twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నిజమేనంటూ ఖరారు చేసిన 'బాహుబలి' టీమ్

    By Srikanya
    |

    హైదరాబాద్ :ప్రముఖ దర్శకుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి ప్రతిష్ఠాత్మకంగా రూపొందిస్తున్న చిత్రం 'బాహుబలి'. ఈ సినిమా పాటల్ని ఈ నెల 13న ,తిరుపతిలో విడుదల చేయనున్నారంటూ మీడియాలో వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో బాహుబలి టీమ్ అఫీషియల్ గా ఈ వార్తను ఖరారు చేస్తూ ట్వీట్ చేసింది. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయ మైదానంలో ఆడియో విడుదల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చిత్రబృందం ట్వీట్టర్‌లో తెలిపింది. మీరూ ఆ ట్వీటన్ ని చూడండి.

    ప్రస్తుతం యావత్ భారతదేశ సినీ పరిశ్రమ కళ్ళన్నీ బాహుబలి చిత్రం వైపే వున్నాయి. ఈ సినిమా దర్శకుడు ఎస్.ఎస్ రాజమౌళి బాహుబలి గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలిపాడు.

    ఈ భారీ బడ్జెట్ చిత్రానికి మహాభారతమే తనకు స్పూర్తినిచ్చిందని తెలిపాడు. ఇదేకాదు దాదాపు తన సినిమాలన్నిటికీ రామాయణ, మహాభారతాలే స్పూర్తని చెప్పుకొచ్చాడు. ఈ రెండు ఇతిహాసాలతో తనకున్న అనుబంధమే దీనికి కారణమని తెలియజేసాడు. బాహుబలి పార్ట్ 1 జులై 10న మనముందుకు రానుంది. బాలీవుడ్ లో కరణ్ జోహార్ సమర్పిస్తున్న ఈ సినిమాను ఆర్కా మీడియా వర్క్స్ సంస్థ నిర్మిస్తుంది.

    Baahubali team tweet about audio function

    భారతీయ చిత్ర పరిశ్రమలో అత్యంత భారీ వ్యయంతో రూపొందుతున్న చిత్రం 'బాహుబలి'. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ సినిమా తొలి భాగం 'బాహుబలి - ది బిగినింగ్‌' పేరుతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

    ఈ చిత్రంలో ప్రభాస్‌, అనుష్క, తమన్నా, రానా ఇతర ముఖ్య పాత్రధారులు. ప్రసాద్‌ దేవినేని, శోభు యార్లగడ్డ నిర్మాతలు. కె.రాఘవేంద్రరావు సమర్పకుడు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌కు అంతర్జాలంలో మంచి స్పందన వస్తోంది. ఈ చిత్రాన్ని వచ్చే నెల 10న విడుదల చేస్తున్నారు. కీరవాణి సంగీతం అందించారు.

    English summary
    Baahubali team tweeted: " The audio event of 'Baahubali - The Beginning' will be held in Sri Venkateswara University grounds, Tirupati on June 13th. #LiveTheEpic"
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X