»   » అడవిలో బాహుబలి షూటింగ్... (ఫోటో)

అడవిలో బాహుబలి షూటింగ్... (ఫోటో)

Posted by:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి-ది బిగినింగ్' గతేడాది విడుదలై గతంలో దక్షిణాది సినీ చరిత్రలో ఎన్నడూ చూడని కలెక్షన్ల సంచలనం సృష్టించింది. తెలుగు సినిమా ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లింది. ప్రస్తుతం రాజమౌళి అండ్ టీం బాహుబలి రెండో భాగమైన ‘బాహుబలి-ది కంక్లూజన్' సినిమా తెరకెక్కించే పనిలో బిజీగా ఉన్నారు.

ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఫోటో ఒకటి నెట్లో హల్ చల్ చేస్తోంది. అడవిలో షూటింగ్ జరుగుతుండగా తీసిన ఫోటో ఇది. ప్రభాస్ తో పాటు చిత్ర యూనిట్ సభ్యులంతా నడుచుకుంటూ వెలుతున్న ఆ ఫోటోపై మీరూ ఓ లుక్కేయండి.ఇక బాహుబలి తొలి పార్టుకు అవార్డులు, రివార్డులు బాగానే వస్తున్నాయి. ఇండియన్ సినిమా రంగంలో అత్యంత ప్రతిష్ఠాత్మక సంస్థ ‘ది ఫిలిం అండ్‌ టెలివిజన్‌ ప్రొడ్యూసర్స్‌ గైడ్‌' నుండి ప్రశంసలు అందాయి. ఇటీవల జరిగిన ఐఫా అవార్డుల వేడుకలో కూడా తమిళ విభాగంలో బెస్ట్ పిక్చర్, బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్స్, బెస్ట్ ప్లేబ్యాక్ సింగర్స్ విభాగంలో ఈ చిత్రానికి ఆరు అవార్డులు వచ్చాయి.


ప్రభాస్‌, రానా, అనుష్క, తమన్నా, రమ్యకృష్ణ ప్రధాన పాత్రల్లో విడుదలైన బాహుబలి గూగుల్‌ సెర్చ్ లో కూడా ఇండియాలో నెం.1 మూవీగా బాహుబలి ప్రథమ స్థానంలో నిలిచింది. ప్రస్తుతం రాజమౌళి ‘బాహుబలి' చిత్రానికి సీక్వెల్ తెరకెక్కించే పనిలో నిమగ్నం అయ్యారు. ఇప్పటికే షూటింగ్ ప్రారంభం అయింది. ‘బాహుబలి-ది కంక్లూజన్' పేరుతో తెరకెక్కే ఈ చిత్రం 2017లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

English summary
In a shooting still of Baahubali second part, Prabhas in Amarendra Baahubali attire is seen walking to the location along with the big crew.
Please Wait while comments are loading...