»   » ఫొటోలు : వర్షంలో ప్రభాస్, అనుష్క, తమన్నా, రాజమౌళి కలిసి

ఫొటోలు : వర్షంలో ప్రభాస్, అనుష్క, తమన్నా, రాజమౌళి కలిసి

Posted by:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: 'బాహుబలి' మలయాళం ఆడియో విడుదల కార్యక్రమం ఘనంగా ముగిసింది. భారీ వర్షం పడుతున్నా ఖాతరు చేయకుండా అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో 'బాహుబలి' చిత్రం భారీ పోస్టర్‌ను విడుదల చేసినట్లు మలయాళం మీడియా కథనాలు వెలువరించింది.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు


ఆడియో విడుదల జరిగిన కొచ్చిలోని సెక్రెడ్‌ హర్ట్‌ కళాశాల మైదానంలో సరిపోయేంత పెద్ద పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్‌ ప్రపంచ రికార్డు అయ్యే అవకాశాలు ఉన్నట్లు కూడా అక్కడి మీడియా వర్గాలు ట్విట్టర్లో వెల్లడించాయి.


భారీ వర్షంలోనూ ఎంతో సహనంతో చివరి వరకు వున్న అభిమానులకు నటుడు ప్రభాస్‌ తన ఫేస్‌బుక్‌ ఖాతా ద్వారా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.


అలాగే...బాహుబలి మళయాల ఆడియో రిలీజ్ వేడుకలో ఓ సరికొత్త వరల్డ్ రికార్డును నెలకొల్పేందుకు బాహుబలి టీమ్ సిద్ధమైంది. ప్రపంచంలో ఇప్పటివరకూ ఎక్కడా ఆవిష్కరించనంత సైజులో అతిపెద్ద పోస్టర్‌ను ఆవిష్కరించి వరల్డ్ రికార్డు నెలకొల్పనున్నట్లు తెలుస్తోంది. ఈ పోస్టర్ ఆర్గనైజర్స్ ఈ పోస్టర్ ని గిన్నీస్ బుక్ అఫ్ వరల్డ్ రికార్డ్స్ కోసం పంపనున్నారు.


ఆ ఫోటోలు మీ కోసం స్లైడ్ షోలో...


ముచ్చట్లు

రాజమౌళి, ప్రభాస్, రానా, అనుష్క, తమన్నాలతో పాటు బాహుబలి యూనిట్ ఇప్పటికే కొచ్చిలో పలు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలతో ముచ్చటించింది.


 


మొదలెట్టేసారు

మళయాలం ప్రచార కార్యక్రమాలను మొదలుపెట్టేశారు.


 


అదే రోజు

జూలై 10న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ, మళయాల, హిందీ భాషల్లో బాహుబలి భారీ ఎత్తున విడుదల కానున్న విషయం తెలిసిందే.


పెరిగిన అంచనాలు

ఈ చిత్రం విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి.


 


ప్రజాదరణ

ఇప్పటికే విడుదలైన ‘బాహుబలి' ట్రైలర్లు, పాటలకు మంచి ప్రజాదరణ దక్కుతోంది.


ఎన్ని థియోటర్లు

జూలై 10న ప్రపంచ వ్యాప్తంగా సుమారు నాలుగు వేలకు పైగా ధియేటర్లలో విడుదల అవుతోంది.


 


ఇక్కడే కాదు..

ఈ చిత్రాన్ని , చైనా లాంటి దేశాల్లో సైతం రిలీజ్ చేసేందుకు చిత్ర నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.


సెన్సార్ పూర్తి

అలాగే ఈ చిత్రం రీసెంట్‌గా సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకుని ‘యు/ఎ' సర్టిఫికేట్ పొందింది.


 


వేగవంతం

బాహుబలి ది బిగినింగ్ విడుదలకు దగ్గరవడంతో సినిమా యూనిట్ ఇప్పటికే దేశవ్యాప్తంగా ప్రచార కార్యక్రమాలను వేగవంతం చేసింది.


 


దూసుకుపోతోంది

సాంప్రదాయ ప్రెస్, మీడియా ప్రచారాలతో పాటు సోషల్ మీడియాలోనూ ప్రచార కార్యక్రమాలతో ‘బాహుబలి' దూసుకుపోతోంది.


 


ట్విట్టర్, ఫేస్ బుక్ లతో

గత కొన్ని నెలలుగా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ వస్తోన్న బాహుబలి టీమ్ సోషల్ మీడియా ద్వారానే ఈ స్థాయి ప్రచారాన్ని సొంతం చేసుకుంది.


అద్బుతమైన స్పందన

ఇక సోషల్ మీడియా ప్రమోషన్లలో భాగంగా మమతల తల్లి వీడియో సాంగ్‌ను విడుదల చేయగా ఆ పాటకు అద్భుతమైన స్పందన వచ్చింది.


 


ఈ పాటకు కూడా...

బాహుబలిలోని నిప్పులే శ్వాసగా పాటకు సంబంధించిన వీడియో సాంగ్‌ను విడుదల చేశారు. కాగా ఈ పాటలో ఇంతకుముందు చూసిన చాలా షాట్లను మళ్ళీ చూపించారు.


 


అంచనాలు పెరిగాయి

అయితే కొన్ని కొత్త షాట్స్ కూడా జతచేయడంతో సాధారణంగానే ప్రతీ కొత్త షాట్‌కూ అభిమానులు సినిమాపై అంచనాలు పెంచేసుకుంటున్నారు.


 


పగ..పోరాటం..

రాజ్యాధికారం కోసం సాగే పోరాటం. పగ, ప్రతీకారం, ప్రేమ, అసూయల మధ్య సినిమా నడుస్తుంది. శివుడుగా, బాహుబలిగా ఇందులో రెండు పాత్రల్ని ప్రభాస్ పోషిస్తున్నారు.


ప్రభాస్ మాటల్లో...

''ఇది - రాజులు, రాజ్యాలు, అధికారం కోసం సాగే పోరాటం, యోధానుయోధుల చుట్టూ తిరిగే కాల్పనిక గాథ''.


అందుకే బాహుబలి

బాహువుల్లో అపారమైన బలం ఉన్న వ్యక్తి గనక, అతణ్ణి 'బాహుబలి' అంటారని చిత్ర యూనిట్ వర్గాలు చెబుతున్నాయి.


మరి రాజమౌళి మాటల్లో

... బాహుబలి అంటే ''ది ట్రూ కింగ్'' అని అర్దం. అందుకు తగినట్లే సీన్స్ ఉన్నాయని చెప్తున్నారు.


అనుష్క కనిపించేది కాసేపేనా?

ప్రభాస్ వేస్తున్న రెండు పాత్రల్లో ఒక పాత్రే ఫస్ట్‌పార్ట్ 'బాహుబలి... ది బిగినింగ్'లో కనిపిస్తుందని ఒక రూమర్ షికారు చేస్తోంది. అదేమిటని ఆరా తీస్తే, రెండు పాత్రలూ ఇందులో కనిపిస్తాయని తెలిసింది.


రానా పాత్ర ఇదే..

బాహుబలిలో హీరో తరువాత హీరో అంతటి ప్రాధాన్యమున్న పాత్ర - భల్లాలదేవ. బాహుబలికి తమ్ముడి వరసయ్యే పరమ దుష్టుడు. ఆ పాత్రను వేస్తున్నది రానా దగ్గుబాటి. సినిమా మొత్తం ఈ క్యారెక్టర్ మీద నడుస్తుంది. అది అంత పవర్‌ఫుల్ పాత్ర.


రానా పాత్ర గురించి ప్రభాస్

''రానా చేసిన భల్లాలదేవ క్యారెక్టర్ భారతీయ సినిమా చరిత్రలో ఇప్పటి వరకు వచ్చిన ఉత్తమ విలన్ పాత్రల్లో ఒకటవుతుంది. ఆ మాట నమ్మకంగా చెప్పగలను''అని ప్రభాస్ చెప్తున్నారు.


 


తమన్నా పాత్ర ఏంటి

బాహుబలి ప్రేమికురాలు అవంతిక పాత్రధారిణి-తమన్నా. ఈ ఫస్ట్‌పార్ట్‌లో ఆమే ప్రధాన హీరోయిన్.


 


అనుష్క పాత్ర ఫస్టాఫ్ లో కొంతే

ఇక, అనుష్క పోషించే కీలక పాత్ర దేవసేన. అయితే, ఈ ఫస్ట్ పార్ట్‌లో ఆమె కనిపించేది మాత్రం చాలా కొద్దిసేపేనట! అదీ ఈ మధ్య విడుదల చేసిన వయసు మీద పడ్డ గెటప్‌లోనే అట!


సెకండాఫ్ మొత్తం అనుష్కదే

2016లో వచ్చే 'బాహుబలి' సెకండ్ పార్ట్ (దానికి ఇంకా పేరేదీ ఖరారు చేయలేదు)లో మాత్రం అనుష్క పాత్రదే హవా అని తెలుస్తోంది.


 


హేమా హేమీలు

అలాగే, రమ్యకృష్ణ, తమిళం నుంచి నాజర్, సత్యరాజ్, కన్నడం నుంచి 'ఈగ' ఫేమ్ సుదీప్ లాంటి భారీ తారలు ఈ సినిమాలో ఉండనే ఉన్నారు.


English summary
Baahubali Malayalam Version Audio launhed. Baahubali’s organizers will send the poster to get the Guinness Book of World Records’ recognition. Prior to the audio launch, the entire cast and crew of Baahubali interacted with the media and revealed the details about the making of the film.
Please Wait while comments are loading...