ వ్యాప్తంగా అభిమానులకు పరిచయం చేయడానికి కేన్స్‌ అంతర్జాతీయ చలనచిత్రోత్సవాన్ని వేదికగా చేసుకొంది. శోభు యార్లగడ్డ, ఛాయాగ్రాహకుడు కె.కె.సెంథిల్‌కుమార్‌, ఎస్‌.ఎస్‌.కార్తికేయ ఆధ్వర్యంలో ఓ బృందం కేన్స్‌కు వెళ్లింది. అక్కడ కేన్స్‌ ప్రతినిధి క్రిస్టియన్‌ జేన్‌ను కలిశారు.

    ఈ సందర్భంగా శోభు యార్లగడ్డ అంతర్జాతీయ మీడియాతో మాట్లాడుతూ ''బాహుబలి' రెండు భాగాలు కలిపి 290 నిమిషాల నిడివి ఉంటుంది. అంతర్జాతీయ ప్రేక్షకుల కోసం సినిమా నిడివి తగ్గించి విడుదల చేస్తాం. ఈ సినిమాను భారతీయ పురాణాల నేపథ్యంలో తెరకెక్కించలేదు. ఇది పూర్తిగా కొత్త కథ'' అని చెప్పారు. ఈ సినిమా అంతర్జాతీయ ప్రచారం కోసం ఫ్రంట్‌నైట్‌ సంస్థ అధిపతి ఫ్రాంకోయిస్‌ డ సిల్వాను తమ బృందంలో కలుపుకొంది చిత్ర నిర్మాణ సంస్థ ఆర్కా మీడియా.

    భల్లాలదేవ పాత్రలో నటించిన రానా ప్రచార చిత్రాన్ని బుధవారం రాజమౌళి ఆన్‌లైన్‌లో విడుదల చేశారు. సినిమాలో రానా ప్రతినాయకుడిగా నటించిన విషయం తెలిసిందే. క్రూరుడైన ఓ రాజుగా ఆయన తెరపై సందడి చేయబోతున్నారు.

    అలాగే... 'బాహుబలి' పాటల్ని లహరి మ్యూజిక్‌ ద్వారా విడుదల చేయబోతున్నారు. 'బాహుబలి' తెలుగు, తమిళ పాటలకు సంబంధించిన హక్కుల్ని లహరి మ్యూజిక్‌ సంస్థ చేజిక్కించుకొంది. ''భారతీయ చలన చిత్ర చరిత్రలో నిలిచిపోయే 'బాహుబలి' సినిమా పాటల్ని మా సంస్థ ద్వారా విడుదల చేస్తుండడం ఆనందంగా ఉంద''న్నారు లహరి మ్యూజిక్‌ అధినేత జి.మనోహర్‌నాయుడు.

    English summary
    producer of the “Baahubali” Shobu Yarlagadda stated that the flick is not based on any mythological story of India. “As it is doing rounds, Baahubali’s characters are not sculpted out of the Mahaabharat neither the story had any connection with the legendary tale. Baahubali is original in all of its aspects”, said Shobu, clarifying about the movie.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X