twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఇలాంటివి కూడా నమ్ముతారా? ‘బాహుబలి’ టైటిల్ వెనక మూడ నమ్మకాలు?

    బాహుబలి టైటిల్ వెనక మిస్టరీ వీడింది. న్యూమరాలజీ నమ్మకంతోనే కరణ్ జోహార్ ఈ పని చేయించారట. బాలీవుడ్లో చాలా సినిమాలు ఇలాంటి న్యూమరాలజీని ఫాలో అవుతున్నాయి.

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: సినిమా ఇండస్ట్రీకి చెందిన వారు న్యూమరాలజీని, సెంటిమెంట్లను బాగా నమ్ముతారు. అలా చేస్తే లక్కు కలిసొస్తుందని, తమ దశ తిరిగిపోతుందని, సినిమా విజయం సాధిస్తుందనే ఆలోచనలో ఉంటారు. కొందరు ఇలాంటివన్నీ ట్రాష్ అని... కేవలం మూఢ నమ్మకాలు అంటూ కొట్టిపారేస్తుంటారు. అయితే విజయం కోసం తపించే సినిమా వాళ్లు మాత్రం వీటిని బాగా నమ్ముతున్నారు.

    ఇండియన్ సినిమా పరిశ్రమలో చరిత్ర సృష్టించిన బాహుబలి సినిమా విషయంలో కూడా నిర్మాతలు కొన్ని సెంటిమెంట్లను ఫాలో అయ్యారట. చాలా లేటుగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. బాహుబలి పోస్టర్ మీద ఇంగ్లీష్ టైటిల్, సినిమా సెన్సార్ సర్టిఫికెట్ మీద ఉన్న టైటిల్‌లో తేడా గమనిస్తే ఈ విషయం స్పష్టం అవుతుంది.

    డబల్ 'A'

    డబల్ 'A'

    బాహుబలి మూవీ పోస్టర్ల మీద Bahubali The Beginning మరియు Bahubali The Conclusion అని రాసి ఉంటుంది. అయితే సెన్సార్ సర్టిఫికెట్ మీద మాత్రం Baahubali అంటూ డబల్ A అని ఉంది.

    కారణం కరణ్ జోహార్?

    కారణం కరణ్ జోహార్?

    ఇలా తేడా ఉండటానికి కారణం బాహుబలి సినిమాను హిందీలో రిలీజ్ చేసిన నిర్మాత కరణ్ జోహారే అని అంటున్నారు. అతడు న్యూమరాలజీని బాగా నమ్ముతాడని, అందుకే సినిమా పోస్టర్లలో Baahubali నుండి ఒక A ఎగరగొట్టి Bahubali అని పెట్టారని తెలుస్తోంది.

    సెన్సార్ సర్టిఫికెట్లో మాత్రం అలానే...

    సెన్సార్ సర్టిఫికెట్లో మాత్రం అలానే...

    అయితే రెండు పార్టులకు సంబంధించిన సెన్సార్ సర్టిఫికెట్లో మాత్రం Baahubali The Beginning మరియు Baahubali The Conclusion... అంటూ డబల్ A తో బాహుబలి స్పెల్లింగ్ రాసి ఉండటాన్ని మనం గమనించవచ్చు.

    విషయం లీక్ చేసిన సంజయ్ జుమాని

    విషయం లీక్ చేసిన సంజయ్ జుమాని

    కరణ్ జోహార్ న్యూమరాలజిస్ట్ సంజయ్ జుమాని ఈ విషయాన్ని మీడియాకు లీక్ చేశారు. సినిమా పోస్టర్లో AA ఉంటే సినిమా సక్సెస్ అవ్వడానికి అవకాశం లేదని, అందుకే సినిమా పోస్టర్ నుండి ఒక A తొలగించామని ఆయన తెలిపారు. బాహుబలి రెండో భాగం పోస్టర్లో 2 అంకెను (Bahubali 2) యాడ్ చేశామని, అయితే సెన్సార్ సర్టిఫికెట్లో మాత్రం Baahubali The Conclusion అని ఉంటుందని తెలిపారు.

    ఇంతకు ముందు

    ఇంతకు ముందు

    గతంలో సంజయ్ జుమానీ ‘దబాంగ్' మూవీ టైటిల్ లో ఎక్స్‌ట్రా g యాడ్ చేసి Dabangg అని మార్చారని, అదే విధంగా బిగ్ బాస్ లో కూడా అదనంగా g యాడ్ చేసి Bigg Boss‌ గా మార్చారట. అందుకే ఆ రెండు చాలా సక్సెస్ అయ్యాయని అంటున్నారు.

    హృతిక్ మూవీకి కూడా

    హృతిక్ మూవీకి కూడా

    హృతిక్ రోషన్ తొలి మూవీ ‘కహోనా ప్యార్ హై' సినిమాలో ఆయన ఎక్స్ ట్రా a చేసి Kaho Naa Pyaar hai అని మార్చడం వల్లనే సినిమా అప్పట్లో పెద్ద హిట్టయిందట. బాలీవుడ్ నిర్మాత ఏక్తాకపూర్ ఇలాంటివి బాగా నమ్ముతుందని అందుకే తన నిర్మించిన సనిమాలకు Kkusum, Kasauti Zindagi Kay, Kahaani Ghar Ghar Kii, Once Upon A Time In Mumbaai అదనంగా a యాడ్ చేసిందని, వరుణ్ ధావన్ నెక్ట్స్ మూవీ Judwaaలో అదనంగా a యాడ్ చేయడానికి కూడా కారణం ఇదే అని అంటున్నారు.

    హిందీ మీడియం

    హిందీ మీడియం

    ‘హిందీ మీడియం' అనే టైటిల్ మీడియం అనేది ఇంగ్లీషులో పెట్టడానికి కారణం..... న్యూమరాలజీ అంకెలే అని అంటున్నారు.

    అక్షయ్ కుమార్ మూవీలో కూడా

    అక్షయ్ కుమార్ మూవీలో కూడా

    ఇలాంటి ఫార్ములానే అక్షయ్ కుమార్ ‘టాయిలెట్ ఏక్ ప్రేమ్ కథా' చిత్రంలో వాడారని... ఏక్ ప్రేమ్ కథ అనేది హిందీలో రాసి టాయిలెట్ అనేది ఇంగ్లీషులో రాశారని, దీని వెనక న్యూమరాలజీ లెక్కలు ఉన్నాయని అంటున్నారు.

    English summary
    Difference between the title of the film Bahubali – on the poster and on the certificate is revealed. While on the posters of Bahubali The Beginning and Bahubali The Conclusion, the word Bahubali is written with a single ‘A’, the censor certificates of both the movies has the word Bahubali with double ‘A’. It is numerology strategy.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X