twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బుసన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు ‘బాహుబలి’

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘బాహుబలి-ది బిగినింగ్' సినిమాను ఓపెన్ సినిమా కేటగిరిలో 20వ బుసన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ప్రదర్శించబోతున్నారు. ఈ ఏడాది అక్టోబర్ 1 నుండి అక్టోబర్ 10 వరకు సౌత్ కొరియాలోని బుసన్ నగరంలో ఈ ఫిల్మ్ ఫెస్టివల్ జరుగనుంది.

    జులై 10, 2015న రిలీజైన ‘బాహుబలి-ది బిగినింగ్' కలెక్షన్ల వసూళ్లు, రికార్డుల మోతతో బాక్సాఫీసు దద్దరిల్లేలా చేసింది. ఇండియన్ సినిమా హిస్టరీలో హయ్యెస్ట్ డొమెస్టిక్ గ్రాస్ గా ఈ చిత్రం రికార్డుల కెక్కింది. దేశీయంగా అత్యధికగా వసూళ్లు సాధించిన సినిమాగా బాహుబలి సినిమా మొదటి స్థానంలో ఉంది.

    'Baahubali: The Beginning' At BIFF

    బాహుబలి చిత్రాన్ని ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్‌కు తగిన విధంగా ప్రఖ్యాత హాలీవుడ్ ఎడిటర్ విన్సెంట్ టబైలాన్ ఎడిటర్ చేస్తున్నారు. గతంలో ఈయన హాలీవుడ్ సినిమాలు ‘టేకెన్ 2', ఇన్‌క్రెడబుల్ హల్క్, ట్రాన్స్‌పోర్టర్ 2 తదితర చిత్రాలకు ఎడిటింగ్ చేసారు. ఈయన ఎడిట్ చేసిన బాహుబలి వెర్షన్ బుషన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ప్రదర్శితం కానుంది.

    బాహుబలి చిత్రాన్ని ఈ ఫిల్మ్ ఫెస్టివల్ లో ఇండోర్ స్క్రీనింగ్స్ లో అక్టోబర్ 4, అక్టోబర్ 7వ తేదీన... ఔట్ డోర్ స్క్రీనింగ్ అక్టోబర్ 9న ప్రదర్శించనున్నారు. ఈ ఫిల్మ్ ఫెస్టివల్ కి రాజమౌళి కూడా హాజరవుతున్నారు. కొరియన్ ఆడియన్స్, మీడియాతో అక్టోబర్ 4వ తేదీన క్వశ్చన్ & ఆన్సర్స్ సెషనల్ నిర్వహిస్తున్నారు.

    English summary
    "Baahubali: The Beginning", India's biggest motion picture, will be screened in the Open Cinema category of the 20th Busan International Film Festival(BIFF), to be held this year in Busan, South Korea from Oct. 1 to Oct. 10.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X