twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    భయంకరుడు...: బాహుబలి ‘కాలకేయ’ లుక్ (ఫోటో)

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: బాహుబలి సినిమా ప్రమోషన్లో భాగంగా ఆ చిత్రంలోని ప్రముఖ పాత్రలకు సంబంధించి రోజుకో ఫస్ట్ లుక్ విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే శివుడు, దేవసేన, శివంగి పాత్రలకు సంబంధించి ఫస్ట్ లుక్స్ విడుదల చేసారు. తాజాగా కాలకేయ వార్ లార్డ్ లుక్ విడుదల చేసారు. వార్ లార్డ్ అంటే సైనిక నాయకుడు అని అర్థం. ఈ కాలకేయ పాత్రను ప్రభాకర్ పోషిస్తున్నాడు.

    లక్ష మంది బార్బేనియన్(అనాగరికులు) సైన్యానికి నాయకుడిగా కాలకేయ బాహుబలి ది బిగినింగ్ సినిమాలో కనిపించబోతున్నాడు. ‘రక్తం తాగే రాక్షసుడు....హింస అతనికి శాంతిని ఇస్తుంది' అంటూ రాజామౌళి కాలకేయ పాత్ర గురించి చెప్పుకొచ్చాడు. పోస్టర్లోనే కాలకేయ లుక్ ఈ రేంజిలో ఉందంటే సినిమాలో ఎలా ఉండబోతోందో?

    ఈ చిత్రంలో ప్రభాస్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. శివుడు, బాహుబలిగా రెండు పాత్రల్లో నటిస్తున్నాడు. బాహుబలి' సినిమాకు సంబంధించిన ఫస్ట్ అఫీషియల్ పోస్టర్ మేడే సందర్భంగా విడుదల చేసారు. మే 31న థియేట్రికల్ ట్రైలర్ విడుదల చేయబోతున్నారు. అప్పటి వరుక సినిమాలోని వివిధ ప్రాతలకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్లు విడుదల చేస్తూ సినిమాకు పబ్లిసిటీ కల్పించాలని ప్లాన్ చేసారు.

    తొలి చిత్రం నుంచి రాజమౌళి తన చిత్రాల్లో ఇంటర్వెల్ బ్యాంగ్ కు ప్రయారిటీ ఇస్తూ వస్తున్నారు. వెంట్రుకలు నిక్కబొడుచుకునేలా ట్విస్ట్,గ్రాఫిక్స్, డైలాగులు, ఎమోషన్,యాక్షన్ ఇలా అన్ని కలగలపి ఆయన ఇంటర్వెల్ క్రియేట్ చేస్తూంటారు. అసలు ఆయన చిత్రాలు ఇంటర్వెల్ మొదట అనుకుని తర్వాత మిగతా కథ డిజైన్ చేస్తారా అన్నట్లు ఉంటాయి. ఈ నేపధ్యంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న బాహుబలిలో ఇంటర్వెల్ ఎలా ఉండబోతోందనేది ఆసక్తకరమైన చర్చగా మారింది. అయితే ఈ సినిమాలో రెండు ఇంటర్వెల్ లు ఉంటాయి అంటున్నారు.

    Baahubali New Poster Of Kalakeya War Lord

    అంటే రెగ్యులర్ గా వచ్చే ఇంటర్వెల్ ఒకటి...ప్రీ క్లైమాక్స్ సైతం ఇంటర్వెల్ స్దాయిలో కథను మలుపు తిప్పేలా డిజైన్ చేసారని, అక్కడ ఓ ట్విస్ట్ వస్తుందని, అలాగే...యాక్షన్ తో ప్రేక్షకుడు షాక్ కు గురి అవుతాడని అంటున్నారు. ఆ స్ధాయిలో రాజమౌళి ఈ ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ లను డిజైన్ చేసాడని చెప్పుకుంటున్నారు.

    తన డ్రీమ్ ప్రాజెక్టు విషయంలో క్వాలిటీ పరంగా కాంప్రమైజ్ కావడం ఇష్టం లేకనే రాజమౌళి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సినిమా కోసం మొత్తం 17 విఎఫ్ఎక్స్ స్టూడియోలు, 600 మంది ఆర్టిస్టులు పని చేస్తున్నారు. అనుకున్న సమయానికి పని పూర్తి కాలేదని, అందుకే విడుదల ఆలస్యం అవుతున్నట్లు రాజమౌలి తెలిపారు.

    ‘బాహుబలి' సినిమాకు ఇంటర్నేషనల్ హైప్ తేవడంలో భాగంగా...ప్రొడక్షన్ టీం ఆసియాకు చెందిన ప్రముఖ ఎడిటర్ జామేస్ మార్ష్‌కు ఆహ్వానం పలికినట్లు తెలుస్తోంది. ఆసియాకు సంబంధించిన సినిమాలపై ఆయన రాసే ఆర్టికల్స్ అంతర్జాతీయంగా ప్రాచుర్యం పొందాయి. రామోజీ ఫిల్మ్ సిటీలోని ‘బాహుబలి' సెట్స్ ను సందర్శించిన ఆయన ‘బాహుబలి' సినిమా మేకింగుపై ఆర్టికల్ రాయనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే పలు ఇంటర్నేషనల్ మేగజైన్లలో బాహుబలి గురించిన ఆర్టికల్స్ రానున్నాయని తెలుస్తోంది.

    ఇప్పటికే బాహుబలి సెట్స్ కు సంబంధించిన ఫోటోలు బయటకు రిలీజ్ అయ్యాయి. అబ్బుర పరిచేలా ఉన్న సెట్టింగులు సినిమాపై అంచనాలు మరింత పెంచాయి. ఇక సినిమా ప్రేక్షకుల అంచనాలకు మించే విధంగా ఉంటుందని స్పష్టమవుతోంది. అంతర్జాతీయ మార్కెట్లోనూ ఈ సినిమాకు మంచి పేరొస్తుందని నమ్ముతున్నారు.

    English summary
    After setting the social networking sites ablaze with the stunning posters of Baahubali principle characters like Shivudu, Devasena and Sivagami, It's time for Kalakeya to repeat the magic. First look of Kalakeya War Lord, from Baahubali The Beginning, was revealed by the director today at 4 PM.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X