twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వీడియో లీక్: ‘బాహుబలి’ నిర్మాత ఫిర్యాదు, అరెస్టు

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: ‘బాహుబలి' సినిమా టీంకు లీక్ రూపంలో పెద్ద షాక్ తగిలింది. ఈ చిత్రానికి సంబంధించిన 12 నిమిషాల ఫైటింగ్ సీన్ వీడియో ఒకటి ఇంటర్నెట్‌లో లీక్ అయింది. సినిమా షూటింగు దశలోనే ఈ లీక్ వ్యవహారం వెలుగు చూడటంతో ‘బాహుబలి' టీం ఆందోళనలో పడింది. వెంటనే రంగలోకి దిగిన టెక్నికల్ టీం ఆ వీడియోను ఇంటర్నెట్ నుండి క్షణాల్లో తొలగించేసారు.

    అయితే కొందరు ఈ వీడియోను సోషల్ నెట్వర్కింగ్ సైట్ల ద్వారా స్ప్రెడ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ వీడియో స్ప్రెడ్ కాకుండా బాహుబలి టీం సభ్యులు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మొత్తానికి ‘బాహుబలి' టీంను ఈ సంఘటన మేలు కొలిపేలా చేసింది. సినిమాకు సంబంధించిన ఏ విషయమూ లీక్ కాకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసారు.

    ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

    'Baahubali' video leaked

    కాగా.....వీడియో లీకు వ్యవహారంపై చిత్ర నిర్మాతలు సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసారు. ఇప్పటికే పోలీసులు ఈ లీక్ వెనక గల వ్యక్తులను అరెస్టు చేసారు. వీడియోను ఎవరైనా సోషల్ మీడియా ద్వారా లీక్ చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేసారు.

    ‘బాహుబలి' చిత్రానికి గ్రాఫిక్స్ వర్క్ చేస్తున్న కంపెనీలో పని చేసే మాజీ ఉద్యోగి ఈ వీడియో లీక్ చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ వీడియో లీకు వల్ల సినిమాకు జరిగే నష్టం ఏమీ లేదని అంటున్నారు. ఇది గ్రాఫిక్స్ వర్క్ చేయని వీడియో కావడం వల్ల ఆందోలన చెందాల్సిన అవసరం అదనే వాదన వినిపిస్తోంది.

    ‘బాహుబలి' సినిమాకు టాకీ పార్టు పూర్తయింది. జనవరి 24న ఇందుకు సంబంధించిన షూటింగ్ పూర్తి చేసారు. ఇక దర్శకుడు రాజమౌళి అండ్ టీం పోస్టు ప్రొడక్షన్ పనుల మీద దృష్టి పెట్టారు. షూటింగ్ మొదలైనప్పటి నుండే పారలాల్ గా డబ్బింగ్ మొదలు పెట్టడంతో తెలుగు, తమిళం బాషల్లో ‘బాహుబలి' పార్ట్ -1కు సంబంధించిన అందరు ఆర్టిస్టుల డబ్బింగ్ పనులు ఇప్పటికే పూర్తయ్యాయి.

    డాల్బీ అట్మాస్ సౌండ్ మిక్సింగుతో వస్తున్న తొలి తెలుగు సినిమా ఇదే కావడం మరో విశేషం. ఇందుకు సంబంధించిన పనులు ఫిబ్రవరిలో మొదలు కానున్నాయి. ప్రముఖ సౌండ్ ఇజనీర్ పి.ఎం.సతీష్ సౌండ్ డిజైన్ మీద, డెబాజిత్ చాంగ్‌మై సౌండ్ మిక్సింగ్ మీద పని చేస్తున్నారు. బ్యాగ్రౌండ్ స్కోరు, సంగీతం అద్భుతంగా రావడానికి ఎంఎం కీరవాణి రాత్రి పగలనక కృష్టిచేస్తున్నారు.

    ఇక పోస్టు ప్రొడక్షన్ పనుల్లో అతి ముఖ్యమైన ‘విఎఫ్ఎక్స్' పనులు వేగంగా సాగుతున్నాయి. ఈ విభాగంలో నేషనల్ అవార్డు విన్నింగ్ పర్సన్ శ్రీనివాస్ మోహన్ ఆధ్వర్యంలో ఇందుకు సంబంధించిన పనులు జరుగుతున్నాయి. ఇండియా, హాంకాంగ్, యూనైటెడ్ స్టేట్స్ లోని వివిధ స్టూడియోల్లో ఇందుకు సంబంధించిన పనులు జరుగుతున్నాయి. సినిమాకు సంబంధించిన అఫీషియల్ రిలీజ్ డేట్, ఆడియో వేడుక, ట్రైలర్స్ ఎప్పుడు అనే విషయం త్వరలో టీం బాహుబలి వారు వెల్లడించనున్నారు.

    తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రం తమిళ రైట్స్ ‘యూవి క్రియేటన్స్' వారు భారీ ధరకు సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. స్టూడియో గ్రీన్ సంస్థతో సంయుక్తంగా ‘బాహుబలి' చిత్రాన్ని వీరు తమిళనాడులో విడుదల చేయనున్నారు. తెలుగులో యూవి క్రియేషన్స్ వారు ఇంతకు ముందు ప్రభాస్ హీరోగా ‘మిర్చి' చిత్రాన్ని తెరకెక్కించి విజయం సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. తమిళనాడులో స్టూడియో గ్రీన్ సంస్థకు మంచి నెట్వర్క్ ఉంది.

    ప్రభాస్ కెరీర్లో ఈ సినిమా ఓ గొప్ప మైలురాయిగా ఉంటుందని అంటున్నారు. మరో వైపు అనుష్క, రానా కూడా ఈ చిత్రంలో మెయిన్ రోల్స్ చేస్తున్నారు. ఈ సినిమా కోసం యావత్ తెగులు ప్రేక్షకులతో పాటు తమిళ ప్రేక్షకులు కూడా ఎదురు చూస్తున్నారు.

    English summary
    'Baahubali' video leaked. Producers have filed a complaint with Cyber Crime and the police have already arrested the people behind this issue.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X