twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అమెరికాలో ‘పికె’ రికార్డు బద్దలు కొట్టిన ‘బాహుబలి’

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘బాహుబలి' చిత్రం అమెరికా బాక్సాఫీసు వద్ద కూడా తన సత్తా చాటుతోంది. యూఎస్ఏ బాక్సాఫీసు వద్ద తొలిరోజు అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా ‘బాహుబలి' సరికొత్త రికార్డు సృష్టించింది. తెలుగు సినిమా సత్తా చాటింది.

    ఇప్పటి వరకు అమెరికాలో విడుదలైన భారతీయ సినిమాల్లో రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో అమీర్ ఖాన్ నటించిన ‘పికె' చిత్రం టాప్ పొజిషన్లో ఉంది. ‘పికె' చిత్రం అక్కడ తొలి రోజు 0.97 మిలియన్ డాలర్లు(రూ. 6.15 కోట్లు) వసూలు చేసింది. అయితే రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘బాహుబలి' పికె రికార్డును బద్దలు కొట్టింది.

    ‘బాహుబలి' సినిమా అమెరికా బాక్సాపీసు వద్ద తొలి రోజు ఏకంగా 1.30 మిలియన్ డాలర్లు(రూ. 8.24 కోట్లు) వసూలే చేసింది. ఈ సినిమా తొలి రోజే ఇంత భారీ మొత్తం వసూలు చేసిందంటే మున్ముందు ఈ చిత్రం ఎన్ని రికార్డులు సృష్టిస్తుందో అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

     Baahubali USA box office report

    రెండు తెలుగు రాష్ట్రాల్లోనే ఈ సినిమా 24 కోట్ల షేర్ సాధించింది. ఇదీ కాక తెలుగు ఓవర్సీస్ మార్కెట్, తమిళ వెర్షన్, హిందీ వెర్షన్ అన్నీ కలుపుకుంటే ఎంత వసూలు చేస్తుందో ఊహకు అందని విధంగా ఉంది. తెలుగులో ఈ చిత్రం తొలి వారం పూర్తయ్యేనాటికి వసూళ్లు 100 కోట్లు దాటడం ఖాయంగా కనిపిస్తోంది. ఫస్ట్ వీకెండ్ (శుక్ర, శని, ఆది) పూర్తయ్యే నాటికి రూ. 70 కోట్ల పైన వసూలు చేస్తుందని అంచనా.

    రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా, రమ్యకృష్ణ, సత్యరాజ్ తదితరులు ప్రధాన పాత్రల్లో రెండు భాగాలు ఈ చిత్రాన్ని రూ. 250 కోట్ల ఖర్చుతో తెరకెక్కించారు. ప్రస్తుతం విడుదలైంది తొలి భాగమైన ‘బాహుబలి-ది బిగినింగ్'. రెండో భాగం 2016లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

    English summary
    Baahubali USA box office report.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X