twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘బాహుబలి’ డైలాగ్ టీజర్ మరోటి రిలీజైంది(వీడియో)

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: బాహుబలి సినిమా ప్రమోషన్లలో భాగంగా మరో డైలాగ్ టీజర్ విడుదలైంది. ఈసారి రమ్యకృష్ణ చెప్పే డైలాగులతో ఈ టీజర్ సాగుతుంది. సినిమాలో ఆమె శివగామి అనే కీలకమైన పాత్రలో నటిస్తోంది. ఈ డైలాగ్ టీజర్ పై మీరూ ఓ లక్కేయండి.

    ‘బాహుబలి' సినిమా జులై 10న విడుదలవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించి టికెట్స్ అడ్వాన్డ్స్ శుక్రవారం బుకింగ్ మొదలైంది. థియేటర్ల వద్ద, ఆన్ లైన్ సైట్లలో కూడా బుకింగ్స్ ప్రారంభం అయ్యాయి. ఈ విషయం తెలిసిన వెంటనే బాహుబలి సినిమా అభిమానులు థియేటర్ల వైపు పరుగులు తీసారు. ఆన్ లైన్ సదుపాయం ఉన్నవారు ఆ దిశగా టికెట్ల కోసం ప్రయత్నాలు మొదలు పెట్టారు.

    అయితే టికెట్స్ ఇస్తున్న విషయం తెలిసిన వెంటనే థియేటర్ల వద్దకు భారీగా జనం చేరుకున్నారు. కొన్ని చోట్ల పోలీసులు రంగంలోకి దిగి లాఠీ చార్జి చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆన్ లైన్లో కూడా టికెట్ల కోసం పోటెత్తడంతో బుక్ మై షో, ఇతర ఆన్ లైన్ సైట్ల సర్వర్ డౌన్ అయి టికెట్స్ బుక్ కావడం లేదు. ఈ కారణాలతో టికెట్స్ కోసం ప్రయత్నించిన వారికి మొండి చేయి ఎదురు కాక తప్పలేదు. విదేశాల్లో ఇలాంటి ఇబ్బందులు లేవు. యూఎస్, కెనడా, యూకె, యూఏఇ ఇతర దేశాల్లో ముందస్తు బుకింగ్స్ సవ్యంగానే సాగుతున్నాయి. అయితే టికెట్స్ ధరే కాస్త ఎక్కువ అని అంటున్నారు.

    ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా, రమ్య కృష్ణ, సత్యరాజ్ తదితరులు ముఖ్య పాత్రధారులుగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘బాహుబలి' సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ చిత్రం పార్ట్ 1 ‘బాహుబలి-ది బిగినింగ్' జులై 10న విడుదలకు సిద్ధమవుతోంది. సినిమాపై అంచనాలు భారీగా ఉన్నట్లే.... అందుకు తగిన విధంగానే సినిమా విడుదలకు ముందే ఈ సినిమా భారీగా బిజిజనెస్ చేస్తోంది.

    English summary
    Watch Baahubali Dialogue Trailer - Prabhas, Ramya Krishna. Baahubali is an upcoming Indian movie that is simultaneously being shot in Telugu and Tamil. The film will also be dubbed in Hindi, Malayalam
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X