twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'బాహుబలి' కు పోలీస్ సాయం..ధాంక్స్

    By Srikanya
    |

    హైదరాబాద్ :'బాహుబలి' రెండో భాగం షూటింగ్ మొదలై రెగ్యులర్ గా జరుగుతున్న సంగతి తెలిసిందే. రీసెంట్ గా రామోజీ ఫిల్మ్ సిటీని వదిలి... కేరళలలో ఎక్సక్లూజివ్ షెడ్యూల్ కు వెళ్లింది. అక్కడ ఈ యూనిట్..స్పెషల్ షెడ్యూల్ పూర్తి చేసారు. అక్కడ కన్నూర్ లో అద్బుతమైన లొకేషన్స్ లో ఈ షూటింగ్ జరిపారు. అంతెందుకు లైవ్ లో పులితో పీటర్ హెయిన్స్ ఓ ఫైట్ ని ప్లాన్ చేసి తీసారు. ఇప్పుడు ఈ షెడ్యూల్ పూర్తైపోయిందని ట్వీట్ చేసి తెలియచేసారు.

    కేరళలో తమకు ఇచ్చిన ఆతిద్యానికి చాలా ధాంక్య్ అంటూ బాహుబలి టీమ్ చెప్పుకొచ్చింది.

    అలాగే... కేరళ ఫారెస్ట్ డిపార్టమెంట్ వారికి, పోలీస్ వారికి వారు చేసిన సాయానికి ధాంక్స్ చెప్పారు.

    వీటితో పాటు కేరళలోని బ్యూటీ ఫుల్ లొకేషన్స్ ని తమ కెమెరా లో బంధించి ఇలా అందించారు.

    ఇక ఈ చిత్రం ఎలా ఉండబోతోంది అనేది ఇప్పుడు అందరిలో ఆసక్తికరమైన అంశం. ఈ చిత్రానికి ''బాహుబలి - ది కంక్లూజన్‌' అనే టైటిల్ పెట్టారు. ఈ చిత్రంలో మొదటి భాగంలో ఉన్న సందేహాలు అన్నీ కంక్లూజన్ దొరుకుతుందనే ఈ టైటిల్ పెట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రం గురించి సినీ అభిమానులు ఎదురుచూస్తున్నారు.

    'బాహుబలి 2' గురించి రానా మాట్లాడుతూ... ''బాహుబలి - ది కంక్లూజన్‌' వచ్చాక 'బాహుబలి - ది బిగినింగ్‌' చాలా చిన్నదిగా కనిపిస్తుంది. రెండో భాగంలో పోరాట సన్నివేశాలు, భావోద్వేగాలు, సెట్లు... ఇలా అన్నీ ఇంకా భారీగా ఉంటాయి''అన్నాడు రానా.

    BAAHUBALI PART II latest info.

    టైటిల్ తో పాటు అన్ని విషయాల్లోనూ అత్యంత భారీతనం కనిపించిన బాహుబలి చిత్రం కలెక్షన్లను కూడా భారీగానే కొల్లగొట్టి సరికొత్త చరిత్ర సృష్టిస్తోంది. మరో ప్రక్క సోషల్ నెట్ వర్కింగ్ సైట్లు అయిన ఫేస్ బుక్, ట్విటర్ లో 'బాహుబలి' హవా కొనసాగుతోంది. కెరీర్ లో ఇప్పటివరకు తీసిన తొమ్మిది చిత్రాలలో ఏ ఒక్కటీ ఫ్లాప్ కాలేదు. దాంతో ఈ పదో సినిమా కూడా మెగా హిట్ టాక్ తో రన్ అవటం అందరికీ ఆనందాన్ని కలిగించి తదుపరి చిత్రంపై ఆసక్తి కలిగించేలా చేస్తోంది.

    English summary
    Shobu Yarlagadda tweeted:" Thanks to Kerala Forest, Police n Dist. Admin. for their cooperation n ensuring that we had hassle free experience #BaahubaliMovie"
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X