twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బాహుబలి పంజా దెబ్బ: దుబాయ్ షేకులు కూడా షేక్ అవుతున్నారు

    ఒక తెలుగు సినిమా గురించి దుబాయ్‌లోని అన్ని పత్రికలు మెయిన్‌ పేజ్‌ కవరేజ్‌తో పబ్లిసిటీ ఇవ్వడం అక్కడి తెలుగువారిని విస్మయపరుస్తోంది.

    |

    హైదరాబాద్ మహా నగరంలో భిన్నమైన పరిస్థితి నెలకొంది. ఇప్పటివరకూ ఎప్పుడూ లేని విధంగా ఒక్క సినిమాతోనే హైదరాబాద్ మహా నగరంలోని థియేటర్లు అన్నీ నిండిపోయాయి. ఇంత పెద్ద మహానగరంలో రెండు అంటే రెండు థియేటర్లు మినహా మిగిలిన అన్నీ థియేటర్లలోనూ బాహుబలి చిత్రాన్ని ప్రదర్శిస్తున్నారు. ఇలాంటి అరుదైన రికార్డు కనుచూపు మేరలో మరెవరికీ సాధ్యం కాదేమో.

    ఓవర్ సీస్ లో పరిస్థితేమిటి

    ఓవర్ సీస్ లో పరిస్థితేమిటి

    కాచిగూడ లోని పద్మావతి థియేటర్లోనూ.. ఆర్టీసీక్రాస్ రోడ్ లోని సప్తగిరి థియేటర్ మినహా.. మిగిలిన మహానగరంలోని అన్ని థియేటర్లలోనూ ఈ సినిమానే ప్రదర్శిస్తున్నారు. ఈ రెండు థియేటర్లలో ఆడుతున్న రెండు సినిమాల్లో ఒకటి బేగంజాన్ కాగా..రెండోది కాంగ్. స్కల్ ఐల్యాండ్. ఇక్కడి సంగతే ఇలా ఉంటే మరి ఓవర్ సీస్ లో పరిస్థితేమిటి..???

    దుబాయ్‌ వెళ్లి

    దుబాయ్‌ వెళ్లి

    నిన్నా మొన్నటి దాకా ఓవర్సీస్ అంటే యూఎస్ మీదే అందరి దృష్టీ ఎక్కువ ఉండేది. నిజానికి ఇప్పటిదాకా తెలుగు వాళ్ళు ఎక్కువ మందే ఉన్న దుబాయ్ లాంటి దేశాలని పెద్దగా పట్టించుకోలేదు గానీ అక్కడా ఇప్పుడు మార్కెట్ దృష్టి మొదలయ్యింది. దుబాయ్‌లో వున్న క్రేజ్‌ని గుర్తించి బాహుబలి టీమ్‌ అందరూ కలిసి దుబాయ్‌ వెళ్లి అక్కడి తెలుగువారిని మీట్‌ అయి వచ్చారు.

    తెలుగు సినిమా కొత్త పుంతలు

    తెలుగు సినిమా కొత్త పుంతలు

    తెలుగు సినిమా వరకు ఓవర్సీస్‌ బిజినెస్‌ అంటే కేవలం అమెరికా వసూళ్లని, కొంతవరకు యుఏఈ మార్కెట్‌ని మాత్రమే లెక్కించేవారు. కానీ బాహుబలితో తెలుగు సినిమా కొత్త పుంతలు తొక్కుతోంది. ఇంతవరకు తెలుగు సినిమా స్క్రీన్‌ అవని దేశాల్లోను బాహుబలి అకౌంట్ ఓపెన్ చేస్తోంది.

    లక్షా ఇరవై వేల అడ్మిషన్లు

    లక్షా ఇరవై వేల అడ్మిషన్లు

    హాలీవుడ్‌, చైనీస్‌ లేదా అప్పుడప్పుడు బాలీవుడ్‌ చిత్రాలు తప్ప మరి దేనిని అక్కడి మీడియా పట్టించుకోదట. కానీ బాహుబలి చిత్రానికి వస్తోన్న వసూళ్ల ప్రభంజనంతో మీడియా కి కూడా సాహో..! బాహుబలి అనక తప్పలేదు. ఇప్పటికే లక్షా ఇరవై వేల అడ్మిషన్లతో యుఎఈలో చరిత్ర సృష్టించిన బాహుబలి అక్కడి బాక్సాఫీస్‌ చరిత్రని తిరగరాస్తుందని బల్ల గుద్ది చెబుతున్నారు.

    మెయిన్‌ పేజ్‌ కవరేజ్‌తో

    మెయిన్‌ పేజ్‌ కవరేజ్‌తో

    ఒక తెలుగు సినిమా గురించి దుబాయ్‌లోని అన్ని పత్రికలు మెయిన్‌ పేజ్‌ కవరేజ్‌తో పబ్లిసిటీ ఇవ్వడం అక్కడి తెలుగువారిని విస్మయపరుస్తోంది. ఏదైనా అవార్డు వేడుకలు జరిగితే తప్ప తెలుగు సినిమాని పట్టించుకోని దుబాయ్‌ పత్రికలు బాహుబలికి ఈ రేంజ్‌ కవరేజ్‌ ఇవ్వడం అక్కడ ఉన్న తెలుగువాళ్ళకి ఆనందంగా ఉందట

    English summary
    Bahubali 2 created a new History With 1,20,000 Admissions in Unaited Arab Emirates
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X